💥జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి... సుబ్రహ్మణ్యుడు.
⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 కుమారేశసూనో! గుహ! స్కన్ద! సేనా – పతే! శక్తిపాణే! మయూరాధిరూఢ | పులిన్దాత్మజా కాన్త! భక్తార్తిహారిన్! – ప్రభో! తారకారే! సదా రక్ష! మాం త్వమ్ 💥భావం: కుమారస్వామీ! ఈశ్వరపుత్రా! గుహా! స్కందా! దేవసేనాపతీ! శక్తి యను ఆయుధము హస్తమునందు గలవాడా! నెమలినెక్కినవాడా! వల్లీ నాథా! భక్తుల బాధలను తీర్చునట్టి ప్రభూ ! తారకాసురుని సంహారించిన సుబ్రహ్మణ్యా ! నీవు నన్నెప్పుడూ రక్షించుము. 🍁🍁🍁🍁🍁 💥 జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి... సుబ్రహ్మణ్యుడు. స్కందుడు రాశీభూతమైన జ్ఞానస్వరూపుడు. ఆయన చేతిలోని 'శక్తి' ఆయుధం సునిశితమైన మేధకు ప్రతీక. ఇచ్చా, జ్ఞాన, క్రియాశక్తులనే మూడుశక్తుల సంయోగ స్వరూపంగా నిలిచి, అజ్ఞానం అనే తారకాసురుడిని సంహరించి, జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేసిన విజ్ఞానమూర్తి ఆయన. గొప్పజ్ఞానంతో పాటు అపారమైన భుజశక్తికి కూడా స్కందుడు ప్రతీక. రాక్షససంహార విషయంలో దేవతలకే సేనానాయకుడిగా నిలిచి, వారిని ఆదుకున్న ధీశాలి సుబ్రహ్మణ్యుడు. స్కన్నమైన (జారిన) వాడు స్కందుడు. శివుని ఆత్మజ్యోతినుండి ఆవిర్భవించిన ఆరు జ్యోతులస్వరూపమే సుబ...