కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ

 ⚜️🕉️🚩ఓం శ్రీ వారాహి దేవ్యై నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


కృష్ణవర్ణా తు వారాహీ మహిషస్థా మహోదరీ

వరదా దండినీ ఖడ్గం బిభ్రతీ దక్షిణే కరే!!

ఖేట పాత్రాభయాన్ వామే సూకరాస్యా లసద్భుజా!!


🌹శ్రీవారాహీదేవి నల్లని కాంతితో, వరాహముఖంతో, మహిష వాహనం గలదై పెద్దపొట్టతో ఎనిమిది చేతులు (అష్టభుజ) కలిగి ఉంటుంది.


అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి... బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి.


వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి.

ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది.


వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే...

రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడుతారు. అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది.


నాగలిి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది.


"వారాహి దేవి" లలితా పరాభట్టారిక యొక్క సేనాని.

రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అన్నారు.


అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి), ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.

ఇది మహావారాహి (బృహద్వారాహి) యొక్క స్వరూపం.


ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.


పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి. శ్రీ విద్యా గద్యంలో

"అహంకార స్వరూప దండనాథా సంసేవితే,

బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే"

అని లలితను కీర్తిస్తారు...


దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు...

ఈ తల్లి ప్రాణ సంరక్షిణి.... ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం.


శాక్తేయులు వారాహీ దేవి పార్వతీ దేవి మాతృక అని నమ్ముతారు. ఈ మాతృకలు దానవులపై యుధ్దానికి వెళ్లే టప్పుడు అవసరానుగుణంగా దేవతలయొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలను యిచ్చినవి.

శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టించబడ్డ అన్ని మాతృకలను తనలో ఐక్యం చేసుకొని శంభుని సంహరించెనని శక్తి పురాణం లో ఉంది.


దేవీ భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజుని సంహరించేటపుడు వారాహీ మాతృకను సృష్టించెనట. 


దేవీ పురాణం లో వారాహి దేవిని వరహాజనని,

క్రితంత తనుసంభవ (మృత్యుసమయములో వచ్చేశక్తి అంటే యమశక్తి) గా కూడా వర్ణించేరు.

వారాహి దేవి వాహనం యెనుము, పాశం ధరించి వుండడం కూడా పై వాదనను బలపరుస్తుంది.


ప్రతీ మనిషి లోనూ వారాహీశక్తి నాభి ప్రాంతంలో వుండి మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది.


ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందని భక్తుల నమ్మకం.


🌹ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని #గుప్తనవరాత్రులు అంటారు.


ప్రకృతి పరంగా చూసినట్లైతే... ఈ సమయంలో వర్షం కురుస్తుంది... రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు... దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.


పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.


నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.

ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. 


🌹హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు:


-పంచమి

-దండనాథా

-సంకేతా

-సమయేశ్వరి 

-సమయ సంకేతా

-వారాహి 

-పోత్రిణి

-వార్తాళి

-శివా

-ఆజ్ఞా చక్రేశ్వరి 

-అరిఘ్ని


దేశం సుభిక్షంగా ఉండాలని... మనమంతా చల్లగా ఉండాలని... ధర్మం వైపు మనం నడవాలని... అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు