వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱


"కాముని కంటితో నీఱుచేశాడట

కాలుని కాలితో తన్ని వేశాడట"


💥మనకందరికీ చావు పుట్టుకలున్నవని తెలుసు.

పుట్టుకకు కారణం కామం.

చావునకు కారణం కాలుడు.

కామ కారణంగా కలిగిన వస్తువు కాలగ్రస్తమై నశించిపోతూంది.


కామ వీక్షణంతో మోడు కూడా చిగురిస్తుంది.

కాలదర్శనంతో ఎండిపోయి జీర్ణిస్తుంది.


"కాలో జగద్భక్షకః"

కాలం వచ్చిందంటే సూర్యచంద్రాదులున్నూ చూపు లేకుండా పోతున్నారు.


కామం లేకపోతే పుట్టుక లేదు.

కాలం లేకపోతే చావు లేదు.

ఈ రెండింటినీ జయించాలంటే పరమేశ్వరుని వద్దకు వెళ్ళాలి.


అసామాన్యమయిన ఇట్టి వరం అనుగ్రహించగల ఆ వర ప్రసాది...

మన్మథుణ్ణి చూచినంత మాత్రాన దగ్ధం చేసిన వాడికీ, కాలుని కాలితో తన్నిన కాలకాలునికీ చావు పుట్టుకలు లేవు.


ఆయన అనుగ్రహం గనుక సంపాదించుకుంటే మనకు కూడా పుట్టటం గాని గిట్టటంగాని ఉండదు. 


💥అయితే వీరి వద్దకు పోవలసిన అవసరం? 


జబ్బుతో తీసుకుంటున్న మనిషి వైద్యుని దగ్గరకు వెళతాడు.

డబ్బు లేని వాడు యాచనకో చేబదులుకో శ్రీమంతుని వెతుక్కుంటూ వెడతాడు.

ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళవలసి వుంటుంది.

మనకు అది లేదూ, ఇది లేదూ అనే కొరతా, ఫలానా వాడు అవమానించాడు అనిన్నీ

లేక తగిన మర్యాద చేయలేదు అనే దుఃఖమున్నూ జన్మతో వచ్చింది.


ఈ కొరతలను పోగొట్టుకోవలెనంటే, మనసుకు ఒక పూర్ణత్వం సిద్ధించాలంటే పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళాలి.


వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ


💥జగత్తుకు అనగా ప్రపంచానికి "#పార్వతీపరమేశ్వరులు" తలిదండ్రులవలె ఉన్నారు.


ఒకటి వాక్కు మరొకటి దాని అర్థము.

ఈ వాగర్థాలు ఎలా సంపృక్తాలై ఉన్నవో... అనగా ఒక దానిని మరొకటి వదలక చేరి ఉన్నవో,

అట్లే పార్వతీపరమేశ్వరులు ఒకరి నొకరు వదలక, ప్రపంచానికి తలిదండ్రులై ఉన్నారనిన్నీ,

వారికి నా వందనములనిన్నీ కాళిదాస మహాకవి మంగళాచరణం చేస్తున్నాడు.


💥ప్రాణానికి లేక ఆత్మకు, ఆహారం అంటే పుష్టి, ఏమిటీ అని ఆలోచిస్తే ఎప్పుడూ ఆనందంగా వుండడమే. ఈ ఆనందం ఇవ్వగలవారు తల్లిదండ్రులే...


అందరి ఆత్మలకున్నూ పుష్టినీ, ఆనందాహారాలనూ ఇచ్చునది పరాశక్తీ పరమేశ్వరుడూ.


💥మనస్సుకు ఎప్పుడూ ఏదో ఒక చింత.

దీనికి కారణం ఏమిటీ?

జన్మ.


డబ్బులేని వాడు యాచనకు శ్రీమంతుని కడకు వెళ్ళినట్లే "జన్మ ఇక మనకు వద్దు” అని అనుకొన్నవాడు జన్మ లేని వాని కడకు వెళ్ళాలి. అతని అనుగ్రహ మాత్రాన జన్మరాహిత్యం సులభంగాసిద్ధిస్తుంది.


జన్మ లేకపోతే చింతలేదు. అందువల్ల చావు పుట్టుకలులేని పార్వతీపరమేశ్వరుల కడకు మనము వెళ్ళాలి.


💥పరమేశ్వరుడు ఒక్కడు ఉంటే సరిపోదూ మరి అంబిక అవసరమేమిటీ?


పార్వతీ పరమేశ్వరులు వాగర్థాలు కదా, ఈశ్వరుడు కాముని నిగ్రహించింది నొసలికంటితో.


అర్థనారీశ్వర ప్రకృతులగు వీరికి మూడోకన్ను ఉమ్మడి. దానిలో ఆయనకు సాబాలూ ఆమెకుసాబాలూ...


కాలుని తన్నినది ఎడమకాలితో, ఆకాలు అంబికది. అందుచేత కామ విజయానికీ కామ నిగ్రహానికీ అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి. 


జన్మ వద్దనుకుంటే మనం ఈ పురాణదంపతులు ఇద్దరినీ చేర్చి ఉపాసనచేయాలి.


ఏకశరీరులై ఉన్నందున మన పని చాలా తేలికయింది.

వారి అనుగ్రహం ఉంటేచాలు చావుపుట్టుకల సంత మనకుండదు.

🍁🍁🍁🍁🍁


💥సంగీతం ద్వారా భగవదుపాసన చేసిన వారిలో ఒకరు ముత్తయ్య దీక్షితులు...

వారు నవావరణ కీర్తనలను వీణ మీద పాడి అమ్మవారిని ఆరాధించేవారు.


శ్రీ చక్రార్చన చేసే వారు. సంగీతమందు అభిరుచి ఉన్నవారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. 


దీక్షితుల వారు ఒకనాడు ఆలాపన చేస్తూ అందే మునిగిపోయి ఉన్నారు.

ఆనాడు కార్తిక అమావాస్య.


"శ్రీ శ్రీమీనాక్షీ మే ముదం దేహి" అనే చరణం పాడుతున్నారు.


పాట చివర "పాశమోచనీ” అని ఉంటుంది.


'ముదం దేహి పాశమోచని’ అని పాడుతూండగా వారి శ్వాస అట్టే ఆగిపోయింది. మరణబాధే లేదు. సంకీర్తనచేస్తూ తన్మయులైపోయారు.

ఎప్పుడూ దేనిని తలుస్తూ ఉన్నారో ఆ వస్తువే అయిపోయారు.

మరణమనేది లేక ఆనందంలో లయం పొంది జనన మరణాలులేని స్థితిని పొందారు. 


💥చావు పుట్టుకలు రెండున్నూ దుఃఖం కలిగించేవే.

జనన నివృత్తిని వెతుక్కుంటూ... ప్రపంచానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను తలచుచూ

"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” అని మనము వారికి శరణాగతి చెయ్యాలి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥