ఓం శ్రీ సాయి రామ్ 🌺🌺 శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం 🌺🌺
|| ఓం శ్రీ సాయి రామ్ ||
🌹 ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి🌹
కృతయుగమున తపము, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున నామముల వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది.
కలియుగంలో అత్యంత ప్రభావము కలిగినది, సులభమైనది భగవన్నామస్మరణ.
దైవం నామాన్ని పదే పదే ఉచ్ఛరించడమే నామ జపము.
చిత్తశుద్ధికి నామజపము కంటే సులభమైన సాధనము లేదు.
భక్తి, శ్రద్ధ, అణకువ, ప్రేమ, ఓర్పు, విశ్వాసం (నమ్మకం)లతో జపిస్తే సర్వదా భగవంతుని రక్ష ఉంటుంది.
🌺🌺 శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం 🌺🌺
ప్రథమం సాయినాథాయ నమః - ద్వితీయం ద్వారకామాయినే
తృతీయం తీర్థ రాజాయ – చతుర్థం భక్తవత్సలే
పంచమం పరమార్థాయ – షష్టించ షిర్డీ వాసనే
సప్తమం సద్గురు నాధాయ – అష్టమం అనాథ నాధనే
నవమం నిరాడంబరాయ –దశమం దత్తావతారమే
యతాని దశనామాని త్రిసంధ్య పథే నిత్యం
సర్వకష్ట భయోన్ముక్తో సాయినాథగురు కృపా
(ఈ సాయినాథ కష్టనివారణ స్తోత్రం రోజుకు 3 సార్లు 11 పర్యాయములు ఎవరు పఠిస్తారో వారి సర్వ కష్టాలు తొలుగును)
🌹శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై🌹

Comments
Post a Comment