💥అయమేవ అయమేవ ఆదిపురుషో... (అన్నమాచార్య సంకీర్తన)

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥అయమేవ అయమేవ ఆదిపురుషో... (అన్నమాచార్య సంకీర్తన)


అయమేవ అయమేవ ఆదిపురుషో

జయకరం తమహం శరణం భజామి


అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో-

ప్యయమేవ వటదళాగ్రాధీశయన:

అయమేవ దశవిధైరవతార రూపశ్చ

నయమార్గ భువిరక్షణం కరోతి


అయమేవ సతతం శ్రియహ్పతి ర్దేవేషు

అయమేవ దుష్టదైత్యాంత కస్తు

అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య

ప్రియభక్తపోషణం ప్రీత్యాదనోతి


అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజితే

అయమేవ వరదోప్యాచకానాం

అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో

అయమేవ వైకుంఠాధీశ్వరస్తు

🍁🍁🍁🍁🍁


🌹#భావం:


ఈతడే ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు),

సకల జయములు, శుభములు కలిగించు ఈతనిని నేను రక్షణ కోసం సేవించుచున్నాను.


ఈతడే కదా పూర్వము భూమిని ధరించినవాడు,  పెద్దదైన మర్రి ఆకు మీద శయనించిన వాడు అతడు కూడా ఈతడే.

(ఈ భూమి/సృష్టి మొత్తం నాశనం అయినప్పుడు, మహా విష్ణువు మరల సృష్టి చేయడానికి ముందు ఒక చిన్న బాలుడు రూపంలో మర్రి ఆకును పడవ గా చేసుకుని దానిపై పవళించినాడుట.

(అన్నమయ్య రాసిన సంకీర్తన "తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు" చదివితే మరింత అర్ధం అవుతుంది). 


ఈతడే  పది రకాల అవతార రూపుడు మరియు న్యాయ మార్గము నందు  భూలోక రక్షణను చేయుచున్నాడు.

ఈతడే లక్ష్మికి భర్త. ఎల్లప్పుడూ దేవతల అందరిలోనూ దుష్ట రాక్షసులను అంతం చేసే ఆతడు ఈతడొక్కడే.


ఈతడే సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉండి) ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని

ప్రేమతో చేయుచున్నాడు.


(ఈ వాక్యం మరింత అర్ధం అవ్వాలంటే అన్నమయ్య కీర్తన "భూమిలోన పుట్టి సర్వ భూత ప్రాణులకెల్ల జీవసాన మోసేటి దేవుడ నేను" వినండి)


ఈతడే శ్రీ వేంకటగిరి యందు శోభిల్లుతూ అడిగిన వారికి వరములిచ్చేవాడు.

ఈ వేంకటేశ్వరుడే వేదముల చేత, వేదాంతులచేత సూచించబడినట్టి ఆ శ్రీమన్నారాయణుడు/ వైకుంఠాధీశుడు అయి ఉన్నాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు