లక్ష్మీస్థానాలు 🔱🚩పుణ్యాల రాశి... సర్వజగత్తుకూ కల్పవల్లి... దారిద్య్ర వినాశిని... సౌభాగ్యదాయిని... పాలకడలిలో పుట్టిన దీపశిఖ... శ్రీమహాలక్ష్మి...
🕉️⚜️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
🔱🚩పుణ్యాల రాశి... సర్వజగత్తుకూ కల్పవల్లి... దారిద్య్ర వినాశిని... సౌభాగ్యదాయిని...
పాలకడలిలో పుట్టిన దీపశిఖ... శ్రీమహాలక్ష్మి...
లోకాలన్నిటికీ సర్వ శుభాలనూ చేకూర్చే ఆ తల్లి ఎవరింట ఉంటుందో ఆ ఇంట్లో తానూ ఉంటానని పరమాత్ముడు చెప్పారు.
"సిరి" "హరి" కలిసి ఉన్న ఆ ఇంట్లో లేనిదేముంటుంది.
🌹మరి "సిరి" ఎక్కడుంటుంది?
సత్కర్మలలో, సదాశయాల్లో, సదాచారాల్లో, నీతినియమాల్లో అమ్మవారు కొలువుంటారని మార్కండేయ పురాణం చెబుతోంది.
వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక, మానసిక శుద్ధి లేని వారింటిని శ్రీమహాలక్ష్మి విడిచిపోతుందని జైమినీ భారతం తెలియజేస్తోంది.
అందుకే డబ్బుకన్నా ముందు మంచి గుణగణాలను ఇమ్మని అమ్మను ప్రార్థించాలి.
లక్ష్మీ విభూతుల్లో మనిషి చెమట చిందించే చోటు ప్రముఖమైన లక్ష్మీ స్థ్ధానంగా చెప్పారు.
అంటే శ్రమే సంపద.
🌹లక్ష్మీ స్తోత్రాల్లో
"దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ వారిణీమ్"
అని ప్రార్థన ఉంటుంది.
లోకంలోని సకల దారిద్య్రాలను పారద్రోలే దేవత
శ్రీ మహాలక్ష్మి.
సర్వ ఉపద్రవాలను నివారించగల దేవత ఆమె.
అందుకే ఆమెను శంకర భగవత్పాదులు ‘సంపత్కారిణి’ అనీ,
‘త్రిభువన భూతకరీ’(ముల్లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చేది) అనీ సంబోధించారు.
పుత్రపౌత్ర ధనం ధాన్యం
హస్త్యశ్వాజావిగోరథమ్
ప్రజానాం భవసి మాత
ఆయుష్మంతం కరోతు మామ్
పుత్రపౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు, ఇతర సంపదలను అనుగ్రహించు తల్లీ...
నాకు ఆయుర్ధాయాన్ని ప్రసాదించమని అంటోందీ ఋక్కు.
ఇందులో ఆయుష్షును ప్రత్యేక సంపదగా పేర్కొంటోంది.
మిగిలిన సంపదలు అనుభవించాలంటే మొదట ఆయుర్ధాయం కావాలి.
దానికి ఆరోగ్యం కావాలి.
ఈ సూక్తాన్నిబట్టే ఆరోగ్యమే మహాభాగ్యమని...
అది కూడా లక్ష్మీ స్వరూపమని తెలుసుకోవాలి.
🌹వనాలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలు, ఆవుపేడ, బిల్వ వృక్షం... ఇవన్నీ శ్రీలక్ష్మికి నివాసాలు.
🌹భక్తుడి ఇంట ఎప్పటికీ తానుండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలని ఆమె చెప్పినట్లు మహాభారతం శాంతి పర్వంలో ఉంది.
తానెక్కడెక్కడ ఉంటానో స్వయంగా ఇంద్రుడికి చెప్పినట్లు అందులో ఉంది.
అవే లక్ష్మీస్థానాలుగా పరిగణిస్తారు.
🌹ఆమె మాటలను తిక్కన సీసపద్యంలో ఇలా వర్ణించారు.
గురుభక్తి నిరతులు, సురపితృపూజన
పరులును, సత్యసంభాషణులును,
దానశీలురుఁ, బరధనపరదారప
రాఙ్ముఖచిత్తులు, బ్రాహ్మణప్రి
యులు, దివానిద్రావియుక్తులు, వృద్ధదు
ర్బలదీన యోషిత్కృపారతులును
శౌచులు, నతిథిభోజనశిష్టభోజులు
నేను మెచ్చు జనంబు; లిట్లుగాక
ఎక్కడ గురుభక్తి కలవారుంటారో అక్కడ
ఎక్కడ తల్లిదండ్రులను పూజించే వారుంటారో అక్కడ
ఎక్కడ దానగుణం కలిగిన వారుంటారో అక్కడ ఎక్కడ ఇతరుల ధనం ఆశించని వారుంటారో అక్కడ
ఎక్కడ బ్రాహ్మణులను ఆదరించే వారుంటారో అక్కడ
ఎక్కడ పగటి పూట నిద్రించని వారుంటారో అక్కడ
ఎక్కడ వృద్ధుల, దీనుల ఆదరణ ఉంటుందో అక్కడ
ఎక్కడ శుచీ, శుభ్రత ఉంటాయో అక్కడ
ఎక్కడ అతిథి, అభ్యాగతుల సేవ జరుగుతుందో అక్కడ తానుంటానని...
అలా ఉండేవారిని తాను అనుగ్రహిస్తానన్నది లక్ష్మీదేవి మాట.
🌹అలాగే తన అనుగ్రహం పొందలేని వారి గురించి కూడా ఆమె చెప్పింది...
ధర్మ మెడలి, కామంబు క్రోధంబుఁ జాలఁ;
గలిగిగర్వులై బలియు భైక్షంబునిడక
పరుష వాక్కులఁ గ్రూరంపుఁ జరితములను।
మిగిలి వర్తించువారు నా మెచ్చుగారు
ధర్మాలను పాటించని వారు
కామక్రోధాలు ఎక్కువగా ఉన్నవారు
గర్వం ఉన్నవారు
పేదలకు భిక్ష, పూజా సామగ్రి ఇవ్వని వారు
కఠినమైన మాటలాడేవారు
క్రూర మనస్తత్వం ఉన్నవారు
🌹సదాచారం, సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు.
ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు.
🌹సేకరణ
🔱🪷🔱🪷🕉️🪷🔱🪷🔱

Comments
Post a Comment