ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం "అరస వల్లి"

 🕉️⚜️🚩ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏


జపాకుసుమ సంకాశం ! కాశ్యపేయం మహాద్యుతిం

తమోరిం సర్వపాపఘ్నం ! ప్రణతోస్మి దివాకరమ్ !!

💥🌞💥🌞💥🌞💥🌞💥🌞💥🌞


ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం "అరస వల్లి"


స్థల పురాణం:

కురు పాండవ యుద్ధంలో జరగబోయే బంధునాశనం చూడలేక బలరాముడు తీర్థ యాత్రలకు బయలుదేరుతాడు.

విధ్య పర్వతములు దాటి దండకారణ్యం అధిగమించి మాధవవనములో పద్మనాభ పర్వత ప్రాంతములో నివశిస్తూ ఉంటాడు.

కరువు కాటకములతోను బాధపడుచున్న కళింగ ప్రజలు తమను ఈ బాధ నుండి విముక్తులను చేయవలసిందిగా బలరాముని ప్రార్థిస్తారు.


దీంతో బలరాముడు తన ఆయుధమైన హలము (అనగా నాగలి వలన) ను భూమి పై నాటి జలధార వచ్చినట్లుగా చేస్తాడు.

బలదేవుని ఆయుధమైన నాగావళి ఉధ్బవించినది కాబట్టి నాగావళి (దీనినే లాంగుల్య నది) అని ఇప్పటికీ పిలవబడుతున్నది.

ఈ నాగావళి నది తీరమందు బలరాముడు ఐదు విశిష్ట శివాలయాలను నిర్మిస్తాడు.


ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామి వారిని దేవతలందరూ కూడా దర్శించుకుని వెళుతారు.

అదే విధంగా ఇంద్రుడు ఈ మహాలింగమును దర్శించుటకు వచ్చెను.

అప్పటికే కాలాతీతమైనది.

అయినా పట్టు విడవని ఇంద్రుడు ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకుంటాడు.

అంతే కాకుండా పరమశివుడి ప్రమధ గణాలను పరిపరి విధాలుగా వేడుకుంటాడు.


ఈ క్రమంలోనే నందీశ్వరుడు,శృంగేశ్వరుడు, బృంగేశ్వరుడు ద్వారపాలకులు శ్రీ స్వామివారిని దర్శించుటకు ఇది తగు సమయం కాదు అని గట్టిగా వారిస్తారు.

దీంతో కోపగించుకున్న ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగుతాడు.

అపుడు నందీశ్వరుడు కోపంతో తన కొమ్ములతో ఇంద్రుడిని ఒక విసురు వేసెను.

దీంతో ఇంద్రుడు రెండు పర్లాంగుల దూరంలో పడుతాడు.

ఇంద్రుడు పడిన ఆ స్థలమునే ఇంద్ర పుష్కరిణి అంటారు.


అప్పుడు ఇంద్రుడు సర్వశక్తులు కోల్పోగా సూర్యభగవానుని ప్రార్థిస్తాడు.

దీంతో "సూర్యభగవానుడు" ప్రత్యక్షమై "నీవు పడిన చోట నీ వజ్రాయుధముతో లోతుగా త్రవ్వమని" చెప్పెను.

వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో త్రవ్వగా అచ్చట సూర్యభగవానుని విగ్రహం దొరికెను.

దానితోపాటు ఉష,ఛాయ, మరియు పద్మిని విగ్రహాలు కూడా లభించినవి.

అచ్చట ఇంద్రుడు దేవాలయమును కట్టి ప్రతిష్ఠించెను.


అంతేకాకుండా సూర్యకిరణాలు ఈ విగ్రహాన్ని తాకే సమయంలో కనుక ఎవరైతే తనను దర్శనం చేసుకుంటారో వారికి విజయం తథ్యమని వరమిస్తాడు.

అందువల్లే సూర్యకిరణాలు విగ్రహాన్ని తాకే సమయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. అదే ఈ నాటి అరసవెల్లి క్షేత్రము.


ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళతారని కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని "హర్షవల్లి" అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి.


సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి.


స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు