💥ఉమామహేశ్వర స్తోత్రం - తాత్పర్యం💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱


💥"శివపార్వతులు" అనగానే అభేద్యమైన ప్రకృతీపురుషుల రూపము,

విలక్షణమైన అలంకారాలు, వాహనాలు, అనుగ్రహ లక్షణాలు, అదే సమయంలో ఒకరికొకరు పరిపూరకమై, అనుషంగికమైన తత్త్వము గోచరిస్తాయి.


శివపార్వతుల అభేద్యమైన ఏకత్వంలో వారి వారి విభిన్నమైన లక్షణాలను శంకర భగవత్పాదులు "ఉమామహేశ్వర స్తోత్రం"లో వర్ణించారు.


శంకరులు ఈ స్తోత్రంలో ఆది దంపతుల మహిమను, వైభవాన్ని అద్భుతంగా వర్ణించారు.

🍁🍁🍁🍁🍁


💥ఉమామహేశ్వర స్తోత్రం - తాత్పర్యం💥


నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం

పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ ।

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 1 ॥


💥తాత్పర్యం:

ఎల్లప్పుడూ యవ్వనంగా, అర్థనారీశ్వర రూపంలో ఒకటై, పర్వతరాజ పుత్రికగా ఒకరు, వృషభము సంకేతముగా ఇంకొకరు ఉన్న శివ పార్వతులకు నమస్కారములు.


నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం

నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ ।

నారాయణేనార్చితపాదుకాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 2 ॥


💥తాత్పర్యం:

వారి సరసము ఒక ఉత్సవముగ ఉన్న, నమస్కరించేవారికి వరాలు ప్రసాదించే, నారాయణుని చేత పూజింపబడిన పాదములు కలిగిన శివ పార్వతులకు నమస్కారములు


నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరించివిష్ణ్వింద్రసుపూజితాభ్యామ్ ।

విభూతిపాటీరవిలేపనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 3 ॥


💥తాత్పర్యం:

నందిని అధిరోహించి, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుల చేత పూజించబడిన, విభూతి మరియు గంధములతో విలేపనము చేసిన శరీరములు కలిగిన శివ పార్వతులకు నమస్కారములు.


నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం

జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ ।

జంభారిముఖ్యైరభివందితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 4 ॥


💥తాత్పర్యం:

ఈ జగత్తుకే అధినాయిక, అధిపతి అయిన, ఎల్లప్పుడూ జయం కలిగే వారికి, ఇంద్రాది ప్రముఖులచే వందితమైన శివ పార్వతులకు నా నమస్కారములు.


నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం

పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ ।

ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 5 ॥


💥తాత్పర్యం:

పరమౌషధమైన వారికి, పంచాక్షరీ పఠనం మరల మరల చేయుటతో సంతోషించే, ప్రపంచ సృష్టి, వినాశనం చేసే శివపార్వతులకు నమస్కారములు.


నమః శివాభ్యామతిసుందరాభ్యాం

అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ ।

అశేషలోకైకహితంకరాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 6 ॥


💥తాత్పర్యం:

అత్యంత సుందరమైన రూపముతో, భక్తుల హృదయ పద్మములందు ఆసక్తి కలిగిన, ఈ లోకాని అత్యంత హితము కలుగ చేసే శివ పార్వతులకు నా నమస్కారములు.


నమః శివాభ్యాం కలినాశనాభ్యాం

కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ ।

కైలాసశైలస్థితదేవతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 7 ॥


💥తాత్పర్యం:

కలి యొక్క ప్రభావాన్ని నాశనము చేసే, ఒక పక్క కపాలాది భయానక అలంకారము, ఇంకొక పక్క శుభకరమైన రూపము కలిగిన, కైలాస పర్వతము మీద నివసించి ఉన్న శివ పార్వతులకు నమస్కారములు.


నమః శివాభ్యామశుభాపహాభ్యాం

అశేషలోకైకవిశేషితాభ్యామ్ ।

అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 8 ॥


💥తాత్పర్యం:

ఆశుభాలను, పాపాలను నాశనము చేసే, లోకములోకెల్లా విశేషమైన వారి, అమోఘమైన జ్ఞానము, కుశలత కలిగి, అమోఘమైన జ్ఞాపక శక్తి కలిగిన శివ పార్వతులకు నా నమస్కారములు.


నమః శివాభ్యాం రచితాభయాభ్యాం

రవీందువైశ్వానరలోచనాభ్యామ్ ।

రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 9 ॥


💥తాత్పర్యం:

ఆశ్రితులకు అభయమిచ్చే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగి, పూర్ణచంద్రుని వలె ముఖ కమలములు ఉన్న శివ పార్వతులకు నమస్కారములు.


నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం

జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ ।

జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 10 ॥


💥తాత్పర్యం:

జటా ఝూటములు ధరించి, వృద్ధాప్యము, మరణము లేని వారి, విష్ణు, బ్రహ్మల చే పూజించబడే శివపార్వతులకు నమస్కారములు.


నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం

బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యామ్ ।

శోభావతీశాంతవతీశ్వరాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 11 ॥


💥తాత్పర్యం:

కష్టకాలములో మనకు వారి చల్లని చూపులతో రక్షణ కలిగించే, మారేడు, మల్లెలతోకూడిన మాలలు ధరించి, శాంతితో శోభితమైన శివపార్వతులకు నా నమస్కారములు.


నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం

జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ ।

సమస్తదేవాసురపూజితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ॥ 12 ॥


💥తాత్పర్యం:

పశుపతి యైన, మూడు లోకాలను కాపాడే బాధ్యతను స్వీకరించిన, దేవతలు, అసురులచే పూజించ బడిన శివ పార్వతులకు నమస్కారములు.


స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం

భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః ।

స సర్వసౌభాగ్యఫలాని

భుంక్తే శతాయురాంతే శివలోకమేతి ॥ 13 ॥


💥తాత్పర్యం:

ఈ పన్నెండు శ్లోకాలు కలిగిన స్తోత్రాన్ని మూడు కాలాలలో పఠనం చేసిన వారికి అన్ని శుభ ఫలాలు కలిగి, దీర్ఘాయుష్షు తర్వాత శివలోక ప్రాప్తి కలుగును.


ఇతి ఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణం |

సేకరణ... (అంతర్యామి - అంతయును నీవే... అక్కిరాజు ప్రసాద్ గారు)💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం