💥జీవన విలువల బంగరు పూత "భగవద్గీత"

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥జీవన విలువల బంగరు పూత "భగవద్గీత"


ప్రపంచ ప్రసిద్ధ రచనల్లో భగవద్గీత కు ఒక ప్రముఖమైన స్థానం ఉంది.

భగవద్గీత ఓ మహోద్గ్రంథం.


భగవద్గీత జన జీవన విలువల బంగరు పూత.

భగవద్గీత హందూ సంస్కృతీ సంపత్తుల ఊట.


భక్తినీ ముక్తినీ మోక్షాన్నీ అందించే మార్గం.

భవ రోగ పీడితుల పాలిట మహా ఔషధం.


అహం, మోహం, మమకారాలను దునుమాడే దివ్య సాధనం.

అలాగే వ్యక్తిత్వ వికాసాన్ని అందించే మహావిధానం భగవద్గీత.


కాబట్టి విస్తృత పరిధిలో మానవ వికాసాన్ని మనందరిలో, అణువణువునా ఆవిష్కరింపజేసే వ్యక్తిత్వ వికాస గ్రంథం భగవద్గీత అని చెప్పడం అతిశయోక్తి కాదు.


🌹వ్యక్తిత్వ వికాసంలో అయిదు ”వి” లు ఉంటాయి. వినయం, వివేకం, వందనం, విజ్ఞత, విజ్ఞానం అనేవి ఆ అయిదు ‘వి’ లు.

ఈ అయిదు ‘వి’ లను విస్తృతంగా అన్యాపదేశంగా అందిస్తుంది భగవద్గీత.


🌹అదేవిధంగా వ్యక్తిత్వ వికాసం లో, ఆంగ్లంలో ఉండే ఆరు ‘డి’ లు ఉంటాయని ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్నారు.


అవి డిసిప్లిన్‌ (క్రమశిక్షణ),

డివినిటి (దివ్యత్వం),

డివోషన్‌ (భక్తి భావం),

డిటెర్మి నేషన్‌ (పట్టుదల),

డిస్క్రిమినేషన్‌ (విచక్షణ),

డెడికేషన్‌ (అంకిత భావం)

ఈ ఆరు ‘డి’ లను వినూత్న పద్ధతిన చర్చించి అందిస్తుంది భగవద్గీత.


🌹అంతేకాకుండా మూడు ‘పి’ లు...

ప్యూరిటీ (స్వచ్ఛత), పెర్ఫెక్షన్‌ (పరిపూ ర్ణత), పయస్‌ నెస్‌ (పవిత్రత) గురించి ఎన్నో విధాలుగా భగవద్గీత విపులీ కరిస్తుంది.

తత్ఫలితంగా సంపూర్ణత్వాన్ని మనలో ఆవిష్కరింప చేస్తుంది. అందువల్ల భగవద్గీతను వ్యక్తిత్వ పోషణాత్మక గ్రంథమని చెప్పక తప్పదు.


భగవద్గీత జీవితానికి శాంతిని, ప్రశాంతతను అందించే ఊరట.

పరమాత్మ శ్రీకృష్ణుడు చూపే త్రోవ.

జీవుడు భావించుకుంటున్నట్లుగా పరమాత్మునికి చేసుకునే సేవ.


వ్యవహారిక మార్గానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని, పారమార్ధిక తత్త్వాన్ని అందించే వరిష్ట గ్రంథం భగవద్గీత. 


అమరత్వాన్ని అమృత తత్త్వాన్ని ఆవిష్కరింపచేసే బంధం భగవద్గీత.


వ్యక్తిత్వ వికాస పరిపుష్టతను అందించే అద్భుతాల మూట.


ఆత్మ సౌందర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పరిపుష్టం చేసే ఉద్గ్రంధం భగవద్గీత.

బంధాలను, భవ బంధనాలను తగ్గించే మహోధృ త తరంగాల వాడి భగవద్గీత.


మానవాళికి జీవనాడి భగవద్గీత.

జీవిత పధాన్ని, విధానాన్ని, నిర్దేశించే మహావ్రాత భగవద్గీత. మన తలరాతను మార్చే మహా మంత్రం.


🌹అర్జునుడిని నిమిత్తమాత్రునిగా చేసుకుని, సర్వులకు ప్రతినిధిగా భావించి, సకల మానవాళికి, కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన బోధనల ఊట భగవద్గీత.


గురువులను, బంధు వులను, స్నేహతులను, సన్నిహతులను చూసి మమకారంతో జావగారి నీరు గారిపోయిన అర్జునుడికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణుడు చెప్పిన బలీయమైన మాటల మూట భగవద్గీత.


జీవితమనే యుద్ధంలో జయాలు, అపజయాలు, కష్టాలు, కన్నీళ్ళు, మోదం, ఖేదం తప్పవనీ, అన్నింటినీ ఓర్పుతో నేర్పుతో ధైర్యంగా ధీయుతం గా ఎదుర్కోవాల్సిందే అనే జీవిత పాఠాన్ని నేర్పే ”మేనేజ్మెంట్‌ గ్రంథం భగవద్గీత.

స్థిత ప్రజ్ఞతను, స్థిర విజ్ఞతను నేర్పించే మహోపదేశ సారం 

భగవద్గీత.


ఆ దేవదేవుడు మానవాళికి యిచ్చిన అభయం.

సాధకుని దివ్యత్వం అంచులకు తీసుకునిపోయే మహమాన్విత త్రోవ.


గాలీ, నీరూ, నిప్పూ, చెట్టూ, గుట్టా, పుట్టా, రాయీ, రప్పా, రెమ్మా, కొమ్మా, అన్నీ... అంతా... ఆ పరంధాముని మయమే అని చెప్పే వేదాంత సంగ్రహం. 


'అన్నీ నేనే’, ‘నువ్వు నిమిత్త మాత్రుడివి’ అనే ఆధ్యాత్మిక రహస్యాన్ని ఉదాహరణలు, సోదాహరణలతో వివరిస్తూనే, సోమరితనం, కర్మ అనాసక్తతను ప్రోత్సహంచకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, చేయాల్సిన పనిచేసి తీరాల్సిందే అనే పరమ సత్యాన్ని నొక్కిచెప్పే అసమాన అభివ్యక్తీకరణ భగవద్గీత.


సంపూర్ణ సమగ్ర జీవన తత్వాన్ని, జీవ తత్త్వాన్ని, జీవిత తత్త్వాన్ని, తాత్త్విక తను అందించే, పరిపూర్ణ ఆధ్యాత్మిక అనుభవాల ఆధునికత కలబోతల జ్ఞానాగ్నుల జిలుగు భగవద్గీత.


అందుకే భగవద్గీత (గీత) గీతామాత అయ్యింది. పూజ్యనీయురాలైంది. పూజలు అందుకుంటోంది.


గీతా పారాయణాన్ని ఓ యజ్ఞంగా నిర్వహిద్దాం.

గీత ను అర్ధం చేసుకుందాం.

యజ్ఞ ప్రసాదాన్ని ఆరగిద్దాం. యజ్ఞ ఫలాన్ని అనుభవిద్దాం.

సేకరణ... భక్తి ప్రభ💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు