🌺🌺 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌺🌺 "రుద్ర యతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యమ్" ఓ రుద్రా! నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు🙏

 🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏

🌺🌺 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌺🌺


"రుద్ర యతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యమ్"

ఓ రుద్రా! నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు🙏


⚜️🚩దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి "మకరకుండలం"

ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి.

మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం.

తాటంకం స్త్రీల అలంకృతి.

దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశకుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు.


🌹సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి.

అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా

ఈ విషయాన్నే లలితాసహస్రంలో

"దక్షిణామూర్తి రూపిణీ | సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ"

అని వివరిస్తోంది.


🌹ఉత్తరాభిముఖులై ఉంటారు.

ఉత్తరం జ్ఞానదశ.

ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ.

అంటే యమ (మృత్యు) దిశ.

దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో, వారు యముని ( మృత్యువుని ) చూడరు.

యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది.

ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు. 


🌹"ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి"

యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి.

దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'


ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు.

ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది.

ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. 


🌹అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం.

అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం.

ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన

స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి.


🌹దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక -

స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది.

ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి

పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.

                       

చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే ! ఓంకారవాచ్యరూపాయ దక్షిణామూర్తయే నమః !! 

🌹సేకరణ

                ⚜️🕉️🌼⚜️🕉️🌼⚜️🕉️🌼⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు