💥🔱అర్ధనారీశ్వరుడు🔱💥🙏
🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💥🔱అర్ధనారీశ్వరుడు🔱💥🙏
లోకములో భార్యాభర్తలు అన్యోన్యముగా
తప్పు అయినా ఒప్పు అయినా...
ఆచరణలోనూ, ఆలోచనలోనూ
కర్మలలోను, కార్యాలలోను, నిర్ణయాలలోనూ, నిర్మాణాలలోనూ ఒకటిగా చెరిసగముగా ఉండాలని హిందూపురాణాలు అర్ధనారీశ్వరాన్ని చూపడము జరిగింది.
తల ఆలోచనకి, పాదము ఆచరణకి సంకేతాలైతే, పార్వతీపరమేశ్వరులు తలనుండి కాలివరకు సమముగా నిలువుగా ఉంటారంటే ఇద్దరి ఆలోచనలూ, ఆచరణలూ ఒక్కటే అన్నమాట.
అర్ధ (సగమైన ) నారి (స్త్రీ), ఈశ్వర (సగమైన పురుషుడు) రూపము (కలిగిఉన్న రూపము).
లయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి.
ఆ అధికారాన్నే... పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.
అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి.
శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు.
శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా,
శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు.
స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకు పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించాడు.
లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడని.
శంకరుని విషయములో అది సరికాదు.
శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరము గౌరవిస్తూనే ఉంటాడు.
పార్వతితో తనకు వివాహము కాకముందు తానే స్వయముగా మారు రూపములో ఓ బ్రహ్మచారి వేషములో ఆమె వద్దకు వెళ్ళి --
శంకరునికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని
బూడిద మాత్రమే ఒంటికి పూసుకుంటూ,
ఇల్లు లేని కారణముగా శ్మశానములోనే ఉంటాడని,
నిత్యము బిక్ష కోసము తిరుగుతూ ఉంటాడని,
బిక్షపాత్ర కూడా లేని కారణముగా పుర్రెని బిక్షపాత్రగా ధరిస్తాడని...
ఇలా ఉన్నది ఉన్నట్లుగా తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు.
తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి
తనకంటే జ్ఞానవతిగా ఆమెను గుర్తించి
నిరంతరము ఆమె వద్దకు వెళ్ళి భిక్ష యాచిస్తాడు శంకరుడు.
ఆయన చేతిలో పుర్రె మన తలమీది పైభాగానికి సంకేతం.
ఆమె పెట్టే అన్నము జ్ఞానానికి సంకేతము కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేది
"జ్ఞాన (అన్న) భిక్ష" తప్ప మనలా అన్నము మాత్రము కానేకాదు.
అందుకే
అన్నపూర్ణే ! సదాపూర్ణే ! శంకరప్రాణవల్లభే !
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి !
అంటుంది శ్లోకము.
చాంపేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ |
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః
శివయై చ నమఃశివాయ || 🌹🙏
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment