💥శ్రీ కార్తికేయ ప్రజ్ఞావివర్ధన స్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏


💥మురుగన్_శ్లోకం:

ఉద్యద్భానుసహస్రకోటిసదృశంశక్తిప్రదంషాణ్ముఖం

గంగాధరగిరిరాజకన్యకప్రియంవేదస్తుతంశ్రీకరం

భవబంధమోచనరక్షణాదక్షభావార్ద్రతత్త్వాత్మకం

సుబ్రహ్మణ్య ఉపాస్మహే సతతం బ్రహ్మణ్యతత్త్వాత్మకం ||

🍁🍁🍁🍁🍁


💥శ్రీ కార్తికేయ ప్రజ్ఞావివర్ధన స్తోత్రం💥


స్కంద ఉవాచ ।

యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః ।

స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః ॥ 1 ॥


గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః ।

తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః ॥ 2 ॥


శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః ।

సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః ॥ 3 ॥


శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ ।

సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః ॥ 4 ॥


అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ ।

ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ ॥ 5 ॥


మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనమ్ ।

మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణా ॥ 6 ॥


ఇతి శ్రీరుద్రయామలే ప్రజ్ఞావివర్ధనాఖ్యం శ్రీమత్కార్తికేయస్తోత్రమ్ ॥

🔸🔹🔸🔹🔸🔹


💥కార్తికేయుని 28 నామములు:


1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి.


2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి.


3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు.


4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.


5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు.


6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది.


7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.


8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.


9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది.

అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.


10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.


11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.


12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు.


13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.


14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.


15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.


16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.


17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.


18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు.


19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.


20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.


21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.


22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.


23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.


24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.


25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.


26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.


27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.


28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.


💥స్కందుని ఈ  28 నామాలకీ "ప్రజ్ఞావివర్ధక" నామాలని పేరు. 


💥ఆ కార్తికేయుడే స్వయంగా ఈ కార్తికేయ స్తోత్రము పఠించడం వలన కలిగే #ఫలశృతి ని చెప్పి ఉన్నారు.


💥#స్కంద_ఉవాచ:

ఈ "ప్రజ్ఞావివర్ధన" కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది.


💥ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతఃకాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం