💥🔱దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము🔱💥 (వశిష్ట మహర్షి కృతం) - తాత్పర్య సహితం
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔱హర హర మహాదేవ శంభో శంకర🔱
💥🔱దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము🔱💥
(వశిష్ట మహర్షి కృతం) - తాత్పర్య సహితం
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।
కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥
💥తాత్పర్యము:
విశ్వేశ్వరుడు, నరకమనే సాగరమును దాటించేవాడు, శ్రవణానంద మైన వాడు, నెలవంకను ధరించిన వాడు, కర్పూరము యొక్క కాంతి వలె తెల్లగా ఉన్నవాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.
గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥
💥తాత్పర్యము:
పార్వతీ ప్రియ వల్లభుడు, చంద్ర వంకను ధరించిన వాడు, యముని అంతము చేసే వాడు, సర్పములను కంకణములుగా ధరించిన వాడు, గంగను కేశములలో ధరించిన వాడు, గజాసురుని సంహరించిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.
భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ ।
జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥
💥తాత్పర్యము:
భక్తులకు ప్రియుడు, రోగ భయమును పోగొట్టే వాడు, ఉగ్రుడు, సంసారమనే సాగరాన్ని దాటించే వాడు, జ్యోతిర్మయుడు, గుణ నామ కీర్తనకు నృత్యం చేసే వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ ।
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥
💥తాత్పర్యము:
పులిచర్మమును ధరించే వాడు, శ్మశానములో కాలే శవముల భస్మమును శరీరమునకు పూసుకొనిన వాడు, నుదుట కన్ను కలవాడు, రత్నములు పొదిగిన కుండలములు చెవులకు ధరించిన వాడు, మంచి ధ్వని కలిగించే ఆభరణములు కాళ్ళకు ధరించిన వాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు
పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
ఆనంద భూమి వరదాయ తమోపయాయ ।
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥
💥తాత్పర్యము:
పంచముఖములు కలిగిన, ఫణి రాజు ఆభరణముగా కలిగిన వాడు, బంగారు వస్త్రములు ధరించిన వాడు, త్రిలోక వంద్యుడు, వర ప్రదాత, ఆనంద సాగరుడు, అంధకారము నిండినవాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు
భానుప్రియాయ భవసాగర తారణాయ
కాలాంతకాయ కమలాసన పూజితాయ ।
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥
💥తాత్పర్యము:
సూర్యునికి ప్రియమైన వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, యముని సంహరించేవాడు, బ్రహ్మచే పూజించబడిన వాడు, మూడు కన్నులు కలిగిన వాడు, అన్ని శుభలక్షణములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు
రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవ తారణాయ ।
పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥
💥తాత్పర్యము:
రామునికి ప్రియమైన వాడు, రామునికి వరములు ప్రసాదించిన వాడు, నాగ జాతికి ప్రియమైన వాడు, నరకమనే సాగరాన్ని దాటించేవాడు, పుణ్యాల్లో పుణ్యము కలిగిన వాడు, దేవతలచే కొలువబడిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ ।
మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥
💥తాత్పర్యము:
ముక్తిని ప్రసాదించు వాడు, వృషభ వాహనాన్ని కలిగిన వాడు, ఏనుగు చర్మాన్ని ధరించిన వాడు, మహేశ్వరుడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ ।
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥
💥తాత్పర్యము:
వశిష్ఠ మహాముని రచించిన ఈ స్తోత్రము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పఠించిన వారికి అన్ని సంపదలు కలిగి చివరకు స్వర్గ ప్రాప్తి కలుగును.
॥ ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్ ॥
సేకరణ... 💐🙏

Comments
Post a Comment