⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🌹🙏


💥అఖండమైన, అద్వితీయమైన పరబ్రహ్మం తేజోమయ అంశమే మనకు కనబడుతున్న సూర్య భగవానుడు. ఇతనే సర్వేశ్వరుడు, ప్రత్యక్ష దైవం కూడా. 


చరాచరాత్మకమైన విశ్వమంతటికీ సూర్య భగవానుడే ఆత్మగా ఉన్నాడు. ‘సూర్య ఆత్మా జగస్తస్థుషశ్చ’ అని శ్రుతివాక్యం. లోకాల మనుగడకు, పోషణకు, సర్వజీవులకు సూర్యుడే ఆధారం. ఆయన వల్ల ప్రకృతిలో చైతన్యం ఏర్పడుతున్నది.


‘ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ, నారాయణ సరసిజాసన సన్నివిష్టః’ అంటే సూర్య మండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తే ధ్యానింపదగిన మూర్తి అనీ, దానినే ఎప్పుడూ ధ్యానించాలని ఆదిత్య హృదయం చెప్తున్నది.


‘ఉద్యంత మస్తయంత మాదిత్య మభిధ్యాయన్‌ కుర్వన్‌ బ్రహ్మణో విద్వాన్‌ సకలం భద్రమశ్నుతే’- ‘ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యుణ్ని ఎవరు ధ్యానిస్తున్నారో, వారికి అన్ని శుభాలూ కలుగుతాయి’ అని శ్లోక భావం.


అన్ని యంత్రాలకు, మంత్రాలకు, తంత్రాలకు చైతన్యాన్ని కలిగించేది తేజోమయ రూపిణి అయిన గాయత్రీ మాతే! ఆవిడే పరాశక్తి. ‘ఏ తేజస్సు మా బుద్ధులను ప్రేరేపిస్తున్నదో, వెలుగుతున్న సవితృమూర్తి (సూర్య భగవానుడి) శ్రేష్ఠమైన ఆ తేజస్సును ఉపాసిస్తున్నాం’ అని గాయత్రీ మంత్రానికి అర్థం.


స్త్రీ, పురుష, వర్గ, వర్ణ భేదాలు లేకుండా ఎవరైనా సంధ్యోపాసన చేయవచ్చు. సంధ్యా సమయంలో సూర్యుడికి ఎదురుగా కూర్చొని, కండ్లు మూసుకొని, సూర్యుడిలోని శక్తిని ధ్యానించడమే సంధ్యోపాసన (సూర్య ఉపాసన).


ఈ ఉపాసన వల్ల మహర్షి విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగాడు. పూర్వకాలం ఋషులంతా సంధ్యోపాసన వల్ల దీర్ఘాయువును పొందారని పెద్దలు చెప్తారు.


‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అని సూక్తి.

అంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం కూడా సూర్య భగవానుడే అని అర్థం.


కాల స్వరూపుడైన భగవానుడి ఆరాధనమే సంధ్యోపాసన. కర్మకు శ్రద్ధ జీవం. అందుకే కర్మలను విధి విధానంగా ఆచరించి కర్మల శుభ ఫలాలను పొందవచ్చు. 


అందుకే ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం సంధ్యా సమయాల్లో సూర్యుడిలోని తేజోపుంజాన్ని ఉపాసించి, తేజస్సును, మేధస్సును, ఆరోగ్యాన్ని పొందుదురు గాక.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥