శ్రావణమాస శుద్ధ పంచమి.. "నాగపంచమి"

 ⚜️🕉️🚩 ఓం నాగేంద్రాయ నమః 🌹🙏


💥శ్రావణమాస శుద్ధ పంచమి.. "నాగపంచమి"


ఓం సర్పరాజాయ విద్మహే

నాగరాజాయ ధీమహి

తన్నో అనంత ప్రచోదయాత్


💥కశ్యప ప్రజాపతి, కద్రువ దంపతులకు  అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలగువారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారట.


దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు.


అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై "మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా” అని వేడుకున్నారట.


"విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింపజేయడం తప్పు కాదా!! నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివేవారిని , ఔషధ మణి సమేతులను తప్పించుకు తిరగండి.


దేవతా విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షకులై సాధుజీవులుగా మారండి. మీ నాగులంతా అతల, వితల పాతాళ లోకాలలో నివాసం చేయండి” అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు.


దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు. నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతా పూర్వకంగా నాగుల జన్మదినమైన "నాగపంచమి" రోజున వారిని పూజచేయడం మొదలుపెట్టారు.


💥పార్వతీ దేవికి పరమేశ్వరుడు "ఓ పార్వతీ దేవి శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగ దేవతారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.


చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం, వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల సర్ప ప్రతిమను చేయించాలి.


లేదంటే పసుపు, చందనంతో గానీ ఏడు తలల సర్ప చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.


నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. "గరుడ పంచమి"గా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.


ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి.


పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి.


ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.


💥నాగ పంచమి వ్రత కథ:


పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుండేది. ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైంది.


ఒక రోజున వారి కులగురువు, వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు. ఆయన విని “అమ్మా” నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు, అందు వలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని, అపుడు పాముల భయం తొలగి పోతుందని చెప్పెను. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది. నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి.


ఈ కధ వెనుక ఒక సామాజికమైన హితవు ఉన్నది. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాసము వారిది అని అనుకోవాలి.


కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.


💥పుట్టలో పాలు ఈ క్రింది శ్లోకం చదువుతూ పోయాలి:


విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః

న తేషా సర్పతో వీరభయం భవతి కుత్ర చిత్।।


💥ఈక్రింది శ్లోకం మననం చేసుకోని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం:


కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ।

ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం ॥


(కర్కోటకమనే పాము, దమయంతీ-నలులు, రాజర్షి అయిన ఋతుపర్ణుడు- వీరి (కథ)నీ కీర్తిస్తే కలిబాధ నివారణ జరుగుతుంది.)

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు