శ్రీ సాయినాధుల వారు కూర్చున్న విధానం:

 శ్రీ సాయినాధుల వారు కూర్చున్న విధానం:

💥🕉️💥🕉️💥🕉️💥🕉️💥🕉️💥🕉️


బాబావారు కూర్చున్న విధానం చూడండి.

అది ఎంత సుందరంముగా చూడ చక్కగా నున్నదో వారు తమ కాళ్ళను ఒక దాని పైన ఇంకొకటి వేసియున్నారు.

ఎడమ చేతి వేళ్ళు కుడి పాదముల పై వేసియున్నారు.

కుడికాలి బొటన వెలుపై చూపుడు వేలును మధ్య వేలును ఉన్నవి.

ఇలా బాబావారు కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా ఈ దిగువున ఇచ్చిన విషయమును చెప్పుచున్నట్లు తెలుస్తుంది.

అది ఏమనగా *"నా ప్రకాశమును చూడాలంటే అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో* *చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్యనున్న బొటన వెలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు."

* ఇది భక్తికి సులభమైన మార్గము.

ఈ యొక్క బొటన వేలు సత్యానికి , ధర్మానికి, నిస్వార్థమైన భక్తీకి, నిర్వచనం.

నిరంతరం సత్య మార్గంలో నడుస్తూ ఎటువంటి ఫలపేక్ష ను ఆశించకుండా సర్వం నీవే అంటూ నిస్వార్థమైన భక్తితో కొలిస్తే బాబావారిని తప్పక చూడగలం.

🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు