Posts

Showing posts from August, 2024

💥శ్రీకృష్ణావతారం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ కృష్ణాయ నమః 🌹🙏 💥 శ్రీకృష్ణావతారం "కృష్ణం ధర్మం సనాతనం" అని పురాణ వాక్యం. కృష్ణ: అంటే అపరమిత ఆనంద స్వరూపుడు.  "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనగా సాధు జన రక్షణ, దుష్ట జన శిక్షణ, ధర్మ సంస్థాపనానికై తాను మళ్ళీ మళ్ళీ అవతరిస్తానని స్వయంగా ప్రకటించిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. రామావతారంలో రాజుగా ఆర్తులను, దీనులను, భక్తులను ఆదుకున్నా అందరికీ అందుబాటులో లేని కారణంగా కృష్ణుడు క్షత్రియ వంశంలో పుట్టి కూడా రేప ల్లెలోని గోపాలకులతో, గోపికలతో, గోవులతో కలసి మెలసి తిరిగాడు. పాపాలకు దూరంగా ఉన్న వారితోనే, వారిలోనే ఉంటానని చాటాడు. బాలునిగా ఉండి రేపల్లెలో ధర్మానికి హాని కలిగించే కంసుడు పంపిన రాక్షసులను వధించాడు.  చివరికి కంసుని కూడా వధించగా ఆ వైరముతో తనపై కక్ష కట్టి దాడి చేసిన జరాసంధుని సైన్యాన్ని పద్దెనిమిది సార్లు హతమార్చాడు. చక్రవర్తి అయిన జరాసంధుడు ఎపుడు యుద్ధానికి వచ్చినా 23 అక్షౌహిణిల సైన్యాన్ని తీసుకొని వచ్చేవాడు. అక్షౌహిణి (10 వేల రధాలు, ఇరవై వేల ఏనుగులు, ఇరవై వేల గుర్రాలు, 40 వేల సైన్యం) ఈ విధంగా 18 సార్లు ఓడించి అనగా ...

💥 శ్రావణ బహుళ అష్టమి.. శ్రీకృష్ణాష్టమి (జన్మాష్టమి)

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీకృష్ణాయ నమః 🌹🙏 💥 శ్రావణ బహుళ అష్టమి.. శ్రీకృష్ణాష్టమి (జన్మాష్టమి) శ్రావణ బహుళ అష్టమి.. రోహిణీ నక్షత్రం.. నాల్గవపాదం, బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః| జయతు జయతు మేఘ శ్యామలః కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః|| #తాత్పర్యం: ఓ దేవకినందనా! ఓ వృష్ణివంశ మంగళ దీపమా! సుకుమార శరీరుడా! మేఘశ్యామ! భూభారనాశ ముకుంద! నీకు సర్వదా జయమగుగాక! ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమానమగుచూ తన లీలావినోదాదులచే బాల్యము నుండే, అడుగడుగనా భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనములో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట! వెన్న జ్ఞానమునకు సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యం కాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలు కొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ ఉంట...

⚜️🕉️🚩జై శ్రీ కృష్ణ 🌹🙏

Image
 ⚜️🕉️🚩జై శ్రీ కృష్ణ 🌹🙏

⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏 💥అఖండమైన, అద్వితీయమైన పరబ్రహ్మం తేజోమయ అంశమే మనకు కనబడుతున్న సూర్య భగవానుడు. ఇతనే సర్వేశ్వరుడు, ప్రత్యక్ష దైవం కూడా.  చరాచరాత్మకమైన విశ్వమంతటికీ సూర్య భగవానుడే ఆత్మగా ఉన్నాడు. ‘సూర్య ఆత్మా జగస్తస్థుషశ్చ’ అని శ్రుతివాక్యం. లోకాల మనుగడకు, పోషణకు, సర్వజీవులకు సూర్యుడే ఆధారం. ఆయన వల్ల ప్రకృతిలో చైతన్యం ఏర్పడుతున్నది. ‘ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ, నారాయణ సరసిజాసన సన్నివిష్టః’ అంటే సూర్య మండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తే ధ్యానింపదగిన మూర్తి అనీ, దానినే ఎప్పుడూ ధ్యానించాలని ఆదిత్య హృదయం చెప్తున్నది. ‘ఉద్యంత మస్తయంత మాదిత్య మభిధ్యాయన్‌ కుర్వన్‌ బ్రహ్మణో విద్వాన్‌ సకలం భద్రమశ్నుతే’- ‘ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యుణ్ని ఎవరు ధ్యానిస్తున్నారో, వారికి అన్ని శుభాలూ కలుగుతాయి’ అని శ్లోక భావం. అన్ని యంత్రాలకు, మంత్రాలకు, తంత్రాలకు చైతన్యాన్ని కలిగించేది తేజోమయ రూపిణి అయిన గాయత్రీ మాతే! ఆవిడే పరాశక్తి. ‘ఏ తేజస్సు మా బుద్ధులను ప్రేరేపిస్తున్నదో, వెలుగుతున్న సవితృమూర్తి (సూర్య భగవానుడి) శ్రేష్ఠమైన ఆ తేజస్సును ఉపాసిస్తున్నాం’ అని గాయత్రీ మంత్రానికి అర...

⚜️🕉️🚩ఓం కృష్ణాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం కృష్ణాయ నమః🌹🙏

💥తిరుమలలో శ్రీకృష్ణాష్టమి.. ఉట్ల ఉత్సవం.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥తిరుమలలో శ్రీకృష్ణాష్టమి.. ఉట్ల ఉత్సవం. శేషాద్రిపై వెలసివున్న కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమలలోని శ్రీవారి ఆలయంలో  శ్రీకృష్ణ జన్మాష్టమిని, ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ కృష్ణుడే గోవిందుడని, ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు యదార్థమని ఎందరో ఆళ్వారులు, కన్నడదాసులు, తాళ్ళపాక అన్నమాచార్యులు సైతం ఎన్నో పదకవితలను కృష్ణ గోవిందులకు అభేదం తెలుపుతూ వర్ణించారు, స్తుతించారు. వేంకటాచల మహత్మ్యంలో సైతం వేంకటేశుడే శ్రీకృష్ణుడని పేర్కొనబడినది. చారిత్రక నేపథ్యాన్ని గమనిస్తే శ్రీవారి ఆలయ ఒకానొక అర్చకులైన పెరియపెరుమాళుకు, శ్రీరంగ క్షేత్రం నుండి వచ్చిన వారియర్‌ అనే సంకీర్తనాచార్యునికి, అలాగే చిరుక్కన్‌ అనే మరో భక్తునికి తిరుమలలో ఒకనొక ఉత్సవం సందర్భంగా ఈ ముగ్గురికి శ్రీకృష్ణ భగవానుడు స్వప్నంలో ఒకే సమయంలో కనిపించి.. "ఓ భక్తులారా! కలియుగంలో అత్యంత ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమలలో పూర్వం నా జన్మాష్టమిని పురస్కరించుకొని వేడుకలు ఎంతో ఘనంగా జరుగుత...

⚜️🕉️🚩 జై శ్రీ కృష్ణ🌹🙏

Image
 ⚜️🕉️🚩 జై శ్రీ కృష్ణ🌹🙏

⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా॥ లక్ష్మి అంటే ‘శుభలక్షణ లక్షిత’ అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా, గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి. ధైర్యం, వీర్యం, ఆరోగ్యం, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అని వివిధ పేర్లతో, పలు రూపాల్లో కొలుస్తుంటాం. పవిత్రంగా, ప్రశాంతంగా ఉండే ఇండ్లలో, మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవే ప్రకటించింది. శుద్ధలక్ష్మి అంటే పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఇంటినీ, తమ ఒంటినీ శుభ్రంగా ఉంచుకున్న వారింటికి పిలవకపోయినా సిరి నడిచి వస్తుంది. శుద్ధి అంటే పైకి కనిపించేది మాత్రమే కాదు! అంతర్‌ శుద్ధి కూడా. సర్వకాలాల్లో బాహ్యంగా, మానసికంగా శుద్ధి ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. బూజు కొట్టుకుపోయిన పైకప్పు, మురికిపట్టిన గచ్చుతో కళావిహీనంగా ఉండే ఇండ్లలో లక్ష్మీదేవి అరక్షణం కూడా నిలువదు. తిట్లు, శాపనార్థాలు, పరనింద చేసే మనుషులున్న ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు.  నిరంతరం శుభా...

⚜️🕉️🚩కృష్ణం వందే జగద్గురుమ్ 🌹🙏

Image
 ⚜️🕉️🚩కృష్ణం వందే జగద్గురుమ్ 🌹🙏

⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏 రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ | ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే || 🌹తాత్పర్యము: రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు. 💥సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుంచి వ్యక్తమైన రూపాలే సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు.  వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిల...

💥నరసింహావతారంలోని విశిష్టత

Image
 ⚜️🕉️🚩ఓం లక్ష్మీనృసింహాయ నమః🌹🙏 💥నరసింహావతారంలోని విశిష్టత – ఇది శివ, విష్ణు అంశల కలయిక. స్థితి కారుడైన విష్ణువు నర రూపం, లయకారుడైన శివుడి సింహస్వరూపం రెండూ కలిసి నరసింహ స్వరూపంగా ఆవిర్భవించాయి. విష్ణుమూర్తి సర్వాంతర్యామిత్వాన్ని నరసింహావతారం చాటి చెబుతుంది. ఇదే పరమాత్మ అంతర్యామిత్వం, విష్ణుతత్వం కూడా. ఇక బ్రహ్మపురాణంలో నరసింహ అవతార గాథ ఇతర పురాణాల కన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇందులో ప్రహ్లాదుడి ప్రస్తావన, హిరణ్యకశిపుడి విష్ణుద్వేషం ఉండవు. కేవలం ఋషులు, మునులు, దేవతల బాధా నివృత్తి కోసమే విష్ణుమూర్తి నరసింహుడిగా అవతరించినట్లు చెబుతుంది. విష్ణుపురాణంలో కొంత విభిన్నమైన గాథ కనిపిస్తుంది. మిగిలిన అంశాలన్నీ పోతన రాసిన ప్రహ్లాద చరిత్ర తీరులోనే ఉన్నప్పటికీ, తండ్రి చేసిన తప్పుల్ని మన్నించమని ప్రహ్లాదుడు వేడుకోవటంతో శ్రీహరి అంగీకరించటం, పితాపుత్రులిద్దరూ కలిసి కొంతకాలం జీవించటం జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలానికి విష్ణువు నరసింహరూపంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. వీటితోపాటు పద్మ, విష్ణుధర్మోత్తర, స్కాంద, కూర్మ, లింగ, మత్స్య, భాగవత, నరసింహ, హరివంశ పురాణాల్లో కూడా నరసింహావతార విశేషాలు ఉన...

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏 సేనా విదారక స్కంధ మహాసేన మహాబల! రుద్రోమాగ్నిజ శాద్వాక్త్ర గంగార్భా నమోస్తుతే!! రాక్షససైన్యాన్ని నశింపజేసినవాడా! శరవణ తటాకము నుండి ఒడ్డుకు జారినవాడా! గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు రక్షణగా ఉంచుకునే వాడా, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడా, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడవైనట్టి వాడా, గంగాదేవి గర్భవాసం చేసినట్టి వాడా, షణ్ముఖా, నీకు నమస్కారం. ఈ శ్లోకం మనకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణ స్వరూప, స్వభావ, మహాత్మ్యాలను తెలియజేస్తుంది. దీనిని చెప్పుకొని ప్రార్థిస్తే ఆయన కృపకు ప్రాత్రులమౌతాము. 💥షణ్మతాలలోను ముఖ్యమైనది అగ్ని ఆరాధన. అగ్ని కారమైన ఔపాసనకు శ్రీసుబ్రహ్మణ్యుడు అధిదేవత.  అందువలన ఆయనను వదలిపెట్టి తక్కిన ఐదుగురు గణపతి, సూర్యుడు, శ్రీమహావిష్ణువు, ఈశ్వరుడు, అంబికలను పంచాయతన పూజలో ఆరాధిస్తూన్నాము. అందువలన ఆయన ఆరాధన, పంచాయతన పూజా కలిసి, షణ్మత సాధన అవుతోంది. వైదిక కర్మలలో అగ్నికార్యం హోమం ప్రధానమైనది. శ్రీసుబ్రహ్మణ్యుడు దేవతా విశేషములలో అగ్నిస్వరూపుడు. బయట అగ్ని స్వరూపుడు, ఆత్మ స్వరూపాన గుహుడు. ఆయ...

💥శ్రావణ పూర్ణిమ.. జంధ్యాలపూర్ణిమ

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥శ్రావణ పూర్ణిమను జంధ్యాలపూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి, జప, అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము 'యజ్ఞము' 'ఉపవీతము' అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే 'యాగము' 'ఉపవీతము' అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే "యాగకర్మ చేత పునీతమైన దారము" అని అర్థము. యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాననే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన 'అమరకోశాన్ని' రచించిన అమరసింహుడు.. 'సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః' - అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం, వేదాన్ని అధ్యయనం చేయడం 'ఉపాకరణం' సంస్కార పూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ. మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన...

💥శ్రావణ పూర్ణిమ.. హయగ్రీవజయంతి

Image
 ⚜️🕉️🚩 ఓం హయగ్రీవాయ నమః🌹🙏 💥 శ్రావణ పూర్ణిమ.. హయగ్రీవజయంతి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే॥ అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవుడికి నమస్కరిస్తున్నాను.. అని పై శ్లోకానికి అర్థం. యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారాల్లో ‘హయగ్రీవావతారం’ ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు.. బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్నవారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆదిదంపతులను శరణువేడారు. యోగ నిద్రలో వున్న విష్ణువును మేల్కొలిపితే ఆయనే హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీ దేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గెడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెద పురుగుగా మారి వింటి తాడును తెంపాడు. వింటి తాడు తెగిన...

💥శ్రావణ పూర్ణిమ.. రాఖీపౌర్ణమి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 శ్రావణ పూర్ణిమ.. రాఖీపౌర్ణమి అన్నాచెల్లెళ్ల అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పూర్ణిమ. సిరిసంపదలతో, పూర్ణాయుష్షుతో సోదరులుండాలని, శ్రావణ పూర్ణిమ నాడు అక్కాచెల్లెళ్ళు, సోదరులకు కట్టే ఓ తోరమే (పట్టీ యే) రాఖీ.  అక్కాచెల్లెళ్ళకు రక్షగాఉంటాననే సోదరుల ప్రతినకు ప్రతిరూపమే రాఖీ పండుగ. భవిష్యోత్తర పురాణంలోను, మహాభారత కాలంలోనూ రక్షాబంధన్‌ ప్రసక్తి కనిపిస్తుంది. "రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే, ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధలు ఉండవని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని” శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు. పూర్వం దేవతలు రాక్షసుల యుద్ధంలో దేవేంద్రుడు ఓడిపోవడంతో త్రిలోకాధిపత్యం పోతుంది. అప్పుడు దేవగురువైన బృహస్పతి సలహాతో, శ్రావణ పూర్ణిమ నాడు ఇంద్రుని భార్య శచీదేవి, పార్వతీ పరమేశ్వరులకు, లక్ష్మీనారాయ ణులకు పూజలు సలిపి, రక్షను ఇంద్రుని చేతికి కడుతుంది. దేవతలు కూడా పూజలు చేసి, రక్షలను ఇంద్రుడికి కడతారు. అప్పుడు ఇంద్రుడు రాక్షసులతో యుద్ధంలో గెలిచి, త్రిలోకాధి పత్యాన్ని మళ్ళీ పొందుతాడు. ఆ రకంగా శచీదేవితో ప్రారంభమైన రక్షాబంధనం, అప్పటి నుంచి లోకంల...

💥ఆదిత్యహృదయం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః🌹🙏 💥ఆదిత్యహృదయం💥 తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥ ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥ సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ । చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥ రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ । పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥ సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥ ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః । మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥ పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥ ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥ హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ । తిమిరోన్మథనః శంభుః త్వష్ట...

💥తిరుమలలో పవిత్రోత్సవాలు:

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥తిరుమలలో పవిత్రోత్సవాలు: వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ, మది నిండా భక్తిపారవశ్యాన్ని నింపుతారు. తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో తిరుమలలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున మూడు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. 2024 సంవత్సరంలో ఆగస్టు 15తేదీ అంటే శ్రావణ గురువారం, ఏకాదశి తిథి నుండి శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం అయినాయి. ఆగస్టు 14 తేదీన బుధవారం నుంచే శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. అనంతరం సంపంగి ప్రాకారంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 15వ తేదీన గురువారం నాడు పవిత్రాల ప్రతిష్ట, 16వ తేదీన పవిత్ర సమర్పణ, 17వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం (పురిటి మైల), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాల వల్ల ఆలయంలో తెలిసీతెలియక కొన్ని తప్పులు చోటుచేసుకుంటాయి.అలాంటి  దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహ...

💥వరలక్ష్మీ వ్రతం

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః🌹🙏 సిద్ధ లక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి! శ్రీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా!! కార్యసిద్ధి, సంసారబంధ విమోచనం వల్ల సిద్ధించే మోక్షం, ఆటంకాలను అధిగమించి పొందే జయం, విద్య, సంపద, శ్రేష్టత... ఇవన్నీ వరలక్ష్మీ స్వరూపమైన సద్గుణాలు. ఆ గుణాలను పొందడానికి ఉద్దేశించినదే వరలక్ష్మీ వ్రతం. ఇది అన్ని వ్రతాలలోనూ శ్రేష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారపు శుభదినాన వేకువనే లేచి ఇంటిని శుభ్రపరిచి, గుమ్మాలకు పచ్చని తోరణాలను కట్టి స్నానాదులను ముగించి, పసుపు, కుంకుమ,  పుష్పాక్షతలచే దేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజకు స్థాపించే ప్రదేశంలో పిండితో నేలపై పద్మాన్ని వేయాలి. బంగారు, వెండి, లేదా ఏదైనా లోహపు కలశానికి పసుపురాసి, గంధము పూసి ఆపై కుంకుమబొట్టు పెట్టాలి. కలశాన్ని నీటితో నింపి, దానిలో మామిడాకులు, అక్షతలు ఉంచి పైన కొబ్బరికాయను పెట్టి పిండితో వేసిన పద్మంపై కొత్త రవికలగుడ్డను పరిచి బియ్యంపోసి, దానిపై కలశాన్ని స్థాపించాలి. కొందరు కొబ్బరికాయకు పసుపురాసి, పిండితో ముక్కు, చెవులను, కాటుకతో కళ్ళను దిద్ది, బొట్ట...

💥🌷సకల సౌభాగ్యాలనిచ్చే వరలక్ష్మీ దేవి వ్రతం🌷💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః🌹🙏 💥🌷సకల సౌభాగ్యాలనిచ్చే వరలక్ష్మీ దేవి వ్రతం🌷💥 పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!! కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా... అష్ట లక్ష్ముల్లో ఒకరిగా... స్త్రీల నోముల పంటగా... విరాజిల్లుతోంది వరలక్ష్మీ దేవి.  శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్నే వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ రోజున ఆ తల్లిని నిండు మనసుతో ధ్యానించి... పూజిస్తే... సకల కోరికలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. వరలక్ష్మీ దేవి ఇంకెవరో కాదు... సకల ఐశ్వర్యాలకు అధిదేవత అయిన లక్ష్మీదేవే.  అష్ట లక్ష్ముల్లో వరలక్ష్మీ దేవి కూడా ఒకరైనా... ఆమె పూజకు చాలా ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తికి ఇష్టమైన, అతని జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరిట ఏర్పడిన శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం గురించి సాక్షాత్తూ పరమేశ్వరుడే పార్వతీ దేవికి చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. ఒకరోజు పరమేశ్వరుడు కైలాసంలో మునిగణంతో సమావేశమైయుండగా... పార్వతీ దేవి అక్కడికి వచ్చింది.  స్త్రీలు సకల సంపదలు, పసుపు కుంకుమలతో నిండు న...

💥దత్తాత్రేయుడు💥

Image
 ⚜️🕉️🚩 ఓం దత్తాయ నమః 🌹🙏 💥దత్తాత్రేయుడు💥 అత్రిమహర్షి, అనసూయ ఉత్తమ సంతానం కోసం తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి మీ కోరిక మేరకు మేము ముగ్గురము పుత్రులు అవుతామని వరమిచ్చారు. బ్రహ్మ అంశంతో చంద్రుడు, రుద్రుని అంశంతో దుర్వాసుడు, విష్ణువు అంశంతో దత్తాత్రేయుడు అవతరించారు.  దత్తాత్రేయుడు వేదాంత తత్త్వ శాస్త్రాన్ని అలర్క మహర్షికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఉపదేశించాడు. అలాగే కార్తవీర్యార్జునికి వేయి చేతులను, ఎదురులేని పరాక్రమాన్ని, అఖిల భూమండల ఆధిపత్యాన్ని ప్రసాదించాడు. మోక్షం కోరేవారికి మాత్రమే యోగిగా కనపడాలని, ఇతరులకు భోగిగా కనపడాలని, ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి దూరంగా ఉండాలని ఆచరించి ఉద్భోదించిన మహానుభావుడు.  💥దత్తాత్రేయుని ఆశ్రమంలో ఆయన చుట్టూ 4 కుక్కలు, వాటి చుట్టూ 8 మద్యభాండాలు, వాటి చుట్టూ 16 మంది యువతులు, వారి చుట్టూ 32 వివిధ జంతువుల మాంసఖండాలు, వాటి చుట్టూ 64 విలాస భోగ స్థానాలు.. ఇన్నిటి మధ్యన స్వామి భోగమూర్తిగా వ్యసన లంపటునిగా అజ్ఞానులకు దర్శనమిస్తారు.  వాస్తవానికి జ్ఞానులకు, యోగులకు... 4 కుక్కలు 4 వేదాలు. 8 మద్యభాండాలు అష్ట సిద్ధులు. 16 మంది యువతులు ...

⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏

💥గణేశ అష్టోత్తర శత నామ స్తోత్రమ్💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥గణేశ అష్టోత్తర శత నామ స్తోత్రమ్💥 వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః | స్కందాగ్రజోవ్యయః పూతో దక్షో‌உధ్యక్షో ద్విజప్రియః || 1 || అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదో‌உవ్యయః సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః || 2 || సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః | శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః || 3 || ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః | ఏకదంతశ్చతుర్బాహుశ్చతురశ్శక్తిసంయుతః || 4 || లంబోదరశ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః | కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || 5 || పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః | అకల్మషస్స్వయంసిద్ధస్సిద్ధార్చితపదాంబుజః || 6 || బీజపూరఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ | ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ || 7 || శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః | కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః || 8 || చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః | అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః || 9 || శాంతః కైవల్యసుఖదస్సచ్చిదానందవిగ్రహః | ఙ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః || 10 || ప్రమత్తదైత్యభయదః శ్రీకంఠో విబుధేశ్వరః | ...

💥సుబ్రహ్మణ్యస్వామిని నాగదేవత స్వరూపంగా ఎందుకు పూజిస్తారు?

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః🌹🙏 💥సుబ్రహ్మణ్యస్వామిని నాగదేవత స్వరూపంగా ఎందుకు పూజిస్తారు? సుబ్రహ్మణ్యేశ్వరుడు మన శరీరంలోని కుండలిని శక్తికి సంపూర్ణమైన సంకేతం. మనలో కుండలిని రూపంలోన ఒదిగిన సుబ్రహ్మణ్యుడే పుట్టలో ఒదిగి ఆరాధనలు అందుకుంటున్న మహా సర్పరూపం. మనము మార్గ శీర్ష శుద్ధ షష్ఠి నాడు పుట్టలో పాలని పోస్తాము. పుట్ట ఎవరో కాదు మానవ శరీరమే. మనము కూర్చొనప్పుడు వెనుక నుండి చూస్తే మన విశాలమైన క్రింద భాగం పుట్ట అడుగు భాగం. పోను పోను తల దగ్గరికి సన్నగా వెళ్లే విధానంలోనే పుట్ట ఆకారం ఉంటుంది. ఆ పుట్ట పై ఉండే చిల్లు అది శిరస్సు మధ్యలో ఉండే బ్రహ్మ రంద్రానికి సంకేతం. పాలు ఙ్ఞానమునకు సంకేతం. అందుకే పుట్టలో పాలు పోయడం అంటే శరీరం నిండుగా ఙ్ఞానమును నింపడం అని అర్థం. అంటే ఏది చెయ్యకూడదో, చేయవచ్చునో దాన్ని నింపడం. కుండలం అంటే పాము చుట్ట అని అర్థం. పాము చుట్ట వేసుకొని కూర్చుంటుంది. సాగదీసిన వెన్నెముక నిలబడ్డ పాము యొక్క శరీరం.  పాము పడగ విప్పే విధానం మానవ తల వెనుక భాగం నుండి వ్యాపించే విధానం. పాము చుట్టలు చుట్టుకునేది మూల ఆధార చక్రానికి సంకేతం. మనిషి సుబ్రహ్మణ్య...

⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

💥అరుణాచల అగ్నిలింగం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 💥అరుణాచల అగ్నిలింగం💥 ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు. వీటిలో మొదటిది- “దర్శనాత్ అభ్రశదసి” చిదంబరంలో పరమేశ్వరుడినీ జ్ఞానంతో దర్శించటం. ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే” కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా! అందువల్ల "కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ” వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల “స్మరణాత్ అరుణాచలే” అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది. అచలం అంటే కొండ. ఆ కొండకు ప్రదక్షిణం చెయ్యాలంటే పధ్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కింద ఉన్నభాగాన్ని అరుణాచల పాదాలని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే- కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. భగవాన్ రమణులను చూడ్డానికి ఎవరయినా అరుణాచలం వెళ్తే ఆయన మొదటగా 'గిరి ...

💥శ్రీ పంచాయుధ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం నమో నారాయణాయ 🌹🙏 💥శ్రీ పంచాయుధ స్తోత్రం💥 స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ । సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 1 ॥ తాత్పర్యము: రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్ని శిఖలను క్రక్కుచూ మిరుమిట్లు గొలుపు కాంతులీను ఓ ”సుదర్శన చక్రమా!” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీమహావిష్ణువు యొక్క దక్షిణ హస్త తలమునలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణువేడుచున్నాను. విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా । తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాఽహం శరణం ప్రపద్యే ॥ 2 ॥ తాత్పర్యము: శ్రీమహావిష్ణువు యొక్క అధరామృతమే ఆహారముగ గైకొనుచు, ఆయన పూరించు వాయువుతో నిండి, ఆనందాతిశయముచే నీవు చేయు ధ్వని చెవి సోకినంతనే రాక్షస మూకలందరియొక్క గర్వములను అణగ...

⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏

💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు. పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం.  భృగుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం శ్రీనివాసుడుగా వేంకటాద్రిపై అవతరించడం- ఇదంతా విష్ణు లీలా విశేషమని మహర్షుల మాట. శ్రవణం నక్షత్రంనాడు, మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు. కావున ప్రతీ శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్పస్వామి వారు తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ భక్తులను తరింపజేస్తారు. స్వామివారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం- ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది ‘వినా వేంకటేశం, ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి’- స్వామీ నీవే మాకు దిక్కు తప్ప మరో దిక్కు లేదు. నిన్నే నిరంతరం...

"గరుడపంచమి"

Image
 ⚜️🕉️🚩ఓం గరుడాయ నమః🌹🙏 శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుడి జన్మదినం. కాబట్టి, దీన్ని "గరుడపంచమి"గా వ్యవహరిస్తారు. తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు గరుత్మంతుడు ఇంద్రాదులను ఓడించి, మహావిష్ణువు మెప్పుపొంది అమృతాన్ని సాధించి నాగులకు ఇచ్చాడు. గెలుచుకొని వచ్చిన అమృతాన్ని తాను తాగలేదు. తనవారికీ ఇవ్వలేదు. లోక కల్యాణార్థం అమృతాన్ని సర్పాలు సేవించకముందే ఇంద్రుడు సంగ్రహించే వెసులుబాటు కలిగించాడు. అపారమైనశక్తికి, నిస్వార్థ శీలానికి గరుత్మంతుడు ప్రతీక. ఈ కారణం వల్లే పక్షీంద్రుడు అమృతపానం చేయకుండానే మృత్యువు లేనివాడు అయ్యాడు. విష్ణుమూర్తికి వాహనమయ్యాడు. ధ్వజమయ్యాడు. అలాంటి గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం, ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది. ఎవరైతే గరుత్మంతుని యొక్క ద్వాదశ నామాలను ప్రతిరోజూ ఉదయం స్నానం చేస్తూ జపిస్తారో వారికీ విషం వల్ల, విష సర్పాలవల్ల ప్రమాదాలు ఉండవు. ఏ జంతువుల వల్ల ప్రమాదాలు ఉండవు. జీవన పోరాటంలో విజయాలు సాధిస్తారు. చేసే ప్రయాణాలు విజయవంతంగా ముగుస్తాయి. 💥#శ్రీ_గరుడ_ద్వాదశనామస్తోత్రం:💥 సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్...

💥అష్టలక్ష్మీ స్తోత్రం:-

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏 💥అష్టలక్ష్మీ స్తోత్రం:- #ఆదిలక్ష్మి :- సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 || #ధాన్యలక్ష్మి:- అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే | మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 || #ధైర్యలక్ష్మి:- జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 || #గజలక్ష్మి:- జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 || #సంతానలక్ష్మి:- అయిఖగ వాహిని మోహిని చక్రిణి, ర...

శ్రావణమాస శుద్ధ పంచమి.. "నాగపంచమి"

Image
 ⚜️🕉️🚩 ఓం నాగేంద్రాయ నమః 🌹🙏 💥శ్రావణమాస శుద్ధ పంచమి.. "నాగపంచమి" ఓం సర్పరాజాయ విద్మహే నాగరాజాయ ధీమహి తన్నో అనంత ప్రచోదయాత్ 💥కశ్యప ప్రజాపతి, కద్రువ దంపతులకు  అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలగువారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారట. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై "మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా” అని వేడుకున్నారట. "విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింపజేయడం తప్పు కాదా!! నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివేవారిని , ఔషధ మణి సమేతులను తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షకులై సాధుజీవులుగా మారండి. మీ నాగులంతా అతల, వితల పాతాళ లోకాలలో నివాసం చేయండి” అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు....

ఓం శ్రీసత్యనారాయణస్వామినే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీసత్యనారాయణస్వామినే నమః🌹🙏 ధ్యాయేత్సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిమ్ | పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం ||

⚜️🕉️🚩ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః🌹🙏