⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏


రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్

సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ |

ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే

తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ||


🌹తాత్పర్యము:

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.


💥సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల నుంచి వ్యక్తమైన రూపాలే సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు. 


వీరు వ్యక్తం కాగానే బ్రహ్మ వారిని మిగిలిన సృష్టిని కొనసాగించమని ఆజ్ఞాపించాడు. అందుకు వారు అంగీకరించక తమకు జ్ఞానం కావాలని అక్కడినుంచి వెళ్లిపోయారు. 


శివుడు ఇది గమనించి వారి అజ్ఞానాన్ని తొలగించాలనే తలంపుతో దక్షిణామూర్తి రూపంలో వారికి ప్రత్యక్షమవుతాడు. అజ్ఞానం నశించటమే జ్ఞానం.


అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి.


దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.


💥శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక వాక్యం —


"ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం" 


అంటే "ఓ శ్రీ దక్షిణామూర్తి దేవా! మౌనంగానే భక్తులకు పరబ్రహ్మ తత్వాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న నీకు ప్రణామములు!


మర్రి చెట్టు వేర్లు భూమిలోకి బాగా చొచ్చుకొని పోయి, ఊడలతో చాలా ప్రదేశంలో ఆక్రమించి ఉంటుంది.

దాని అర్ధం సంసార బంధంలో మనిషి కూడా అలాంటి వాడే! అలాంటి వాటి నుంచి విముక్తి పొందటమే జ్ఞానం, మోక్షం అంటే!


దక్షిణామూర్తి = దక్షిణ +అమూర్తి

ఇక్కడ అమూర్తి అంటే రూపం లేనివాడని అర్ధం!

ఊరు, పేరు, రూపం లాంటివి లేని "నిర్గుణ పరబ్రహ్మం" అని అర్ధం.


అన్నిటినీ మించి ‘దక్షిణా’ అనే మాట దక్షత నుండి వచ్చింది. దక్షత కలవాడే దక్షిణా మూర్తి.

సృష్టి, స్థితి, లయలను నిర్వహించే దక్షత కలవాడినే దక్షిణామూర్తి అని అంటారు.


అంతే కాకుండా ఆయన తన "చిన్ముద్ర" ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించే నిర్గుణ పరబ్రహ్మం!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు