⚜️🚩ఒకే గర్భ గుడిలో వేంకటేశ్వరస్వామి రెండుగా దర్శనమిచ్చే ద్వారకా తిరుమల 🌹🙏
🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏
⚜️🚩ఒకే గర్భ గుడిలో వేంకటేశ్వరస్వామి రెండుగా దర్శనమిచ్చే ద్వారకా తిరుమల 🌹🙏
🌹ఈ క్షేత్రంలో శేషాద్రి కొండ మీద "కలియుగ దైవం" శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.
🌹స్వయంభువుగా ప్రత్యక్షమైన వేంకటేశ్వర స్వామిని చీమల పుట్ట నుండి వెలికి తీసిన "ద్వారక" అనే ముని పేరు మీదుగా ఈ ప్రదేశానికి "ద్వారక తిరుమల" అని పేరు వచ్చింది.
🌹సుదర్శన క్షేత్రమైన ద్వారక తిరుమల చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందినది.
🌹ద్వారకుడు ఉత్తరాభిముఖుడై తపస్సు చేశాడట.
కనుక ఆ మునికి ప్రత్యక్షమైన స్వామి దక్షిణాభిముఖుడై యున్నాడు.
మూలవిరాట్టు దక్షిణముఖంగా ఉడడం కూడా అరుదు.
🌹"పెద్దతిరుపతి" (తిరుమల తిరుపతి)లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును "చిన్నతిరుపతి"లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది.
కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం.
🌹ఒకే విమాన శిఖరము క్రింద రెండు విగ్రహములు ఉండటము ఇక్కడి విశేషము.
ఒక విగ్రహము సంపూర్ణమైనది.
రెండవది స్వామియొక్క పై భాగము మాత్రమే కనుపించు అర్ధ విగ్రహము.
🌹స్థల పురాణము ప్రకారము
ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలము నాటిదని భావిస్తారు.
🌹"ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామి వారి పాద సేవను కోరాడు.
కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది.
పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది.
🌹విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించినారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించాలని భావించాడు.
దీంతో మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖానసాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు.
🌹స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ,
తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన "ధర్మార్ధకామ పురుషార్ధములు" సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.
🌹ఇక్కడ స్వామి వారికి అభిషేకము చేయక పోవడము ఇంకొక విశేషము.
ఎందుకంటే...
పుట్టలో స్వామివారు వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది.
పుట్టలో ఎర్ర చీమలు వుంటాయి.
అందుకే, విగ్రహానికి అభిషేకం చేయరు.
🌹ఈ గుడి యొక్క సంప్రదాయము ప్రకారము ప్రతియేటా రెండు కళ్యాణోత్సవాలు
వైశాఖ మరియు ఆశ్వయిజ మాసములలో జరుపుతారు.
ఇందుకు కారణం- స్వయం భూమూర్తి వైశాఖమాసంలో దర్శనమిచ్చారనీ,
సంపూర్ణ విగ్రహాన్ని ఆశ్వయుజంలో ప్రతిష్ఠించారనీ చెబుతారు.
🌹"భ్రమరాంబా మల్లేశ్వరస్వామి" ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు.
🌹మొత్తం కొండ "సర్పరాజు" "అనంతుని" ఆకారంలో ఉన్నదనీ,
తల పైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ చెబుతారు.
అందువల్ల ఈ గుడిని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.
🌹సేకరణ

Comments
Post a Comment