సూర్యోపాసన

 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


“ఆత్మవత్ సర్వ భూతాని”  

నాలో నున్న ‘ఆత్మజ్యోతి’ అన్నిజీవులలో చరాచర జగత్తులో కూడా వున్నది ! అదే పరమాత్మ ! అదే పరంజ్యోతి పర బ్రహ్మ స్వరూపం ! ఆత్మ చైతన్యం !!


అందుకే సనాతన హిందూ ధర్మంలో మనం అన్నింటిలో, అంతటా భగవంతుని చూస్తాము!!


చెట్టు, పుట్ట, రాయి, రప్ప లో కూడా ఆ భగవంతుని దర్శిస్తాము ! ఇది తెలియక చేసే మూఢత్వం కాదు తెలిసి చేసే దివ్యత్వం !!


అంతటా వున్న భగవంతుడు నేను పూజించే ఈ ‘విగ్రహం' లో ఎందుకు వుండడు తప్పక వుంటాడు అని పరమ భక్తితో, పరమ విశ్వాసంతో చేసేదే !! ఉపాసన !!


మన ధర్మంలో అనేక ఉపాసనలున్నాయి !

అందులో ‘సూర్యోపాసన’ ముఖ్యమైనది !!


💥సూర్యోపాసన:


సూర్యుడు ప్రత్యక్ష దైవం !

ఈ జగత్తుకంతటికీ వెలుగును వేడిమిని ప్రసాదించే పరంజ్యోతి స్వరూపుడు !!

మన భౌతికమైన కనులతో చూడ గలిగే ‘సూర్యనారాయణుడు’ ! ఆరోగ్య ప్రధాత !

“ఆరోగ్యం భాస్కారాధిచ్ఛేత్ “ అంటుంది శాస్త్రం !

సూర్యభగవానుడు ” నమస్కార ప్రియుడు” !!

ప్రతి రోజు సూర్య నమస్కారములను చేయండి !!

ఆరోగ్యాన్ని పొందండి !!


🌹#సూర్యధ్యానం :-


ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ

నారాయణ సరసిజాసన సన్నివిష్టః !

కేయూరవాన్ మకరకుండల వాన్ కిరీటీ

హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రః !!


#తాత్పర్యం :-

సర్వాలంకార భూషితుడును, శంఖ,చక్ర, గదా పద్మములను ధరించిన వాడును, పద్మాసన స్థితుడును,

హిరణ్మయ స్వరూపుడును, “సూర్యమండలాంతర్గతుడైన శ్రీ సూర్య నారాయణుని" మేము ఆరాధించుచున్నాము !!


గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ” అష్ట ప్రకృతుల”లో, పరమ శివుని “అష్ట మూర్తుల” లో సూర్యుడు ఒకరు !!


🌹#సూర్యనమస్కార_మంత్రములు :-


1 – ఓం మిత్రాయ నమః

2 – ఓం రవయే నమః

3 – ఓం సూర్యాయ నమః

4 – ఓం భానవే నమః

5 – ఓం ఖగాయ నమః

6 – ఓం పూష్ణే నమః

7 – ఓం హిరణ్యగర్భాయ నమః

8 – ఓం మరీచయే నమః

9 – ఓం ఆధిత్యాయ నమః

10 – ఓం సవిత్రే నమః

11 – ఓం అర్కాయ నమః

12 – ఓం భాస్కరాయ నమః


ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే !

ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేజాంచ జాయతే !!


మనం ప్రతి రోజు సూర్య నమస్కారాలను చేద్దాము !!

మన ధర్మాన్ని మనము కాపాడుకుందాము !!

విశ్వశాంతి వర్ధిల్లును గాక ! శుభమ్ భూయాత్ !

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు