💥💥సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం!!💥💥
🕉️⚜️🚩ఓం శ్రీ సరస్వత్యై నమః🌹🙏
తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో
భిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లబ్జాక్షి !సరస్వతీ !భగవతీ !పూర్ణేందు బింబాననా!
- (చాటువు)
అమ్మా సరస్వతీమాత! పుస్తకం📘 పట్టుకోవడానికి ముందు నిన్ను మనసున స్మరించి, పిమ్మట చదువు మొదలుపెడుతున్నాను తల్లీ!
ఓ వికసించిన కలువల🌷 వంటి విజ్ఞానము ప్రసరించే కన్నులు కల తల్లీ!
నిండు చంద్రుని🌝 వంటి మోము కల చల్లని తల్లీ! జగన్మోహిని!
నా ఉల్లము (మనసు) నందు ఉండి, నా పలుకులలో జృంభణము (వికాసముతో కూడిన అతిశయము) కాన్ (కలుగునట్లు) ఇష్టపూర్తిగా నుతి (స్తోత్రము) లను పలికించు తల్లీ.
🔱💥📚📘💥✍️💥🎶🎵💥🌷🙏
సకల జనులకు విద్యాదానాన్ని చేసే సర్వ ప్రదాయిని ఆ సరస్వతీ దేవి.
విద్య అనేది మనిషిలో ఆలోచనా శక్తిని, విచక్షణను పెంపొందించే గొప్ప మార్గం.
అలాంటి విద్యకు మూలం సరస్వతి దేవి.
అమ్మ కరుణ ఉంటే ఆద్యంతం చదువుల పల్లకిలో ఊరేగవచ్చని పెద్దలు చెబుతూ ఉంటారు.
సాధారణంగా తెల్లని తామరలో ఆశీనురాలై రెండు చేతుల్లో వీణ, మరొక చేతిలో జపమాల, ఇంకొక చేతిలో పుస్తకం పట్టుకుని తెల్లని చీర కట్టుకుని ప్రశాంత వధనంతో దర్శనం ఇస్తుంది ఈ తల్లి.
అమ్మ చేతిలో ఉన్న వీణను కచ్ఛపి అంటారు.
వాక్శుద్ధి, విద్య, వివేకం, కళలు, విజ్ఞానం అన్నిటికి మించి మంచి బుద్దిని ప్రసాదించే చల్లని తల్లి సరస్వతి దేవి.
కాళిదాసు మహకవి కాళికాదేవిని ఆరాధించగా ఆ తల్లి సరస్వతి రూపంలో కాళిదాసు అంతరంగంలో తిష్ఠ వేసి మహకవిని చేసింది.
సరస్వతీ, శారదా, భారతీ, హంసవాహిని, వీణాపాణి ఇలా పేర్లు ఎన్ని ఉన్నా అమ్మ రూపం ఒకటే,
అమ్మ అందరికి ప్రసాదించే జ్ఞానం కూడా ఒకటే.
🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️
💥💥సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం!!💥💥
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!
పై శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు చెప్పుకుని సరస్వతి దేవికి ఎంతో భక్తిగా పూజ చేసుకుని, ఆర్థిక సమస్యలో ఉండి చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయపడటం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేయడం వల్ల ఎంతో గొప్ప ఫలితం, చదువుల తల్లి కరుణ మనపై ఎప్పుడూ ఉంటాయి.
సేకరణ... 💐🙏
⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️🌺⚜️

Comments
Post a Comment