💥సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే...

 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే...


🍁విజయాలకు


కుమారస్వామి రెల్లుపొదలలో జన్మించాడన్న  విషయం మనకు  తెలుసు.

రెల్లుగడ్డిని ‘శరం’ అని కూడా  పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు వచ్చింది.

‘శరం’ అన్న పదానికి బాణం అని అర్థం కూడా వస్తుంది. 


శివుని సేనలకు నాయకునిగా మరియు  ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించిపెట్టే యోధునిగా కూడా  కుమారస్వామిని పేర్కొంటారు. 


అందుకే శత్రుభయం ఉన్నవారు, కోర్టు లావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే వారికీ  ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారు.


🍁సంతానానికి –


పార్వతీపరమేశ్వరులని ఈ సృష్టిలో ఆదిదంపతులకు చిహ్నంగా పేర్కొంటారు.

వారి యొక్క  తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుని ‘కుమార’ స్వామిగా పేర్కొంటూ ఉంటారు.

ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకము కూడా ఉంది.


🍁జ్ఞానానికి – 


సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది.

పరమేశ్వరుని యొక్క  దయతో, ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేథస్సు కుమారస్వామికి  ఉన్నదని  చెబుతారు.


ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవడం  జరుగుతుంది.

ఆ  శూలం పదునైనా ఆయుధానికే కాదు, సునిశితమైన బుద్ధికి కూడా ప్రతీక.

కాబట్టి పిల్లలకు చక్కగా చదువు  రావాలి అన్నా , తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని చెపుతారు.


🍁ఆధ్మాత్మిక ఉన్నతికి – 


శివుని తేజం రేతస్సుగా మారి గంగానదిలో పడింది, అది ఆరు భాగాలుగా మారి కుమారస్వామి జననం జరిగింది  అని  చెబుతారు.

ఆ ఆరు భాగాలనూ ఆరుగురు కృత్తికలనే అక్కచెళ్లెళ్లు పెంచారు. అందుకనే కుమారస్వామిని ‘షణ్ముఖుడు’ అని  కూడా అంటారు.


అయితే ఈ కథ వెనుక ఒక ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందని చెబుతారు.

ఆరు అనే సంఖ్య ఆరు దిక్కులకు (తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఊర్థ్వం, పాతాళం) సూచిస్తుంది. 


పురుష శక్తికి, స్త్రీ శక్తికి చిహ్నంగా నిలిచే రెండు త్రికోణాల కలయికలో కూడా ఆరు కోణాలు  మనకు కనిపిస్తాయి.

ఆ పవిత్ర సంఖ్యకు, పవిత్ర చిహ్నానికి ప్రతీకగా షణ్ముఖుని  చూడవచ్చును.


🍁యోగసాధనకు – 


కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కూడా  కనిపిస్తుంది.

మనలో నిద్రాణంగా ఉన్న కుండలినిని సర్పంతో పోలుస్తూ ఉంటారు.

ఆ కుండలి జాగృతం అయిన రోజున, మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు.

అందుకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగ శాస్త్రపు అంతిమలక్ష్యంగా కూడా కనిపిస్తుంది.

ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యం సర్పం రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చును.


🍁జాతక దోషనివారణకు –


వివాహం, సంసారం మరియు  సంతానం వంటి యోగాలకు కుజగ్రహం అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిషుల మాట!

ఆ కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహ జీవితంలో ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉందని  కూడా చెబుతూ ఉంటారు.

సుబ్రమ్మణ్యేశ్వర స్వామిని కనుక పూజిస్తే ఎటువంటి కుజ దోషానికైనా పరిష్కారం లభిస్తుందన్నది తరతరాల నుంచి ఒక  నమ్మకము.

🍁🍁🍁🍁🍁


దేవాదిదేవ రథమండలమధ్యవేద్య

దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తమ్ |

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన

వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 


🌹అర్థం – దేవాదిదేవా, రథముల సమూహములో మధ్యలో పరివేష్టితుడవై ఉండు వాడా, దేవేంద్రపీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లును చేతిలో పట్టుకుని,

శూరత్వము కలిగి, సురకోటిచే ప్రశంసింపబడిన ఓ వల్లీశనాథా, నాకు చేయూతనివ్వుము.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు