🌺🔱మాతంగ తనయా మనసా స్మరామి🌺🔱

 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏


🌺🔱మాతంగ తనయా మనసా స్మరామి🌺🔱


💥శ్యామలాదేవి


భండాసురుడనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి శ్రీలలితా దేవి గా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో "శ్యామలాదేవి"ని సృష్టించింది.


16 మందిలో ముఖ్యమైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమంచింది లలితదేవి.

అందుకే  శ్యామలాదేవిని "మహామంత్రిణీ" దేవి అని కూడా అంటారు.

ఈ తల్లిని దశ మహా విద్యల్లో  "#మాతంగి" అని పిలుస్తారు. 


💥మాతంగి అనే పేరు ఎలా వచ్చింది 


"మతంగ" మహర్షి గొప్ప తపస్వి.

వారు హిమవంతునికి స్నేహితుడు. ఒకనాడు హిమవంతుడు, ఆయన గౌరి దేవికి తండ్రిని అని చెప్తూ, అతిశయంతో చెప్తారు.


ఈ మాటకి అవమానపడినట్లుగా భావించి, మతంగ మహర్షి తపస్సు చేస్తారు.

ఆయన లలితాపరాభట్టారికా స్వరూపమైన శ్యామలాదేవి (ముద్రిణీ దేవి, మంత్రిణీదేవి అని కూడా అంటారు) ని ఉద్దేశించి తపస్సు చేశారు. 


ఆయన తపస్సుకి మెచ్చిన శ్యామలాదేవి, మతంగ మహర్షి భార్య అయిన సిద్ధమతి దేవికి స్వప్నంలో కనిపించి ఒక పువ్వుని ప్రసాదంగా ఇస్తారు.


అనతి కాలంలోనే మతంగ మహర్షి, సిద్ధమతిదేవి లకి ఒక చక్కని ఆడపిల్ల జన్మించినది.

ఆ వచ్చినది అమ్మవారే.

ఆమెని లఘుశ్యామ అని పిలిచారు. అంటే చాలా తక్కువ సమయంలో జన్మించింది అని.

ఆమెనే మాతంగి, మాతంగ కన్యకా అని పేర్లతో కూడా పిలుస్తారు.


ఈవిడకు  నీల సరస్వతి,  గేయ చక్ర వసిని, లఘు శ్యామల, వాగ్వాధిని శ్యామల, నకుల శ్యామల, హసంతి  శ్యామల, సర్వసిద్ది మాతంగి, వాస్య మాతంగి, సారిక శ్యామల, శుక శ్యామల, రాజ మాతంగి అని ఎన్నో నామాలున్నాయి.


💥మాతంగియే రాజ శ్యామల, లలితా పరాభట్టారికా స్వరూపం కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లియే ఆమె. 


శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధించగలవు.


💥గుప్త నవరాత్రుల్లోని తొమ్మిదిరోజులు అమ్మవారి అలంకారాలు


తొలిరోజు కాళికా దేవి..


రెండో రోజు త్రిపుర తారా దేవి (శైలపుత్రి పూజ)


మూడో రోజు సుందరీ దేవి (బ్రహ్మచారిని పూజ)


నాలుగో రోజు భువనేశ్వరి దేవి (చంద్రఘంట పూజ)


ఐదో రోజు మాతా చిత్రమాతా త్రిపుర దేవి (కుష్మాండ పూజ)


ఆరో రోజు భైరవి దేవి (స్కందమాత పూజ)


ఏడో రోజు మాధుమతి దేవి (శక్తి)


ఎనిమిదో రోజు మాతా బాగళాముఖి దేవి (కాత్యాయని పూజ)


తొమ్మిదో రోజు మాతంగి కమలాదేవిగా (మహాగౌరి పూజ) అలంకరించి పూజిస్తారు.

🍁🍁🍁🍁🍁


💥శ్రీ శ్యామలా స్తోత్రమ్


జయ మాతర్విశాలాక్షీ జయ సంగీతమాతృకే |

జయ మాతంగి చండాలి గృహీతమధుపాత్రకే  || ౧ ||


నమస్తేస్తు మహాదేవి నమో భగవతీశ్వరీ |

నమస్తేస్తు జగన్మాతర్జయ శంకరవల్లభే  || ౨ ||


జయ త్వం శ్యామలేదేవీ శుకశ్యామే నమోస్తుతే |

మహాశ్యామే మహారామే జయ సర్వమనోహరే  || ౩ ||


జయ నీలోత్పలప్రఖ్యే జయ సర్వవశంకరి |

జయ త్వజాత్వసంస్తుత్యే లఘుశ్యామే నమోస్తుతే  || ౪ ||


నమో నమస్తే రక్తాక్షి జయ త్వం మదశాలిని |

జయ మాతర్మహాలక్ష్మి వాగీశ్వరి నమోస్తుతే  || ౫ ||


నమ ఇంద్రాదిసంస్తుత్యే నమో బ్రహ్మాదిపూజితే |

నమో మరకతప్రఖ్యే శంఖకుండలశోభితే  || ౬ ||


జయ త్వం జగదీశాని లోకమోహిని తే నమః |

నమస్తేస్తు మహాకృష్ణే నమో విశ్వేశవల్లభే  || ౭ ||


మహేశ్వరి నమస్తేస్తు నీలాంబరసమన్వితే |

నమః కళ్యాణి కృష్ణాంగి నమస్తే పరమేశ్వరీ  || ౮ ||


మహాదేవప్రియకరి నమస్సర్వవశంకరి |

మహాసౌభాగ్యదే నౄణాం కదంబవనవాసిని  || ౯ ||


జయ సంగీతరసికే వీణాహస్తే నమోస్తుతే |

జనమోహిని వందే త్వాం బ్రహ్మవిష్ణుశివాత్మికే  || ౧౦ ||


వాగ్వాదిని నమస్తుభ్యం సర్వవిద్యాప్రదే నమః |

నమస్తే కులదేవేశి నమో నారీవశంకరి  || ౧౧ ||


అణిమాదిగుణాధారే జయ నీలాద్రిసన్నిభే |

శంఖపద్మాదిసంయుక్తే సిద్ధిదే త్వాం భజామ్యహమ్  || ౧౨ ||


జయ త్వం వరభూషాంగి వరాంగీం త్వాం భజామ్యహమ్ |

దేవీం వందే యోగివంద్యే జయ లోకవశంకరి  || ౧౩ ||


సర్వాలంకారసంయుక్తే నమస్తుభ్యం నిధీశ్వరి |

సర్గపాలనసంహారహేతుభూతే సనాతని  || ౧౪ ||


జయ మాతంగతనయే జయ నీలోత్పలప్రభే |

భజే శక్రాదివంద్యే త్వాం జయ త్వం భువనేశ్వరి  || ౧౫ ||


జయ త్వం సర్వభక్తానాం సకలాభీష్టదాయిని |

జయ త్వం సర్వభద్రాంగీ భక్తాఽశుభవినాశిని  || ౧౬ ||


మహావిద్యే నమస్తుభ్యం సిద్ధలక్ష్మి నమోస్తుతే |

బ్రహ్మవిష్ణుశివస్తుత్యే భక్తానాం సర్వకామదే  || ౧౭ ||


మాతంగీశ్వరవంద్యే త్వాం ప్రసీద మమ సర్వదా |

ఇత్యేతచ్ఛ్యామలాస్తోత్రం సర్వకామసమృద్ధిదమ్  || ౧౮ ||


శుద్ధాత్మా ప్రజపేద్యస్తు నిత్యమేకాగ్రమానసః |

స లభేత్సకలాన్కామాన్ వశీకుర్యాజ్జగత్త్రయమ్  || ౧౯ ||


శీఘ్రం దాసా భవంత్యస్య దేవా యోగీశ్వరాదయః |

రంభోర్వశ్యాద్యప్సరసామవ్యయో మదినో భవేత్  || ౨౦ ||


నృపాశ్చ మర్త్యాః సర్వేఽస్య సదా దాసా భవంతి హి |

లభేదష్టగుణైశ్వర్యం దారిద్ర్యేణ విముచ్యతే  || ౨౧ ||


శంఖాది నిధయోద్వార్థ్సాస్సాన్నిధ్యం పర్యుపాసతే |

వ్యాచష్టే సర్వశాస్త్రాణి సర్వవిద్యానిధిర్భవేత్  || ౨౨ ||


విముక్తః సకలాపద్భిః లభేత్సంపత్తి ముత్తమాం |

మహాపాపోపపాపౌఘైస్సశీఘ్రం ముచ్యతే నరః  || ౨౩ ||


జాతిస్మరత్వమాప్నోతి బ్రహ్మజ్ఞానమనుత్తమమ్ |

సదాశివత్వమాప్నోతి సోంతే నాత్ర విచారణా  || ౨౪ ||


ఇతి శ్రీ శ్యామల స్తోత్రం సంపూర్ణం ||

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️


Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం