💥 మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥 మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి


💥మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను "భీష్మ పంచకాలు"గా భావిస్తారు. 


భారత యుద్ధం సమయంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు... ఉత్తరాయణం వచ్చే వరకూ అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెపుతారు.


💥మహాభారతం పేరు వినగానే ముందుగా మనకు స్ఫురించేది వ్యాసభగవానుడు.. తరువాత భీష్ముడే.


భీష్ముడు తన తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం వరం కారణంగా, ఆయన కోరుకొన్నట్టుగా, ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్య పైనే ఉండి,


ధర్మరాజుకు రాజధర్మాలు, ధర్మమార్గం, వంటి ఎన్నో విషయాలు బోధించి, ధర్మప్రబోధకుడుగా భారత చరిత్రలో సుస్థిర స్థానం పొందాడు.


కురుక్షేత్ర సంగ్రామంలో  శిఖండి వేసిన బాణ పరంపర వల్ల భీష్ముడు నేలపై పడబోతుండగా, భీష్ముడుకు అర్జునుడు అంపశయ్య ఏర్పాటు చేసాడు. 


💥ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే, శ్రీకృష్ణుడు భీష్ముడు వద్దకు వచ్చాడు.

సాక్షాత్తు విష్ణువునే దర్శిస్తున్నట్లు తన్మయత్వం పొందాడు.


ఆ వసుదేవుని దివ్య నామాలతో స్తుతించాడు. స్వచ్ఛంద మరణం వరం ఉన్నా, స్వర్గానికి వెళ్ళడానికి శ్రీకృష్ణుని అనుమతి కోరాడు.


అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు, ఇతర బంధువులను ఉద్దేశించి "మీ చేత కూడా అనుమతించబడ్డాను కదా" అంటూ వారందర్నీ ఆలింగనం చేసుకొన్నాడు.


💥భీష్ముడు ప్రాణాలను త్యజించిన విధానం


భీష్ముడు యోగధారణ చేత మనసును నిగ్రహించి, ప్రాణా పానాది వాయువులను నియంత్రించి, ఒక్కొక్క అవయవము నుండి ఒక్కొక్క ప్రాణాన్ని తొలగించుకొంటూ ఉండగా, ఆ భాగాలన్నీ శల్యరహితాలయ్యాయి.


భీష్ముని అన్ని అవయవాలు నిర్వీర్యం అయిన పిమ్మట, ఆత్మ శిరస్సుని ఛేదించుకొని, మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ, ఆకాశంలో అంతర్థానమైపోయింది.

అప్పుడు పై నుండి దేవతలు పూలవర్షం కురిపించారు. 


💥భీష్ముల వారికి మాఘ శుద్ధ ఏకాదశి రోజు ఉత్తర క్రియలు ధర్మరాజు, అతని సోదరులు పూర్తి చేస్తారు. 

ఆ రోజును శ్రీకృష్ణ పరమాత్మ భీష్మఏకాదశిగా ప్రకటించి,


మానవాళి అందరూ ఆయన బోధించిన ధర్మాచరణ, సత్యవచనం, కర్మ, జ్జాన మార్గాలను అనుసరిస్తూ భీష్మాష్టమి, భీష్మ ఏకాదశిని పాటించండని తెలిపాడు.


వైయాఘ్య్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే వసూ రామావతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచారిణే


- అంటూ ఈ రోజున భీష్మునకు తర్పణం విడవాలని చెబుతారు. ఈ తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన.


ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు