💥శివ నామ విశిష్టత...
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱
🏵️🌼🏵️🌼🏵️
💥శివ నామ విశిష్టత...
శివాలయాలు "హరహర మహాదేవ! శంభోశంకర” అంటూ భక్తుల నినాదాలతో మారుమ్రోగుతూ ఉంటాయి. శివనామాలకు ఉన్న విశిష్టత ఏమిటి?
ఆ నామాలు స్తుతించి తరించిన వారెవరు?
విషయాలను మనం తెలుసుకుందాం.
భగవంతుని నామాలు శక్తియుక్తము. శుభ ప్రదము, క్షేమకరము, మోక్షకరము.
శివేతి నామ దావాగ్నే న్మహాపాతక పర్వతా: భస్మే!
భవంత్యనాయా సాత్సత్యం సత్యం న సంశయ:!!
🌹అంటే "శివనామం" అనే దావాగ్ని ఎదుట మహాపాపాలనే పర్వతాలను తేలికగా బూడిద చేసేస్తుంది. ఇది సత్యము. పాపాల వలన కలిగే సర్వ దు:ఖాలను, మన:క్లేశాన్ని నశింపచేసేది శివనామము ఒక్కటే!
మనం మన పిల్లల అక్షరాభ్యాస సమయంలో, పిల్లలచేత మొదటిగా ”ఓం నమ:శివాయ సిద్ధం నమ: ” అని దిద్దిస్తాము.
ఓం అంటే ప్రణవం. సాక్షాత్తు పరమాత్మ నోటినుండి వెలువడిందే. మిగిలినది పంచాక్షరీ మంత్రం.
ఒక రకంగా ఇవి బీజాక్షరాలు విద్యకు అధిదేవత సరస్వతి అయినా, శుభకరుడు, జ్ఞాన స్వరూపుడు, మంగళకరుడు అయిన శివుని నామం దిద్దించి పలికింప చేయడం వారి భవిష్యత్తుకు పునాది.
ధర్మరాజు శ్రీకృష్ణుని సందర్శించిన సందర్భంలో ఒకసారి ”కృష్ణా! వాసుదేవా! శివుని గురించి తపస్సు చేసి సంతానాన్ని పొందావు కదా. ఆయన నామాల విశిష్టత నాకు వివరించమని కోరగా...
కృష్ణుడు.. "ధర్మరాజా! పరమేశ్వరుడును పరిపూర్ణంగా భజించడం, ఆయన నామాలు సంపూర్ణంగా తెలుసు కోవడం, నాకు గాని బ్రహ్మకు గాని శక్యం కాదు.
అయినా నాకు తెలుసున్నంతవరకు ఆ శంభుడి నామాల విశేషం తెలుపుతున్నాను...
అనలుడు ఇంద్రుడు ఆదిత్యులు వసువులు మరుత్తులు మున్నగుగా గల దేవతా స్వరూపుడైన శివుని నామాలను స్మరించడం వల్ల కాని, వినడం వల్ల కాని సకలాభీష్టాలు సిద్ధిస్తాయి.
భీకరత్వం చేతను పరాక్రమం చేతను- సృష్టి సమయంలో రోదనతో ఉండే హరునకు ”#రుద్రుడు” అనే పేరు వచ్చింది.
దేవతలందరిచేత గొప్పగా ఆరాధింప బడుచున్నందు వల్ల
”#మహాదేవుడు”గా,
సకల సత్కర్మలకు ఫలవంతమైన శుభాలను కలిగించే వాడు. కనుక ”#శివుడు”గా,
సుస్థిరమైన తేజస్సుతో ప్రకాశిస్తూ, ధ్యానయోగంలో కదలని స్థితిలో ఉన్నందున ”#స్థాణుడు” అని,
పొగ రంగు వంటి జటాజూటం ధరించేవాడు కనుక ఆయనకు ”#ధూర్జటి” అనే నామం,
కదలని- కదిలే సకల జీవరాశులు యొక్క స్వరూపాలు తనలోనే ఇముడ్చుకున్నందువల్ల ”#బహురూపుడు”గా,
త్రిపురాసుర సంహారం వల్ల గౌరీపతి శరీరం నుంచి "విశ్వులు” అనే దేవతలకు జన్మనిచ్చిన వాడు కనుక ”#విశ్వరూపుడు”
జీవులు అన్నీ పశువులు. ఆ పశుపాలకుడు శివుడే కనుక ”#పశుపతి”గా,
నంది ని వాహనంగా కలవాడు కాబట్టి ”#వృషభవాహనుడు”
ఇవే కాక ఆగమ శాస్త్రాల్లో, ఆయనకు బహు నామాలు విశ్లేషించబడ్డాయి.” అని వివరించాడు కృష్ణుడు.
🍁🍁🍁🍁🍁
విష్ణుమూర్తి ప్రతీరోజూ తామరపుష్పాలతో సహస్ర నామాలతో అభిషేకం చేయడంవల్ల, శివుడు సంతోషించి, సంతుష్టుడై ”సుదర్శన చక్రం” అనే ఆయుధాన్ని బహూకరించాడు.
వ్యాఘ్రపాదుడనే విప్రుని కుమారుడు ఉపమన్యువు బాల్య దశలో సరైన ఆహారం, తాగడానికి పాలు దొరక్క శివుడు గురించి తపస్సు చేసి క్షీరసాగరాన్నే వరంగా పొందాడు.
"ఇంద్రద్యుమ్నుడు" అనే మహారాజు చాలా పాపాలు చేసాడు. తన ఆస్థానంలో ఉన్న వేదపండితుల సూచన మేరకు శివనామాలు స్తుతించడం, ప్రణవంతో కూడిన పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల ఉత్తమగతులు పొందాడు.
ఆదిశంకరాచార్యులు... తండ్రి శ్రీ శివగురువు, తన భార్యతో కలిసి, త్రిచూర్ లోని వృషభాచలం అనే కొండపై నెలకొన్న వృషాచలేశ్వరుని నిత్యం, రుద్ర సంహిత నమక, చమకం పారాయణలతో అభిషేకం చేయడంతోనే జన్మించారు. ఆయనను సాక్షాత్తు శివుని అంశగానే భావిస్తున్నాము.
🔸🔹🔸🔹🔸
"నయనార్"లు శివభక్తులు.
వారిలో పంచమ కులానికి చెందిన పుల్లయ్య గొప్ప శివభక్తుడు.
చిదంబరం దగ్గరగా ఉన్న తిరుప్పగూర్‌లోని శివుడు లోకనాథుడను దర్శించడానికి వెడితే, దేవాలయం అధికారులు ధ్వజస్థంభం వరకే అనుమతించారు తప్ప పరమేశ్వరుడి దర్శనం చేయనివ్వలేదు.
"పంచాక్షరీ మంత్రం పావన మంత్రం” అంటూ కీర్తించేసరికి గుడి లోని నంది ప్రక్కకు జరిగింది.
దాంతో శివుని దర్శనం కలగడంతో అక్కడే ఉన్న అధికారులు, ఇతరులు, ఆశ్చర్య పోయారు.
ఇప్పటికీ ఆ నంది అలాగే ఉంది.
ఇలా చాలామంది భక్తులు మనకు గోచరిస్తారు.
అందుకే అంటారు...
శివనామ తరీం ప్రాప్య సంసారబ్ధం తరంతయే
సంసార మూల పాపాని తాని నశ్యంత్యం సంశయం
🌹అంటే సంసారం అనే సముద్రంలో శివనామమనే పడవతో పయాణం చేస్తే సకల పాపాలు హరిస్తాయి అనడంలో సందేహం ఏమీలేదు.
సేకరణ... భక్తి ప్రభ 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment