💥మనలోని అనంత చైతన్యమే శ్రీ ఆంజనేయం
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం
దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం |
సకలగుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ||
🌹భావము:-
ఎవరికీ సమానము కాని శక్తిని సొంతం చేసుకొని, బంగారు వర్ణము కలిగిన కొండంత శరీరం, భూత ప్రేత పిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి, ఙ్ఞానులలో అగ్రగణ్యుడు, అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.
🍁🍁🍁🍁🍁
💥మనలోని అనంత చైతన్యమే శ్రీ ఆంజనేయం.
రామాయణంలో వానర జంట అయిన కేసరి, అంజన పుత్రుడిగా దర్శనమిచ్చే హనుమంతుడు నిజానికి ప్రతివ్యక్తిలో నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక.
శివపార్వతుల శృంగార క్రీడలో ఉత్తేజితమైన అద్భుత శక్తి, వాయు సంగృహీతమై అంజని గర్భం ద్వారా ఆంజనేయుడి రూపంలో అవతరించింది.
శివాంశ అయిన హనుమంతుడు బ్రహ్మ వల్ల వరాలు పొందడం, విష్ణువును సేవించడం వల్ల త్రిమూర్తిత్వ భావనకు ప్రతీకగా కనిపిస్తాడు.
బుద్ధిని ప్రచోదన చేయగలిగిన చైతన్యానికి అధిదేవత అయిన సూర్యభగవానుడి దగ్గర సకల విద్యలూ అభ్యసించాడు.
💥#తాత్వికంగా...
రాముడు మన ఆత్మ, సీత హృదయం, లక్ష్మణుడు మనతో ఎల్లప్పుడూ ఉండే చైతన్యం.
రావణుడు మనసు.
ఈ మనసు ఆత్మనుంచి హృదయాన్ని దొంగిలించింది. ఆ హృదయాన్ని తిరిగి ఆత్మ దగ్గరికి చేర్చడంలో సహాయకారిగా నిలిచిన అంతర్ దృష్టి, ధైర్య సాహసాల రూపమే హనుమ.
అంతేకాదు, ‘హ’ కారం ఆకాశాన్ని తెలుపుతుంది.
సృష్టి, స్థితి, లయాత్మకమైన అనంత చైతన్య తత్వానికది ప్రతీకగా నిలుస్తుంది.
'ను’ కారం ఉపాసనకు, ‘మాన్’ మనసుకు ప్రతీకలు.
మనసు- హృదయం- ఆలోచనలకు సంబంధించినది.
‘హనుమాన్” అంటే ఏ అనంత చైతన్యమైతే మన జీవితాలలో ప్రకాశాన్ని నింపుతుందో ఆ చైతన్యానికి ప్రతిరూపంగా చెప్పవచ్చు.
💥#ఆధ్యాత్మికంగా...
హనుమ సహస్రారాన్ని చేరుకున్న సాధకుడు.
ఆతని స్ఫూర్తి భౌతిక జీవితంలో వికాసాన్ని కలిగిస్తుంది.
ఆత్మపరిశీలన ద్వారా నిరంతరం లోటుపాట్లను సవరించుకుంటూ.. సృజనాత్మక ఆలోచనలతో, అహంభావ రహితంగా, భేషజాలు లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించాలని తెలియజేస్తుంది హనుమ జీవనవిధానం.
💥#పరిపూర్ణ_సాధకుడు
ప్రతివ్యక్తిలో ప్రచ్ఛన్నంగా ఉండే అనంతమైన చైతన్యాన్ని జాగృతం చేసుకున్న సాధకుడు హనుమంతుడు.
సీతాదేవి అనంత చైతన్యానికి సూచిక.
రావణుడు అహంకారానికి చిహ్నం.
సీత అనే చైతన్యం రావణుడు అనే అహంకారానికి బందీ అయింది.
అహంకారాన్ని సేవా భావంతో నిగ్రహించుకోవడం వల్ల సీత అనే చైతన్యాన్ని జాగృతం చేసుకోగలిగిన ఉత్తమ సాధకుడు హనుమంతుడు.
లోపల నిగూఢంగా దాగున్న శక్తిసామర్థ్యాలను గుర్తించి, అనుభవంలోకి తెచ్చుకోవడమే సాధన.
💥అదృష్టం తన ముఖం చాటేసినప్పుడు, దురదృష్టం క్రూరత్వాన్ని ప్రదర్శించినప్పుడు మనకు తోడుగా నిలిచేది ఆత్మవిశ్వాసం మాత్రమే.
ఆ ఆత్మవిశ్వాసమే హనుమను నడిపించింది.
యుద్ధంలో ఎలా చావాలో తెలిసిన వ్యక్తే, నిజ జీవితంలో ఎలా జీవించాలో అర్థం చేసుకోగలుగుతాడు.
యుక్తితో, బుద్ధితో లంకలో తిరగడం వల్ల అక్కడి రక్షణ వ్యవస్థ ఆనుపానులను, శస్ర్తాస్త్ర నిల్వలను, బలగాల మోహరింపును సమగ్రంగా తెలుసుకున్నాడు హనుమ.
ఒక్కడే నిరాయుధుడై వచ్చి అక్కడి వనరులను వాడుకొని లంకను అల్లకల్లోలం చేసి తిరిగి వెళ్లడం అపూర్వమని, ఇలాంటి యోధులు లక్షల సంఖ్యలో వస్తే ఎదుర్కొనేదెట్లా అనే మీమాంస లంకా నగరవాసులను, వారి నాయకులను ఆత్మరక్షణలో పడేసింది.
"చూసి రమ్మంటే కాల్చి వచ్చిన" ఘనత హనుమకు దక్కింది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment