💥కలియుగ ప్రత్యక్షదైవం.. శ్రీ వేంకటేశ్వరుడు!

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥కలియుగ ప్రత్యక్షదైవం.. శ్రీ వేంకటేశ్వరుడు!


శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు. 


పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు.


వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం.


భృగుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం శ్రీనివాసుడుగా వేంకటాద్రిపై అవతరించడం- ఇదంతా విష్ణులీలా విశేషమని మహర్షుల మాట.


శ్రవణం నక్షత్రంనాడు, మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

కావున ప్రతీ శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్పస్వామి వారు తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ భక్తులను తరింపజేస్తారు.


స్వామి వారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం- ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది.


"వినా వేంకటేశం, ననాదో ననాథః

సదా వెంకటేశం స్మరామి స్మరామి" - స్వామీ నీవే మాకు దిక్కు తప్ప మరో దిక్కు లేదు. నిన్నేనిరంతరం స్మరిస్తూ ఉంటాం.


స్వామి వారి కృపా వీక్షణాలతో, మూగవాడు మాట్లాడ గలుగుతాడని, కుంటివాడు నడువ గలుగుతాడని భక్తుల విశ్వాసం.


అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే |

క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ||


- అంటూ భక్తులు రెండు చేతులూ జోడించి శ్రీహరి వేంకటేశ్వరుని వేడుకుంటూ ఉంటారు.


ప్రతిరోజూ వేలకొలదీ భక్తులు ఏడుకొండలస్వామిని దర్శించి తరించగా, యేటా బ్రహ్మోత్సవాలు ఇతర వసంతాది మహోత్సవాలు, స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు దర్శించే లక్షలాది భక్తులు దైవానుగ్రహ పాత్రులవుతారు.

ఏడుకొండల స్వామి వారి లీలలు వర్ణనాతీతములు.


"శ్రీ మార్కండేయ" మహర్షి వారు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యంలో వజ్ర కవచ స్తోత్రాన్ని రచించినట్లు ప్రసిద్ధి. 


ఇందులో శ్రీ వేంకటేశుని స్మరిస్తూ వుంటే, మనకు సంపూర్ణ రక్షణ వుంటుందని తెలియజేయబడుతుంది.

🍁🍁🍁🍁🍁


💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం💥


మార్కండేయ ఉవాచ


నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం

ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ


సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు

ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః


ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు

దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః


సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః

పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు


య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః

సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః


ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు