💥వైశాఖ శుక్ల చతుర్దశి "నరసింహ జయంతి"
⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥వైశాఖ శుక్ల చతుర్దశి "నరసింహ జయంతి"
ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్ మృత్యుం నమామ్యహం !!
వైశాఖ శుక్ల చతుర్దశి నాడు శ్రీ హరి నరకేసరిగా అవతరించారు.
పరమపావనమైన ఈ తిథిని "నరసింహ జయంతి"గా చేసుకోవడం సంప్రదాయం.
భాగవతం ఏడో స్కందంలో భక్తుడి మాటకు కట్టుబడి శ్రీ మహావిష్ణువు నరసింహుడిగా ఆవిర్భవించిన ఘట్టం అద్భుతం.
🍁🍁🍁🍁🍁
🌹భగవత్ తత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వాడు ప్రహ్లాదుడు.
తాను నమ్మిన దైవం సృష్టిలో అణువణువునా ఉన్నాడని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడు కూడా!
అందుకే, తండ్రి ‘ఏడిరా నీ శ్రీహరి.
ఈ స్తంభంలో చూపగలవా?’ అని గద్దించి ప్రశ్నించినప్పుడు.. తొట్రుపాటుకు గురి కాకుండా, ‘సందేహమే లేద’న్నాడు.
గదా ఘాతంతో స్తంభాన్ని కూల్చాడు హిరణ్యకశిపుడు.
భీకర రూపంతో నరసింహస్వామి అవతరించాడు.
స్తంభోద్భవుడైన ఆ నరసింహుడు అంత ఆవేశంలోనూ బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలను నిష్ఫలం చేయలేదు.
ఆయనిచ్చిన వరాల్లో లేని రూపాన్ని పొందాడు.
తన తెలివితేటలతో మృత్యువును జయించాలని తలచిన రాక్షసుడి ఎదుట మృత్యువై నిలిచాడు.
భగవంతుడిని ఎందులోనూ ఎవరూ జయించలేరు.
సర్వోన్నతుడనే మాటకు అర్థమదే!
షరతులకు లోబడి హిరణ్యకశిపుడిని సంహరించాడు శ్రీహరి.
🌹ధర్మానికి కష్టం వచ్చినప్పుడు తాను వస్తానని ప్రకటించాడు శ్రీమహావిష్ణువు.
భరించేంత వరకూ ఆదమరిచే ఉంటాడు.
కట్టు దాటితే.. ఆయన కూడా పట్టుదలకు పోతాడు అని నిరూపిస్తుంది నరసింహస్వామి అవతారం.
తన పరమభక్తుడు, సేవకుడు అయిన ప్రహ్లాదుడి మాటను నిజం చేయడానికి, ఇంకా చెప్పాలంటే భగవంతుడు సర్వవ్యాప్తుడు అని నిరూపించడానికి నరకేసరి అవతారం మంచి ఉదాహరణ.
🌹అద్వైతం అచ్యుతమ్ అనాదిమ్ అనంత రూపమ్
- భగవంతుడు అసంఖ్యాకమైన రూపాలు, శరీరాకృతులు కలవాడు.
భగవంతుడు కరుణాసాగరుడు.
మానవ మాత్రులను అనుగ్రహించడానికి వీలుగా అర్చావతార మూర్తిగా గుళ్లలో వెలుస్తాడు.
ఆగమ ఉపచారాలతో శాస్ర్తోక్తంగా స్వామివారిని ప్రతిష్ఠించిన నరసింహస్వామి దేవాలయాలలోని మూర్తికి, వైకుంఠంలో ఉన్న నరసింహస్వామికి భేదం లేదు.
కోవెలలో వెలసిన స్వామిని చూడటం వైకుంఠ ఆలయంలోని ప్రహ్లాద వరదుడిని స్వయంగా దర్శించడమే అవుతుంది.
🔸🔹🔸🔹🔸
నరసింహ జయంతి రోజున...
పురాతన నరసింహ క్షేత్రాలను గానీ, సమీపంలో ఉన్న నరసింహస్వామి గుడికి గానీ వెళ్లాలి.
శక్తి ఉన్న భక్తులు సాయంత్రం వరకు ఉపవాసం పాటించాలి.
నరసింహ మంత్రం, స్తోత్రాలు, ‘హరేకృష్ణ’ మహామంత్రం జపించాలి.
శక్తి ఉన్నవాళ్లు హోమం, కల్యాణం, అభిషేకం తదితర సేవల్లో పాలుపంచుకోవాలి.
భగవంతుడి లీలలను వినడం, చదవడంతోపాటు స్వామి లీలావిలాసాలను వర్ణించిన భాగవతాన్ని పఠించాలి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment