"గరుడపంచమి"

 ⚜️🕉️🚩ఓం గరుడాయ నమః🌹🙏


శ్రావణ శుద్ధ పంచమి గరుత్మంతుడి జన్మదినం. కాబట్టి, దీన్ని "గరుడపంచమి"గా వ్యవహరిస్తారు.


తల్లి దాస్యాన్ని పోగొట్టేందుకు గరుత్మంతుడు ఇంద్రాదులను ఓడించి, మహావిష్ణువు మెప్పుపొంది అమృతాన్ని సాధించి నాగులకు ఇచ్చాడు.


గెలుచుకొని వచ్చిన అమృతాన్ని తాను తాగలేదు. తనవారికీ ఇవ్వలేదు. లోక కల్యాణార్థం అమృతాన్ని సర్పాలు సేవించకముందే ఇంద్రుడు సంగ్రహించే వెసులుబాటు కలిగించాడు.


అపారమైనశక్తికి, నిస్వార్థ శీలానికి గరుత్మంతుడు ప్రతీక. ఈ కారణం వల్లే పక్షీంద్రుడు అమృతపానం చేయకుండానే మృత్యువు లేనివాడు అయ్యాడు. విష్ణుమూర్తికి వాహనమయ్యాడు. ధ్వజమయ్యాడు.


అలాంటి గరుత్మంతుని గరుడ పంచమి రోజున పూజిస్తే గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం, ఆరోగ్యవంతులు, ధైర్యవంతులైన సంతానం కలుగుతుంది.


ఎవరైతే గరుత్మంతుని యొక్క ద్వాదశ నామాలను ప్రతిరోజూ ఉదయం స్నానం చేస్తూ జపిస్తారో వారికీ విషం వల్ల, విష సర్పాలవల్ల ప్రమాదాలు ఉండవు. ఏ జంతువుల వల్ల ప్రమాదాలు ఉండవు. జీవన పోరాటంలో విజయాలు సాధిస్తారు. చేసే ప్రయాణాలు విజయవంతంగా ముగుస్తాయి.


💥#శ్రీ_గరుడ_ద్వాదశనామస్తోత్రం:💥


సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్ |

జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్ || ౧


గరుత్మన్తం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనమ్ |

ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః || ౨


యః పఠేత్ ప్రాతరుత్థాయ స్నానే వా శయనేఽపి వా |

విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః || ౩


సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే |

బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ || ౪


ఇతి శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రమ్ |


💥#గరుడ_ద్వాదశనామాలు:


1) సుపర్ణ - మంచి రెక్కలు గలవాడు.

2) వైనతేయ - వినతాదేవికి పుట్టినవాడు.

3) నాగారి - నాగులకు శత్రువు.

4) నాగభీషణ - నాగులకు విపరీతమైన భయాన్ని కలిగించేవాడు.

5) జితాంతకుడు - మరణాన్ని కూడా జయించగలవాడు.

6) విషారి - విషాన్ని హరించువాడు.

7) అజిత్ - జయించడానికి సాధ్యం కానివాడు.

8) విశ్వరూపి - సాక్షాత్తు విష్ణువుని పోలినవాడు.

9) గరుత్మాన్ - మహా శక్తిమంతుడు.

10) ఖగశ్రేష్ఠ - పక్షులలో గొప్పవాడు.

11) తర్కషే- గరుత్మంతుడి మరొక పేరు.

12) కశ్యప నందన - కశ్యప ప్రజాపతి కుమారుడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు