💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం💥
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏
శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు.
పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు.
వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం.
భృగుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం శ్రీనివాసుడుగా వేంకటాద్రిపై అవతరించడం- ఇదంతా విష్ణు లీలా విశేషమని మహర్షుల మాట.
శ్రవణం నక్షత్రంనాడు, మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు. కావున ప్రతీ శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్పస్వామి వారు తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ భక్తులను తరింపజేస్తారు.
స్వామివారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం- ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది
‘వినా వేంకటేశం, ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి’- స్వామీ నీవే మాకు దిక్కు తప్ప మరో దిక్కు లేదు. నిన్నే నిరంతరం స్మరిస్తూ ఉంటాం.
స్వామివారి కృపా వీక్షణాలతో, మూగవాడు మాట్లాడ గలుగుతాడని, కుంటివాడు నడువ గలుగుతాడని భక్తుల విశ్వాసం.
‘అజ్ఞానినా మయాదోషాన్ అశేషాన్, విహితాన్ హరేః క్షమస్వతం క్షమస్వతం- శేషశైల శిఖామణే’
అంటూ భక్తులు రెండు చేతులూ జోడించి శ్రీహరి వేంకటేశ్వరుని వేడుకుంటూ ఉంటారు.
శ్రీ మార్కండేయ మహర్షివారు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలో వజ్ర కవచ స్తోత్రాన్ని రచించినట్లు ప్రసిద్ధి. ఇందులో శ్రీ వేంకటేశుని స్మరిస్తూ వుంటే, మనకు సంపూర్ణ రక్షణ వుంటుందని తెలియజేయబడుతుంది.
💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం💥
మార్కండేయ ఉవాచ ।
నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ ।
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥ 1 ॥
సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు ।
ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ॥ 2 ॥
ఆకాశరా-ట్సుతానాథ ఆత్మానం మే సదావతు ।
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః ॥ 3 ॥
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా-నిరీశ్వరః ।
పాలయేన్మాం సదా కర్మ-సాఫల్యం నః ప్రయచ్ఛతు ॥ 4 ॥
య ఏత-ద్వజ్రకవచ-మభేద్యం వేంకటేశితుః ।
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ॥ 5 ॥
ఇతి మార్కండేయ-కృతం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ-స్తోత్రం సంపూర్ణమ్ ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment