🕉️🚩 ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🙏
🏵️🌼🏵️🌼🏵️
గంగధార సమం తీర్థం క్షైత్రం సింహాద్రి నాసమం
నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయః
🌹గంగధారకి సరియైన తీర్థం, సింహగిరికి సమమైన క్షేత్రం, నారసింహుని వంటి దైవం ముల్లోకాల్లోనూ లేదన్నది తథ్యం.
🍁🍁🍁🍁🍁
💥త్రేతాయుగంలో భారతావనిని పరిపాలిస్తున్న చంద్ర వంశీయుడైన "పురూరవ" చక్రవర్తి ఒకనాడు ప్రేయసి ఊర్వశితో కలిసి ఆకాశయానం చేస్తూ సింహగిరి పరిసరాలకు రాగానే వారి పుష్పక విమానం నిలిచిపోయింది.
విషయం తెలియక పురూరవుడు దిగులు చెందాడు. ఊర్వశి తన దివ్యదృష్టితో తామున్నది పరమ పవిత్రమైన సింహగిరి ప్రాంతమని గ్రహిస్తుంది.
ఇక్కడ వరాహ నృసింహుడు కొలువైనాడనీ, స్వామిని దర్శించి తరిద్దామని పురూరవునికి సూచిస్తుంది.
పురూరవుడు స్వామి వెదుకులాటలో మూడు రోజులు గడుపుతాడు.
ఎంతకీ స్వామి కానరాకపోవడంతో ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు.
రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరిస్తాడు.
తాను పక్కనే ఉన్న పుట్టలో ఉన్నానని గంగధారని ఆనవాలుగా చూపుతాడు.
స్వామి ఆదేశానుసారం పురూరవుడు వేయి కడవల నీటితోనూ, పంచమృతాలతో అభిషేకం చేసి స్వామి దర్శనాన్ని పొందుతాడు.
అయినను స్వామి పాదాలు కానరాక పురూరవుడు కలత చెందుతాడు.
అంత స్వామి పాదాలు ప్రయత్నగోపితాలని షోడశోపచారాలు భక్తితో నెరవేర్చి శ్రీచందనాన్ని ఆచ్ఛాదింపజేయమని,
ఏడాదికి ఒక్కనాడే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనం చేయమని అశరీరవాణి పలుకుతుంది. పురూరవుడు అలా చేసి తరిస్తాడు.
ఆనాడే "అక్షయతృతీయ"
🔸🔹🔸🔹🔸
సింహాచలేశుని పురూరవుడు పుట్ట నుండి వెలికితీసినట్లు మనకు క్షేత్ర మహాత్మ్యం వలన తెలుస్తోంది.
కానీ స్వామి చాలా కాలంపాటు ఎటువంటి చందనపు పూతలు లేకుండానే అనేక మందికి దర్శనమిచ్చాడని,
పురూరవుని కంటే ముందే "దుగ్గన" అనే బోయెపల్లెకి చెందిన వ్యక్తి స్వామిని దర్శించాడని స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది.
💥దుగ్గనబోయె కథ...
సింహాచల సమీపంలోని బోయెపల్లెకి చెందిన దుగ్గన అనే బోయవాడు పోడు వ్యవసాయం చేస్తూ కొర్రలు పండించేవాడట.
అప్పన్న వరాహావతారంలో సంచరిస్తూ కొర్రలు తిని ఆ రుచికి అలవాటు పడ్డాడు.
ఏదో జంతువు పంట పాడుచేస్తోందని తలచి మాటున దాగిన దుగ్గడికి వరాహం కనిపించింది.
మాటుపెట్టి రొమ్ముపై బల్లెంతో పొడిచాడు.
ఆ దెబ్బకు రక్తం కారుతూ వరాహం పుట్టలోకి జొరబడింది.
‘పాము పుట్ట చొచ్చునుగాని పంది జొచ్చునా’ అని ఆశ్చర్యపడిన దుగ్గన పుట్టలో చూడగా రక్తం కారుతున్న వరాహ నృసింహుడు కనిపించాడట.
అంతట దుగ్గన బోయెడు సింహగిరిపై లభించే వనమూలికలను చందనపు ముద్దతో రంగరించి స్వామికి పట్టువేశాడట.
అంతట స్వామి ఆనతి ప్రకారం కటకం వెళ్లి రాజు పురూరవుడికి వరాహ నారసింహుడి వృత్తాంతం తెలిపినట్లు ఇక్కడి వారి నమ్మిక.
💢🌼💢🌼💢
నమస్తస్మై భగవతే నాధాయ హరి భూభృతః
యస్యప్రసాద గంధేన నిరశ్యనే్త మహార్తయః
🌹ఇలపై వెలసిన శ్రీ వరాహ నారసింహుని దర్శిస్తే,
ఆ శ్రీహరి గంధ ప్రసాదాన్ని స్వీకరిస్తే సమస్త పాపాలు, సకల రోగాలు హరిస్తాయి.
సేకరణ...💐🙏

Comments
Post a Comment