ఈశ్వర జ్ఞానంతో, నడిచే జగం... ఈ రెండు కలిసిన విశ్వరూపమే "వినాయక" స్వరూపం.

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో

అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!

🍁🍁🍁🍁🍁


💥సప్తకోటి మహామంత్ర మంత్రితావయవ ద్యుతిః 


"ఏడు కోట్ల మంత్ర రాశికి మూలమైనవాడు" అని గణపతి సహస్రనామాలలోని మాట.


ఆ మంత్ర రాశియే స్వామివారి లంబోదరం. వేదమంత్ర స్వరూపుడు కనుక ఈతడు బుద్ధిశక్తికి అధిష్టానదేవత కూడా.


💥స్వామి నామాలే గణపతి తత్త్వాన్ని తెలుపుతాయి.


వక్రతుండ:

వక్రతలను తొలగించువాడు. తిన్నగా పని సాగనివ్వని విఘ్నాలే వక్రాలు. ఆ వంకరలను హరించే స్వామి గణపతి.


ఏకదంత:

'ఏక’ అనగా ప్రధానం. ‘దంత’ అంటే బలం.

ప్రధాన బల స్వరూపుడు.

అతని దివ్యాకారంలోని ఏకదంతం శివశక్తుల ఏకత్వానికి ప్రతీక.

ఆడ ఏనుగులకు దంతాలుండవు.

వామభాగం దంత రహితం – దక్షిణ భాగం ఏకదంతం.


వినాయక:

నడిపేవాడు నాయకుడు. సర్వ విశ్వ గణాన్ని నడిపేవాడు వినాయకుడు.

ఈతనికి నాయకుడు ఎవడూ లేడు – విగతనాయకః – కనుక ఈతడు వినాయకుడు.


హేరంబ:

'హే’ శబ్ధం దీనవాచకం. ‘రంబ’ పాలవాచకం. దీనపాలకుడు హేరంబుడు.


శూర్పకర్ణ:

పొల్లును చెరిగి సారాన్ని మిగిల్చే చేటవలె, నిస్సారాన్ని వదలి, సారవంతమైన వాక్కుల్ని గ్రహించే తత్త్వమే చేటచెవుల దొర స్వరూపం.


మాయా వికారాలనే పొల్లుని తొలగించి, సారమైన బ్రహజ్ఞానాన్ని మిగిల్చే తత్త్వమిది.


💥బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు సైతం తమతమ విశ్వ నిర్వహణ కార్యాలకు ఆరంభంగా గణపతిని కొలుస్తారని పురాణ ప్రతీతి.

సర్వదేవమయుడైన గణేశుని అనేక రూపాలను వేద పురాణాగమనాలు పేర్కొన్నాయి.


"కంఠోర్ధ్వంతు పరబ్రహ్మా – కంఠాధస్తు జగన్మయః"


ఈశ్వర జ్ఞానంతో, నడిచే జగం... ఈ రెండు కలిసిన విశ్వరూపమే "వినాయక" స్వరూపం.


"ప్రణవ స్వరూప వక్రతుండం వాతాపి గణపతిం"అని ముత్తుస్వామి దీక్షితార్ కృతి.


అదే విధంగా ‘గణపతి’, ‘గణేశ’ నామాలలో కూడా ఎంతో జ్ఞానం నిగూఢమై ఉంటుంది.


అనంత విశ్వాన్ని చూస్తే, అందులో ఎన్నో గణాలు. నక్షత్ర గణాలు, గ్రహ గణాలు, వాయువుల గణాలు. అలాగే భూమి ఒక గ్రహం, అందు అనేక గణాలు. 


వృక్ష గణాలు, నదీ గణాలు, పర్వ గణాలు, పక్షి గణాలు, జంతు గణాలు, మనుష్య గణాలు. వాటన్నింటిలోనూ మరెన్నో గణాలు.


ఈ విభిన్న గణాలంతా వ్యాపించి ఉన్నది పరమేశ్వర చైతన్యమే.

మన శరీరంలో కూడా ఇంద్రియ గణాలు, ఉప గణాలు, గుణగణాలు ఎన్ని ఉన్నా అంతా కలిపి నేను అనే ఆత్మ చైతన్యం ఎలాగో,

విశ్వ విశ్వాంతరాళలలో వ్యాపించిన భిన్నత్త్వంలోని ఏకత్త్వమే గణపతి తత్త్వం.


‘ఏకం సత్’, ‘ఏకం పరబ్రహ్మ’, ‘ఏకం దైవతం’ అని వేదాంతం ప్రవచించినట్లుగా అన్నిటా వ్యాపించిన ఏక చైతన్యమే ‘గణేశుడు’

🔹🔸🔹🔸🔹🔸🔹


💥శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రం💥


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |

ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః ||


అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |

సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ||


గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |

ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక ||


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ||


ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |

ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ ||


విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |

ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||


విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |

సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే ||


|| ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏