🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥🌼సుదంతుడు చేసిన హనుమంతుని స్తోత్రం🌼💥 నమో నమస్తే దేవేశ - సృష్టిస్థిత్యంత హేతవే | అక్షరాయ వరేణ్యాయ వరదాయ మహాత్మనే |1| ఓ దేవనాయకా! నీకు నమస్కారము. సృష్టి స్థితి లయలకు కారకుడవైనట్టివానికి, నాశరహితునకు, శ్రేష్ఠునకు, మహాత్ముడగు వరప్రదాతకు నీకు నమస్కారము యోగిహృత్సద్మ సంస్థాయ భవరోగౌషధాయ చ | భక్తాపరాధసహినే భావపుత్త్రాయ తే నమః |2| యోగుల హృదయపద్మమున నుండువానికి, జననమరణముల రోగమునకు ఔషధము వంటి వానికి, భక్తుల అపరాధములు సహించువానికి, ఈశ్వరసుతుడవైన నీకు నమస్కారము రామోపకారశీలాయ లక్ష్మణప్రాణదాయినే | సప్తకోటి మహామంత్ర స్వరూపాయ నమో నమః |3| శ్రీరామున కుపకరించుటయే స్వభావంగా కలవానికి, లక్ష్మణుని ప్రాణదాతకు, సప్తకోటి మహామంత్రస్వరూపునకు నీకు నమస్కారము. గౌరీగర్భ మహాశుక్తిం రాత్నాయామిత ఘాతవే | వేదవేద్యాయ యజ్ఞాయ యజ్ఞోభోక్త్రే నమోనమః |4| పార్వతీగర్భమనే గొప్ప ముత్యపుచిప్పయం దుద్భవించిన రత్నమునకు, అమితముగ దుష్టులను చంపువానికి, వేదవేద్యునకు, యజ్ఞాస్వరూపునకు, యజ్ఞోభోక్తకు నీకు నమస్కారము. బ్రహ్మవిష్ణు మహేశాది సర్వదేవ స్వరూపిణే | శతానన పధార్థాయ నక్షత్రే శ్రవణే శుభే |5| బ్రహ్మ, విష్ణు,...