💥గం గణపతే నమో నమ - ముత్తయ్య భాగవతార్ కృతి
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥గం గణపతే నమో నమ - ముత్తయ్య భాగవతార్ కృతి
గం గణపతే నమో నమ! శంకరి తనయా నమో నమో!
అంకుశధర! మంగళకర! పంకజ చరణా! వారణ!
పంకజాసనాది వందిత! భక్తార్తి హరణ!ముదిత!
కుంకుమాప! గుణ నిధే! హరికేశ కుమార! మందార!
🌹భావం:
సమస్త విఘ్నములను అణచే శక్తిని కలిగిన బీజాక్షరం గం.
ఆ "గం" బీజాక్షరముగా కలిగిన పార్వతీదేవి తనయుడైన గణపతికి వందనములు.
అంకుశము ఆయుధముగా ధరించి, కమలముల వంటి చరణములు కలిగి, సమస్త శుభములు కలిగించే గజముఖునికి వందనములు.
బ్రహ్మాది దేవతలచే పూజించబడే, భక్తుల ఆర్తిని హరించి ఆనందాన్ని కలిగించే,
కుంకుమ చేత పూజించబడిన, సుగుణములకు నిధియైన, శివుని కుమారుడు, భక్తుల పాలిట కల్పవృక్షమైన గణపతికి వందనములు.
🍁🍁🍁🍁🍁
ఏదైనా కార్యాన్ని ప్రారంభించేముందు... భగవన్నామ స్మరణ మనకు విజయాలను సంప్రాప్తింపజేసేలా చేస్తుంది....
అందునా విఘ్ననాయకుడైన వినాయకుడి...
"శ్రీ గణనాయకాష్టకం" అన్ని విజయాలకు దగ్గరయ్యేలా చేస్తుంది..
అందుకే ఏదైనా కార్యం తలపెట్టేటపుడు శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం మంచిది....
💥గణనాయకాష్టకం...
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || 1 ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేఽహం గణనాయకమ్ || 2 ||
చిత్రరత్నవిచిత్రాంగచిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 4 ||
మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || 5 ||
యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ || 6 ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తప్రియం మదోన్మత్తం వందేఽహం గణనాయకమ్ || 7 ||
సర్వవిఘ్నకరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేఽహం గణనాయకమ్ || 8 ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || 9 ||
ఇతి శ్రీ గణానాయకాష్టకమ్ |
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment