💥శ్రీ సీతారామ స్తోత్రం💥 - హనూమత్కృతం..

 ⚜️🕉️🚩 శ్రీరామ జయరామ జయజయరామ🌹🙏


💥ధ్యానం


ధ్యాయేదాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్థం

పీతం వాసోవసానం నవకమల దళస్పర్థి నేత్రం ప్రసన్నమ్ ।

వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం

నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రమ్


💥తాత్పర్యం:

ఆజానుబాహుడైన శ్రీరామచంద్రుడు ధనుర్బాణములు ధరించి వున్నాడు. పచ్చని వస్త్రములను ధరించి, పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. కలువరేకులను మించిన సోయగము గల కన్నులాయనవి. ప్రసన్నముగా వున్న ఆయన ఎడమతొడపై తల్లి జానకమ్మ కూర్చొనియున్నది. నీలమేఘశ్యాముడైన రామయ్యతండ్రి సీతమ్మ ముఖకమలాన్ని పరికించుతున్నాడు. ఆయన జటామండల ధారియై, సర్వాలంకారాలతో శోభిస్తూ వున్నాడు. అటువంటి సీతాసహితుడై వున్న శ్రీరామచంద్రుని నేను ధ్యానించుకుంటున్నాను.


(ఈ దృశ్యాన్ని మనసులో ఊహించుకుంటూ భక్తిగా నమస్కరించుకుందాం)


ప్రక్కన సీతమ్మ తల్లి వుండడం వలన శ్రీరామచంద్రుడి వదనం ప్రసన్నంగా వుంది. వారి అనుగ్రహాన్ని సంపాదించడానికి ఇదే కదా సరైన సమయం! 

🍁🍁🍁🍁🍁


💥శ్రీ సీతారామ స్తోత్రం💥 - హనూమత్కృతం..


అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికామ్ ।

రాఘవాణామలంకారం వైదేహానామలంక్రియామ్ ॥ 1 ॥


రఘూణాం కులదీపం చ నిమీనాం కులదీపికామ్ ।

సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవామ్ ॥ 2 ॥


పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః ।

వశిష్ఠానుమతాచారం శతానందమతానుగామ్ ॥ 3 ॥


కౌసల్యాగర్భసంభూతం వేదిగర్భోదితాం స్వయమ్ ।

పుండరీకవిశాలాక్షం స్ఫురదిందీవరేక్షణామ్ ॥ 4 ॥


చంద్రకాంతాననాంభోజం చంద్రబింబోపమాననామ్ ।

మత్తమాతంగగమనం మత్తహంసవధూగతామ్ ॥ 5 ॥


చందనార్ద్రభుజామధ్యం కుంకుమార్ద్రకుచస్థలీమ్ ।

చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపాణికామ్ ॥ 6 ॥


శరణాగతగోప్తారం ప్రణిపాదప్రసాదికామ్ ।

కాలమేఘనిభం రామం కార్తస్వరసమప్రభామ్ ॥ 7 ॥


దివ్యసింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్రభూషణామ్ ।

అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణకాంక్షిణౌ ॥ 8 ॥


అన్యోన్యసదృశాకారౌ త్రైలోక్యగృహదంపతీ।

ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతామ్ ॥ 9 ॥


అనేన స్తౌతి యః స్తుత్యం రామం సీతాం చ భక్తితః ।

తస్య తౌ తనుతాం పుణ్యాః సంపదః సకలార్థదాః ॥ 10 ॥


ఏవం శ్రీరామచంద్రస్య జానక్యాశ్చ విశేషతః ।

కృతం హనూమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదమ్ ।

యః పఠేత్ప్రాతరుత్థాయ సర్వాన్ కామానవాప్నుయాత్ ॥ 11 ॥


ఇతి హనూమత్కృత-సీతారామ స్తోత్రం సంపూర్ణమ్ ॥

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏