💥దత్తాత్రేయుడు💥

 ⚜️🕉️🚩 ఓం దత్తాయ నమః 🌹🙏


💥దత్తాత్రేయుడు💥


అత్రిమహర్షి, అనసూయ ఉత్తమ సంతానం కోసం తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి మీ కోరిక మేరకు మేము ముగ్గురము పుత్రులు అవుతామని వరమిచ్చారు.


బ్రహ్మ అంశంతో చంద్రుడు,

రుద్రుని అంశంతో దుర్వాసుడు,

విష్ణువు అంశంతో దత్తాత్రేయుడు అవతరించారు. 


దత్తాత్రేయుడు వేదాంత తత్త్వ శాస్త్రాన్ని అలర్క మహర్షికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఉపదేశించాడు.


అలాగే కార్తవీర్యార్జునికి వేయి చేతులను, ఎదురులేని పరాక్రమాన్ని, అఖిల భూమండల ఆధిపత్యాన్ని ప్రసాదించాడు.


మోక్షం కోరేవారికి మాత్రమే యోగిగా కనపడాలని, ఇతరులకు భోగిగా కనపడాలని,

ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి దూరంగా ఉండాలని ఆచరించి ఉద్భోదించిన మహానుభావుడు. 


💥దత్తాత్రేయుని ఆశ్రమంలో ఆయన చుట్టూ 4 కుక్కలు, వాటి చుట్టూ 8 మద్యభాండాలు, వాటి చుట్టూ 16 మంది యువతులు, వారి చుట్టూ 32 వివిధ జంతువుల మాంసఖండాలు, వాటి చుట్టూ 64 విలాస భోగ స్థానాలు..

ఇన్నిటి మధ్యన స్వామి భోగమూర్తిగా వ్యసన లంపటునిగా అజ్ఞానులకు దర్శనమిస్తారు. 


వాస్తవానికి జ్ఞానులకు, యోగులకు...

4 కుక్కలు 4 వేదాలు.

8 మద్యభాండాలు అష్ట సిద్ధులు.

16 మంది యువతులు 16 కళలు,

32 జంతువుల మాంస ఖండాలు 32 బ్రహ్మ విద్యలు,

64 వివిధ భోగాలు చతుస్సష్ఠి కళలు.

ఇది దత్తాత్రేయుని అసలు రూపం.

జ్ఞానులకు ఈ విధంగా సాక్షాత్కరించి అజ్ఞానులకు దూరంగా ఉండాలని పైవిధంగా దర్శనమిస్తారు.


అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర:

స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||


"స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా"

- అనగా తలచు వారి వెంట నడచువాడు, తన భక్తుల కష్టాలను ఉద్ధరించువాడు అని అర్థం. 


"దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ నమోస్తుతే"

-  అని నిరంతరం జపించే వారి వెంట వుండి వారి బాధలు తొలగించి జ్ఞాన దీపాలను వెలిగించే కరుణామూర్తి దత్తాత్రేయుడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం