శరవణభవ మంత్రాక్షరషట్కం💥

 ⚜️🕉️🚩 ఓం శరవణ భవాయ నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం

శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం


శ్రీసుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపి, తేజస్వి.

అగ్నితేజం గలవాడు. కాని, గంగా తనయుడగుటచే అమృతంవలె చల్లదనమునిచ్చే స్వభావము గలవాడు.


ఆయన మంత్రం షడక్షరి “శరవణభవ”

ఇది మిక్కిలి మహిమాన్వితమైనది.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లను ఆరు దుర్గుణములను నశింపచేసి విజ్ఞానవంతులుగ రూపొందించునట్టిది. ఇహపర సుఖదాయకమైనది.


శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తేచాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.


శరవణభవ మంత్రంలో –

శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు

ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని

వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు

ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు

భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి

వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు


శ – శమింపజేయువాడు

ర – రతిపుష్టిని ఇచ్చువాడు

వ – వంధ్యత్వం రూపుమాపువాడు

ణ – రణమున జయాన్నిచ్చేవాడు

భ – భవసాగరాన్ని దాటించేవాడు

వ – వందనీయుడు

అని ‘శరవణభవ’కు గూఢార్థం.

🍁🍁🍁🍁🍁


💥శరవణభవ మంత్రాక్షరషట్కం💥


శక్తిస్వరూపాయ శరోద్భవాయ

శక్రార్చితాయాథ శచీస్తుతాయ |

శమాయ శంభుప్రణవార్థదాయ

శకారరూపాయ నమో గుహాయ || ౧ ||


రణన్మణిప్రోజ్జ్వలమేఖలాయ

రమాసనాథప్రణవార్థదాయ |

రతీశపూజ్యాయ రవిప్రభాయ

రకారరూపాయ నమో గుహాయ || ౨ ||


వరాయ వర్ణాశ్రమరక్షకాయ

వరత్రిశూలాభయమండితాయ |

వలారికన్యాసుకృతాలయాయ

వకారరూపాయ నమో గుహాయ || ౩ ||


నగేంద్రకన్యేశ్వరతత్త్వదాయ

నగాధిరూఢాయ నగార్చితాయ |

నగాసురఘ్నాయ నగాలయాయ

నకారరూపాయ నమో గుహాయ || ౪ ||


భవాయ భర్గాయ భవాత్మజాయ

భస్మాయమానాద్భుతవిగ్రహాయ |

భక్తేష్టకామప్రదకల్పకాయ

భకారరూపాయ నమో గుహాయ || ౫ ||


వల్లీవలారాతిసుతార్చితాయ

వరాంగరాగాంచితవిగ్రహాయ |

వల్లీకరాంభోరుహమర్దితాయ

వకారరూపాయ నమో గుహాయ || ౬ ||


ఇతి శ్రీశరవణభవమంత్రాక్షరషట్కమ్ |

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు