Posts

Showing posts from June, 2023

💥చాతుర్మాస్యం వెనుక పరమార్థం..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥చాతుర్మాస్యం వెనుక పరమార్థం.. వ్రతం అంటే నియమం. 'వరం తనోతీతి వ్రతం' అని శబ్ద వ్యుత్పత్తి. నియమ నిష్ఠలతో భగవంతుడిని పూజించి, అనుగ్రహాన్ని పొందడం కోసం వ్రతాలను ఆచరిస్తారు. వ్రతాలలో పలురకాలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ భిన్నమైనది, విశిష్టమైనది "చాతుర్మాస్య వ్రతం" నాలుగు నెలల 'శేష శయనుడు' విశేషం ఏమిటంటే స్థితికారుడైన విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషశయ్యపై నిదురకు ఉపక్రమిస్తాడు. దీన్ని 'శయన ఏకాదశి' గా చెబుతారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడు. దీన్ని 'ఉత్థాన ఏకాదశి' గా పిలుస్తారు. ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాస్యంగా వైష్ణవ ఆచార్యులు, జీయర్లు పాటిస్తారు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఆచరిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం చేసి, నియమాలను అనుష్ఠిస్తూ కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఆచరించాలని ధర్మ సింధు, నిర్ణయ సింథు తదితర గ్రంథాలు చెబుతున్నాయి. తైత్తరీయ బ్రాహ్మణం కూడా ఈ వ్రతం గురించి విస్తారంగా ఉల్లేఖించింది. ''ఆషాఢే తు సితే పక్షే ఏకాదశ్యాముపోషిత...

💥ఆషాఢ శుద్ధ ఏకాదశి.. తొలిఏకాదశి.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥ఆషాఢ శుద్ధ ఏకాదశి.. తొలిఏకాదశి. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ''తొలి ఏకాదశిగా'' గా పిలుస్తారు. దీనికే ''శయనైకాదశి'' అని ''హరి వాసరమని'', ''పేలాల పండుగ'' అని పేరు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు తిరిగి యోగనిద్ర నుండి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని "#చాతుర్మాసాలు"గా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి.. కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు... పర్వదినాలు ఎక్కువగా వస్తాయి.. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందు...

ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు.

Image
 ⚜️🕉️🚩ఓం గం గణపతయే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు.. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు చెబుతుంటారు. గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గాణపత్యం అనే శాఖ కూడా ఉంది. వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. ఆ ఎనిమిది వివరాలను, గణనాథుని మహిమలను తెలుసుకుని ఆ వినాయకుని సేవించి తరిద్దాం.  💥#వక్రతుండుడు: పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పు...

💥సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే...

Image
 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే... 🍁విజయాలకు కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న  విషయం మనకు  తెలుసు. రెల్లుగడ్డిని ‘శరం’ అని కూడా  పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు వచ్చింది. ‘శరం’ అన్న పదానికి బాణం అని అర్థం కూడా వస్తుంది.  శివుని సేనలకు నాయకునిగా మరియు  ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కూడా  కుమారస్వామిని పేర్కొంటారు.  అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే వారికీ  ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారు. 🍁సంతానానికి – పార్వతీపరమేశ్వరులని ఈ సృష్టిలో ఆదిదంపతులకు చిహ్నంగా పేర్కొంటారు. వారి యొక్క  తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకము కూడా ఉంది. 🍁జ్ఞానానికి –  సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది. పరమేశ్వరుని యొక్క  దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమార...

💥జయహో భక్త హనుమాన్🚩

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥జయహో భక్త హనుమాన్🚩 సప్త చిరంజీవులలో ఒకడు, శ్రీరాముడికి ప్రియ భక్తుడు. అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటి మరీ లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు.  ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకు వచ్చి కదన రంగాన వివశుడై పడి ఉన్న లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వాన్ని అణచినవాడు అయిన వీర హనుమాన్‌ శక్తి యుక్తులను కీర్తించడం సాధ్యమా? భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఆయన్ని ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు.  తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. వాయుదేవుడి వరప్రసాదంగా జన్మించాడు కనుక వాయుపుత్రుడని, పవన సుతుడనీ అంటారు.  సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయుడు, హనుమాన్, భజరంగబలి వంటి పేర్లతో కూడా ఆరాధిస్తారు....

💥🔱శ్రీ మార్గబంధు స్తోత్రం🔱💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ  🍁🍁🍁🍁🍁 💥 🔱శ్రీ మార్గబంధు స్తోత్రం🔱💥 శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ  ఫాలావనమ్రత్కిరీటం ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్  శూలాహతారాతికూటం శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || 1 || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ  అంగే విరాజద్భుజంగం అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ఓంకారవాటీకురంగం సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || 2 ||  శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ  కందర్పదర్పఘ్నమీశం కాలకంఠం మహేశం మహావ్యోమకేశం కుందాభదంతం సురేశం కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || 3 ||  శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ మందారభూతేరుదారం మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం సిందూరదూరప్రచారం సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || 4 || శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ  నిత్యం చిదానందరూపం నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపం కార్తస్వరాగేంద్రచాపం కృత్తివాసం భజే దివ్య...

కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ వారాహి దేవ్యై నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ వరదా దండినీ ఖడ్గం బిభ్రతీ దక్షిణే కరే!! ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యా లసద్భుజా!! 🌹శ్రీవారాహీదేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులు (అష్టభుజ) కలిగి ఉంటుంది. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి... బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే... రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడుతారు. అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది. నాగలిి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది. "వారాహి దేవి" లలితా పరాభట్టారిక యొక్క సేనాని. రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి), ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్...

సూర్యోపాసన

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ “ఆత్మవత్ సర్వ భూతాని”   నాలో నున్న ‘ఆత్మజ్యోతి’ అన్నిజీవులలో చరాచర జగత్తులో కూడా వున్నది ! అదే పరమాత్మ ! అదే పరంజ్యోతి పర బ్రహ్మ స్వరూపం ! ఆత్మ చైతన్యం !! అందుకే సనాతన హిందూ ధర్మంలో మనం అన్నింటిలో, అంతటా భగవంతుని చూస్తాము!! చెట్టు, పుట్ట, రాయి, రప్ప లో కూడా ఆ భగవంతుని దర్శిస్తాము ! ఇది తెలియక చేసే మూఢత్వం కాదు తెలిసి చేసే దివ్యత్వం !! అంతటా వున్న భగవంతుడు నేను పూజించే ఈ ‘విగ్రహం' లో ఎందుకు వుండడు తప్పక వుంటాడు అని పరమ భక్తితో, పరమ విశ్వాసంతో చేసేదే !! ఉపాసన !! మన ధర్మంలో అనేక ఉపాసనలున్నాయి ! అందులో ‘సూర్యోపాసన’ ముఖ్యమైనది !! 💥 సూర్యోపాసన : సూర్యుడు ప్రత్యక్ష దైవం ! ఈ జగత్తుకంతటికీ వెలుగును వేడిమిని ప్రసాదించే పరంజ్యోతి స్వరూపుడు !! మన భౌతికమైన కనులతో చూడ గలిగే ‘సూర్యనారాయణుడు’ ! ఆరోగ్య ప్రధాత ! “ఆరోగ్యం భాస్కారాధిచ్ఛేత్ “ అంటుంది శాస్త్రం ! సూర్యభగవానుడు ” నమస్కార ప్రియుడు” !! ప్రతి రోజు సూర్య నమస్కారములను చేయండి !! ఆరోగ్యాన్ని పొందండి !! 🌹#సూర్యధ్యానం :- ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన స...

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం! లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!! భావము: శాంతిస్వరూపా! భుజగశయన! నాభిలో పద్మము కలవాడా! దేవతలకు అధిపతి అయినవాడా! ఈ విశ్వమునకు అంతటికీ ఆధారము అయినవాడా! ఆకాశము లాగా అంతటా వ్యాపించి ఉన్నవాడా! శుభప్రదమైనవాడా! యోగుల ధ్యానమునకు గమ్యమైనవాడా! సంసార భారమును పోగొట్టువాడా! ఓ విష్ణుదేవా! నీకు నమస్కారము. 🍁🍁🍁🍁🍁 ఇందులో సృష్టిక్రమం.. సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం.. ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు. 🌹శాంతాకారం: అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి. ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది. శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ. 🌹భుజగ శయనం: అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు.. భుజగము. ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు. కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు. 🌹పద్మనాభం: సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారా...

ఓం నమో వేంకటేశాయ🌹🙏

Image
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ తిరుమల శ్రీవారి పుష్కరిణి పక్కనున్న శ్రీఆదివరాహస్వామి వారి గుడిలో స్వామివారు తమకెదురుగా వచ్చే భక్తులను చూడకుండా అమ్మ వారితో ఏదో రహస్యంగా చెప్తున్నట్టుగా ఉంటారు. అలా పక్కకు తిరిగి ఎందుకున్నారు? కలియుగంలో శ్రీవారు ఆదివరాహస్వామి వారికి ఒక వరమిచ్చారు. "ప్రధమపూజ, ప్రధమ నైవేద్యం, ప్రథమదర్శనం నీకే వరాహా!" అని. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, క్షేత్రనియమం ప్రకారం స్వామివారి దర్శనానికెళ్లేముందు ప్రతి భక్తుడూ ముందుగా పుష్కర స్నానంచేసి, వరాహస్వామి దర్శనంచేసుకుని, ఆ స్వామి అనుమతితో మాత్రమే ఆనంద నిలయంలోనున్న శ్రీవారిదర్శనం చేసు కోవాలి. ఇది తిరుమల యొక్క క్షేత్రసంప్రదాయం. శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం ముందు తల్లి ప్రదానం, తర్వాత గురువు, ఆ తర్వాతే భగవంతుడు. కనుక ముందు అలివేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం చేసుకుని, తిరుమలకొచ్చి పుష్కరిణిలో స్నానంచేసి, జ్ఞానాపిరాన్ (గురువు) గా పిలవబడే ఆదివరాహస్వామి వారి దర్శనం చేసుకొని, వారి అనుమతితో మాత్రమే శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దర్శనానికెళ్లాలి. ఇది క్షేత్రనియమం, తిరుమలలో స్వామిని దర్శనంచేసుకునే క్రమ పద్దతి. వేంకటేశ్వరస్...

శ్రీవేంకటేశ్వరుని పాదాలను నిత్యం స్పృశిస్తాయని పురాణాలు చెబుతున్న ఆ తీర్థాల గురించిన ప్రత్యేక కథనం...

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥దేవదేవుడు కొలువైన తిరుమల గిరులు ముక్కోటి తీర్థాలకు నిలయాలు. భక్తులకు సాధారణంగా శేషాచల ఏడు కొండల్లోని ముఖ్య తీర్థాలు మాత్రమే తెలుసు. కానీ సాక్షాత్తు గర్భాలయం, భూ అంతర్భాగంలో ప్రవహించే దేవనదుల గురించి అంతగా తెలియదు.  శ్రీవేంకటేశ్వరుని పాదాలను నిత్యం స్పృశిస్తాయని పురాణాలు చెబుతున్న ఆ తీర్థాల గురించిన ప్రత్యేక కథనం... 🌹స్వామివారి పాదాల కింద ప్రవహించే విరజానది: ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరజానది అంటారు. వైకుంఠంలోని ఈ దేవనది స్వామి పాదాల కింద ప్రవహిస్తోందంటారు. నదిలో కొంత భాగాన్నే బావి అంటారు. దీన్ని చతురస్రాకారంలో చెక్కిన రాళ్ళతో నిర్మించారు. రాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి ఉన్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయమర్దనంలో శ్రీకృష్ణుని వేడుకుంటున్న నాగకన్యలు, ఏనుగును ఆజ్ఞాపిస్తున్న వేంకటేశ్వరుడు, గరుడుని బొమ్మలు మలిచారు. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు "#బొమ్మలబావి"గా పిలుస్తుంటారు. 🌹స్వామి పవిత్ర నిర్మాల్యం #పూలబావి కే సొంతం: అద్దాల మండపానికి ఉత్తర దిశలో ఈ పూల బావి ఉంది. స్వామ...

💥స్కంద పంచమి💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః🌹🙏 💥స్కంద పంచమి💥 ధ్యానం: షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం  చిత్రాంబరాలంకృతం | శక్తిం వజ్ర మసిం త్రిశూల మభయం ఖేటం ధను శ్చక్రకమ్ || పాశం కుక్కుట మంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |ధ్యాయే దీప్సిత సిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ ||  🍁🍁🍁🍁🍁 ఆషాఢ శుద్ధ పంచమిని "స్కంద పంచమి"గా జరుపుకుంటారు. దీని వెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. పూర్వం సనత్కుమారుడు తపస్సు చేసుకుంటుండగా పార్వతీపరమేశ్వరులు అతణ్ని చూస్తారు. ఆ తపశ్శాలి తమ పుత్రుడైతే బాగుంటుందని ముచ్చటపడతారు. ఆదిదంపతుల మనోగతాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు. భవిష్యత్తును దర్శించి శివుడి ఫాలనేత్రాగ్ని నుంచి జారిన దివ్యతేజస్సు ‘స్కంద’ రూపంలో అవతరిస్తుందని గుర్తిస్తాడు. పార్వతీదేవి ప్రోత్సాహంతో పరమేశ్వరుడు సనత్కుమారుణ్ని కలుసుకుంటాడు. శివుడికి పుత్రుడుగా జన్మించడానికి సనత్కుమారుడు అంగీకరిస్తాడు. తర్వాత కొన్నాళ్లకు మార్గశిర మాసంలో స్కందుడు అవతరిస్తాడు. అయితే, పార్వతీపరమేశ్వరులకు సనత్కుమారుణ్ని పుత్రుడిగా పొందాలన్న భావన కలిగింది ఆషాఢ శుద్ధ పంచమి నాడే అని పురాణాలు చెబుతున్నాయి.  స్కందమూర్తి ...

💥హయగ్రీవుడు💥

Image
 ⚜️🕉️🚩 ఓం హయగ్రీవాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥హయగ్రీవుడు💥 భగవంతుడే అందరికీ ఆది గురువు. ఒక్కో దేవతకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీవుడుగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో.. గురు స్వరూపం హయగ్రీవుడు. గుర్రం ముఖం, నర శరీరంతో ఉంటాడు.  హయగ్రీవుడి ఉత్పత్తి గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. సృష్టి ఆదిలో మహా విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, ఆయన నుంచి దేవతలు ఉద్భవించారు. దేవతలంతా తమ కర్తవ్యం ఏమిటని బ్రహ్మను అడిగారట. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు.. విష్ణుమూర్తిని అడిగాడట. అప్పుడు మహావిష్ణువు యజ్ఞం చేయాలని వారికి సూచించాడట. అయితే యజ్ఞం ఆచరించడానికి తగిన జ్ఞానం ప్రసాదించమని కోరాడట బ్రహ్మ. అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంలో ప్రకటితమై.. "ప్రపంచాన్ని సృష్టించి, నడపగలిగే జ్ఞానం, యజ్ఞ విజ్ఞానాన్ని ఇస్తున్నాన’’ని వేదాలను బ్రహ్మ దేవుడికి అనుగ్రహించాడట. ఈ వేదాలను మధుకైటభులు అనే రాక్షసులు అపహరించగా.. హయగ్రీవుడు వాటిని సంరంక్షించి మళ...

భక్తుల కల్పతరువు నరసింహుడు...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 భక్తుల కల్పతరువు నరసింహుడు... భగవంతుని అవతారాలలో అత్యద్భుత అవతారంగా చెప్పగలిగే అవతారం "నారసింహావతారం" సగం మనిషి సగం మృగం ఆకారంలో రూపు దాల్చడం నరసింహావతార ప్రత్యేకం. దుష్టశిక్షణ శిక్ష రక్షణ సర్వాంతర్యామిత్వం, భక్తుని మాటను నిజం చేయడం... నమ్మిన బంటును శాప విముక్తుని గావించడం, ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతృ వధ చేయడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసింహావతారంలో విశిష్టతలు. శ్రీహరి (మనిషి జంతువు కాని) నరసింహ రూపంలో, పగలూ రాత్రి గాని సంధ్యా సమయాన, ఇంటా బయటా గాని గుమ్మంలో, భూమ్యాకాశాలు కాని తన తొడపై, హిరణ్య కశిపుని సంహరించాడు. ప్రహ్లాదుని మాటను యధార్ధం చేసి, బ్రహ్మ వరాన్ని గౌరవించి, తన అవతార తత్వాన్ని చాటాడు మహా విష్ణువు.  💥శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం: ఉగ్రం వీరం మహావిష్ణుం  జ్వలంతం సర్వతోముఖమ్‌ నృసింహం భీషణం భద్రం  మృత్యోర్‌ మృత్యుర్‌ నమామ్యహం ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలూ, అపమృత్యు దోషాలు తొలగి, దీర్ఘాయ...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ "ఓం శ్రీ మహాగణాధిపతయే నమః" అంటూ ప్రతి కార్యక్రమం ప్రారంభంలో గణపతి తలుచుకుంటాము.  గణపతికి సంప్రదాయంలో, మానవజీవన విధానంలో విశిష్టవంతమైన స్థానం ఉంది. గణపతి ఆదిపూజ్యుడు, ముందు మొక్కులవాడు. అందుకే పురాతన కాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన ఎంతో గొప్పగా జరుగుతోంది.  వినాయకుడికి గణాధిపత్యం ఇచ్చి, గణాధిపతిని చేశారు. గణాలంటే చీమలు మొదలు బ్రహ్మ వరకు ఉన్న వివిధ వర్గాలు, జీవులు. గణం అంటే సమూహం, గుంపు, వర్గం. ఈ సమస్త సృష్టిని చాలా వర్గాలుగా విభజించవచ్చు. మానవులు ఒక గణం, దేవతలు ఒక గణం, రాక్షసులు ఒక గణం, చెట్లు ఒక గణం, జంతువులు ఒక గణం. మళ్ళి ప్రతి గణాన్ని ఇంకా విభజించవచ్చు.  ఉదాహరణకు చెట్లను తీసుకుంటే పుష్పించే చెట్లు ఒక గణం, పెద్ద పెద్ద వృక్షాలు ఒక గణం, పండ్లు అందించే మొక్కలు ఇంకో గణం, లతలు, తీగలు, కూరగాయలు వేర్వేరు గణాలు. మళ్ళీ వీటిలో ఇంకా గణాలు ఉన్నాయి.  ఎర్రని పూలు పూసే మొక్కలు ఒక గణం, తెల్లనివి ఇంకో గణం, పసుపుపచ్చనివి వేరొక గణం. మనుష్యుల్లో కూడా మంచివాళ్ళు ఒక గణం, చెడు వాళ్ళు ఇంకో గణం, తెలివైనవారు ఒక గణం. ఇలా ఎన్నో...

శరవణభవ మంత్రాక్షరషట్కం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శరవణ భవాయ నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం శ్రీసుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపి, తేజస్వి. అగ్నితేజం గలవాడు. కాని, గంగా తనయుడగుటచే అమృతంవలె చల్లదనమునిచ్చే స్వభావము గలవాడు. ఆయన మంత్రం షడక్షరి “శరవణభవ” ఇది మిక్కిలి మహిమాన్వితమైనది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లను ఆరు దుర్గుణములను నశింపచేసి విజ్ఞానవంతులుగ రూపొందించునట్టిది. ఇహపర సుఖదాయకమైనది. శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తేచాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. శరవణభవ మంత్రంలో – శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు శ – శమింపజేయువాడు ర – రతిపుష్టిని ఇచ్చువాడు వ – వంధ్యత్వం రూపుమాపువాడు ణ – రణమున జయాన్నిచ్చేవాడు భ – భవసాగరాన్ని దాటించేవాడు వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం. 🍁🍁🍁🍁🍁 💥శరవణభవ మంత్రాక్షరషట్కం💥 శక్తిస్వరూపాయ శరోద్భవాయ శక్రార్చితాయాథ శచీస్తుతాయ | శమాయ శంభుప్రణవార్థదాయ శకారరూపాయ నమో గుహాయ || ౧ |...

జగన్నాథ రథయాత్ర

Image
 ⚜️🕉️🚩 జై జగన్నాథ 🌹🙏 త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం |  విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్ || 🌹ఓ జగన్నాథ..! జగమును పాలించే విష్ణు భగవానుడా! అంటూ పై శ్లోకముతో శ్రీహరిని స్తుతించి, ప్రతి నిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. 🍁🍁🍁🍁🍁 "జగన్నాథుడు" అంటే విశ్వమంతటికి నాథుడు లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం.  ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు. పూరీ నగరంలోని జగన్నాథుని రథయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి.  మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత...

💥నీలకృత హనుమత్ స్తోత్రము💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 🌹🌹హనుమ నామస్మరణం - సర్వపాప నివారణం🌹🌹 🏵️🌼🏵️🌼🏵️ ఎక్కడైతే రామ నామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడు. హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది.  రావణ కథానంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు హనుమ.. రామచంద్ర ప్రభూ, నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచి పోవాలని, అదే విధంగా ప్రతిక్షణం రామ నామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని రామా! నీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని అంత కన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా! ప్రతిక్షణం నాలుకపై నీ నామ స్మరణ ఉండేలా కోరుకుంటున్నాను! నాయీ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు. అందుకు రామచంద్రుడు తథాస్తు అని అంటాడు. సీతా మాత కూడ తనకు అత్యంత ప్రేమ పాత్రుడగు హనుమను చూసి హనుమా నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది.  🍁🍁🍁🍁🍁 💥నీలకృత హనుమత్ స్తోత్రము💥 ఓం జయ జయ! శ్రీ ఆంజనేయ! కేసరీ ప్రియనందన! వాయుకుమారా! ఈశ్వరపుత్ర! పార్వతీ గర్భ ...

💥శివ నామ విశిష్టత...

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱 🏵️🌼🏵️🌼🏵️ 💥శివ నామ విశిష్టత... శివాలయాలు "హరహర మహాదేవ! శంభోశంకర” అంటూ భక్తుల నినాదాలతో మారుమ్రోగుతూ ఉంటాయి. శివనామాలకు ఉన్న విశిష్టత ఏమిటి? ఆ నామాలు స్తుతించి తరించిన వారెవరు? విషయాలను మనం తెలుసుకుందాం. భగవంతుని నామాలు శక్తియుక్తము. శుభ ప్రదము, క్షేమకరము, మోక్షకరము. శివేతి నామ దావాగ్నే న్మహాపాతక పర్వతా: భస్మే! భవంత్యనాయా సాత్సత్యం సత్యం న సంశయ:!! 🌹అంటే "శివనామం" అనే దావాగ్ని ఎదుట మహాపాపాలనే పర్వతాలను తేలికగా బూడిద చేసేస్తుంది. ఇది సత్యము. పాపాల వలన కలిగే సర్వ దు:ఖాలను, మన:క్లేశాన్ని నశింపచేసేది శివనామము ఒక్కటే! మనం మన పిల్లల అక్షరాభ్యాస సమయంలో, పిల్లలచేత మొదటిగా ”ఓం నమ:శివాయ సిద్ధం నమ: ” అని దిద్దిస్తాము. ఓం అంటే ప్రణవం. సాక్షాత్తు పరమాత్మ నోటినుండి వెలువడిందే. మిగిలినది పంచాక్షరీ మంత్రం. ఒక రకంగా ఇవి బీజాక్షరాలు విద్యకు అధిదేవత సరస్వతి అయినా, శుభకరుడు, జ్ఞాన స్వరూపుడు, మంగళకరుడు అయిన శివుని నామం దిద్దించి పలికింప చేయడం వారి భవిష్యత్తుకు పునాది. ధర్మరాజు శ్రీకృష్ణుని సందర్శించిన సందర్భంలో ఒకసారి ”కృష్ణా! వాసుదే...

💥"పూరీ" జగన్నాథ స్వామి రథయాత్రలో విశేషాలు...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ జగన్నాథ స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥"పూరీ" జగన్నాథ స్వామి రథయాత్రలో విశేషాలు... ఆషాఢమాసం వస్తోందనగానే అందరికీ జగన్నాథుని రథయాత్రే గుర్తుకు వస్తుంది. ఆషాఢమాసంలోని రెండోరోజు ఈ పండుగ చేస్తారు. కానీ ఈ రథయాత్రకి సంబంధించిన వింతలు చాలామందికి తెలియవు. అవేంటో మీరే చూడండి! ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర. ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకి వాడతారు. కానీ పూరీలో అలాకాదు! సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్లే గుడి బయటకు వస్తారు. ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారుచేస్తారు. వీటి తయారీని అక్షయతృతీయ రోజున మొదలు పెడతారు. జగన్నాథుడి కోసం చేసే రథాన్ని "నందిఘోష" అనీ బలభద్రుని కోసం తయారుచేసే రథాన్ని "తాళధ్వజం" అనీ సుభద్ర కోసం తయారుచేసే రథాన్ని "పద్మధ్వజం" అనీ పిలుస్తారు. ఈ రథాలని తయారుచేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ రథం ...

॥ శ్రీ సూర్య స్తోత్రం ॥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ సూర్య భగవానుడిని ఆరాధిస్తూ పండితులు ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని భావితరాలకు అందించారు. ఆ స్తోత్రాన్ని చెప్తూ సూర్యదేవున్ని ఆరాధిస్తే.. పూజిస్తే వారిని అన్నీ శుభాలే జరుగుతాయి. ఉదయాన్నే కొందరికి సూర్య నమస్కారం చేయడం అలవాటు. అలాంటి వారు సూర్యడిని దర్శించి నమస్కరించే సమయంలో ఈ స్తోత్రాన్ని స్మరిస్తే సూర్యదేవుని ఆశిస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. ॥ శ్రీ సూర్య స్తోత్రం ॥ ధ్యానం: ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ | ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ || కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః | జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ || బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః | అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ || ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః | సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ || పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః | అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || ౫ || కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః | ధర్...

💥ఆషాడమాసం విశిష్టత...

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥ఆషాడమాసం విశిష్టత... శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్నా... ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసరించే మాసం “ఆషాడమాసం” పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడ శుద్ద #విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు. ఆషాడ శుద్ద #పంచమి స్కంధ పంచమి గా చెప్తారు. సుబ్రమణ్య స్వామి ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ #షష్ఠి ని కుమార షష్ఠి గా జరుపుకొంటారు శుక్లపక్ష ...

💥జీవన విలువల బంగరు పూత "భగవద్గీత"

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥జీవన విలువల బంగరు పూత "భగవద్గీత" ప్రపంచ ప్రసిద్ధ రచనల్లో భగవద్గీత కు ఒక ప్రముఖమైన స్థానం ఉంది. భగవద్గీత ఓ మహోద్గ్రంథం. భగవద్గీత జన జీవన విలువల బంగరు పూత. భగవద్గీత హందూ సంస్కృతీ సంపత్తుల ఊట. భక్తినీ ముక్తినీ మోక్షాన్నీ అందించే మార్గం. భవ రోగ పీడితుల పాలిట మహా ఔషధం. అహం, మోహం, మమకారాలను దునుమాడే దివ్య సాధనం. అలాగే వ్యక్తిత్వ వికాసాన్ని అందించే మహావిధానం భగవద్గీత. కాబట్టి విస్తృత పరిధిలో మానవ వికాసాన్ని మనందరిలో, అణువణువునా ఆవిష్కరింపజేసే వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత అని చెప్పడం అతిశయోక్తి కాదు. 🌹వ్యక్తిత్వ వికాసంలో అయిదు ”వి” లు ఉంటాయి. వినయం, వివేకం, వందనం, విజ్ఞత, విజ్ఞానం అనేవి ఆ అయిదు ‘వి’ లు. ఈ అయిదు ‘వి’ లను విస్తృతంగా అన్యాపదేశంగా అందిస్తుంది భగవద్గీత. 🌹అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం లో, ఆంగ్లంలో ఉండే ఆరు ‘డి’ లు ఉంటాయని ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు. అవి డిసిప్లిన్‌ (క్రమశిక్షణ), డివినిటి (దివ్యత్వం), డివోషన్‌ (భక్తి భావం), డిటెర్మి నేషన్‌ (పట్టుదల), డిస్క్రిమినేషన్‌ (విచక్షణ), డెడికేషన్‌ (అంకిత భావం) ఈ ఆర...

💥కలియుగ ప్రత్యక్షదైవం.. శ్రీ వేంకటేశ్వరుడు!

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥కలియుగ ప్రత్యక్షదైవం.. శ్రీ వేంకటేశ్వరుడు! శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు.  పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం. భృగుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం శ్రీనివాసుడుగా వేంకటాద్రిపై అవతరించడం- ఇదంతా విష్ణులీలా విశేషమని మహర్షుల మాట. శ్రవణం నక్షత్రంనాడు, మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు. కావున ప్రతీ శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్పస్వామి వారు తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ భక్తులను తరింపజేస్తారు. స్వామి వారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం- ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది. "వినా వేంకటేశం, ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి" ...