ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏
సేనా విదారక స్కంధ మహాసేన మహాబల!
రుద్రోమాగ్నిజ శాద్వాక్త్ర గంగార్భా నమోస్తుతే!!
రాక్షససైన్యాన్ని నశింపజేసినవాడా! శరవణ తటాకము నుండి ఒడ్డుకు జారినవాడా! గొప్ప సైన్యాన్ని నిరంతరం అదుపు రక్షణగా ఉంచుకునే వాడా, సాటిలేని శక్తి సామర్థ్యములు గలవాడా, శంకరునకు పార్వతికి అగ్నికి కుమారుడవైనట్టి వాడా, గంగాదేవి గర్భవాసం చేసినట్టి వాడా, షణ్ముఖా, నీకు నమస్కారం.
ఈ శ్లోకం మనకు శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క సంపూర్ణ స్వరూప, స్వభావ, మహాత్మ్యాలను తెలియజేస్తుంది. దీనిని చెప్పుకొని ప్రార్థిస్తే ఆయన కృపకు ప్రాత్రులమౌతాము.
💥షణ్మతాలలోను ముఖ్యమైనది అగ్ని ఆరాధన.
అగ్ని కారమైన ఔపాసనకు శ్రీసుబ్రహ్మణ్యుడు అధిదేవత.
అందువలన ఆయనను వదలిపెట్టి తక్కిన ఐదుగురు గణపతి, సూర్యుడు, శ్రీమహావిష్ణువు, ఈశ్వరుడు, అంబికలను పంచాయతన పూజలో ఆరాధిస్తూన్నాము. అందువలన ఆయన ఆరాధన, పంచాయతన పూజా కలిసి, షణ్మత సాధన అవుతోంది.
వైదిక కర్మలలో అగ్నికార్యం హోమం ప్రధానమైనది. శ్రీసుబ్రహ్మణ్యుడు దేవతా విశేషములలో అగ్నిస్వరూపుడు.
బయట అగ్ని స్వరూపుడు, ఆత్మ స్వరూపాన గుహుడు. ఆయనకు అగ్నిభూః అనే పేరుంది.
"సేనాని అగ్నిభూః, గుహః" అని శ్రీ సుబ్రహ్మణ్య నామావళి కూర్చబడింది.
కుండలినీ శక్తి జాగృతమైన షట్చక్రాల నుండి పైకిప్రాకి అగ్ని తత్త్వమైన సుషుమ్నా మార్గంలో ఉత్పన్నమయ్యే శక్తియే ఆయన.
సంవత్సరాగ్నిగా, కాలస్వరూపుడిగా.. ఆరు ఋతువులు ఆయనకు ఆరు ముఖాలు. పన్నెండు మాసాలు ఆయనకు గల పన్నెండు చేతులు. ఆయన అభయ స్వరూపుడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment