💥ఆషాడమాసం విశిష్టత...

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥ఆషాడమాసం విశిష్టత...


శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్నా... ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసరించే మాసం “ఆషాడమాసం”


పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది.

ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు.

వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది.


ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది.

కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది.

అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు.

ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు.

దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.

ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి.


ఆషాడ శుద్ద #విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు.


ఆషాడ శుద్ద #పంచమి స్కంధ పంచమి గా చెప్తారు.

సుబ్రమణ్య స్వామి ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు.


ఆషాడ #షష్ఠి ని కుమార షష్ఠి గా జరుపుకొంటారు

శుక్లపక్ష షష్టినాడు శ్రీసుబ్రహ్మణ్యసామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది.


ఆషాడ #సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది.

ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు.

ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరి సమానం గా ఉంటాయి.


ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు.


మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం గా చెప్తారు( భోజనానికి వికృతి పదమే బోనం).

దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే "బోనాలు" అంటారు.

సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు.


ఆషాడ #శుద్దఏకాదశి ని "#తొలిఏకాదశి" అని "శయన ఏకాదశి" అని అంటారు.

ఈరోజు నుండి "చాతుర్మాస వ్రతం" ఆరంభమవుతుంది. దీనినే "మతత్రయ ఏకాదశి" అని అంటారు.


శ్రీ మహావిష్ణువు ఈదినం మొదలుకుని నాలుగు నెలలపాటు పాల కడలిలో శేష శయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు.

ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి. మరునాడు ద్వాదశినాడు తిరిగి శ్రీమహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదములు స్వీకరించి అటుపిమ్మట భోజనం చేయవలెను.

ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది.


శుక్లపక్ష #పూర్ణిమ: #వ్యాసపూర్ణిమ/గురుపూర్ణిమ


త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ.

శ్రీ వేదవ్యాసుల వారి జన్మదినంగా చెప్పబడుతూ ఉన్న ఈ రోజును వ్యాసుడిని, కృష్ణుడిని గురుపరంపరను పూజించాలని శాస్త్ర వచనం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥