జగన్నాథ రథయాత్ర
⚜️🕉️🚩 జై జగన్నాథ 🌹🙏
త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం |
విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్ ||
🌹ఓ జగన్నాథ..! జగమును పాలించే విష్ణు భగవానుడా! అంటూ పై శ్లోకముతో శ్రీహరిని స్తుతించి, ప్రతి నిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.
🍁🍁🍁🍁🍁
"జగన్నాథుడు" అంటే విశ్వమంతటికి నాథుడు లేదా ప్రపంచానికి ప్రభువు అని అర్థం.
ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు.
పూరీ నగరంలోని జగన్నాథుని రథయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు.
రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి.
మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది.
ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు.
ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని 'పహండీ' అంటారు.
ఆ దశలో కులమత భేదాలకు తావుండదు.
గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా... 'ఇలపై నడిచే విష్ణువు'గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి.
పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు.
దీన్నే 'చెరా పహారా' అంటారు.
జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడంవల్ల అన్ని తీర్థయాత్రల చేసిన ఫలాలు లభిస్తాయని విశ్వాసం.
💥జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే
🌹జగములన్నిటికీ నాధుడైన జగన్నాథ స్వామీ... నా కనుల ప్రయాణములందు ఎల్లప్పుడూ ఉండుము.
🍁🍁🍁🍁🍁
💥 శ్రీ జగన్నాథాష్టకం💥
కదాచి త్కాళిందీ తటవిపినసంగీతకపరో
ముదా గోపీనారీ వదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 1 ||
భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే
దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే
సదా శ్రీమద్బృందా వనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 2 ||
మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే
వసన్ప్రాసాదాంత -స్సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థ స్సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 3 ||
కథాపారావారా స్సజలజలదశ్రేణిరుచిరో
రమావాణీసౌమ స్సురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రై రారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 4 ||
రథారూఢో గచ్ఛ న్పథి మిళఙతభూదేవపటలైః
స్తుతిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసింధు ర్భాను స్సకలజగతా సింధుసుతయా
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 5 ||
పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో
నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి
రసానందో రాధా సరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 6 ||
న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకితాం భోగవిభవం
న యాచే2 హం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూం
సదా కాలే కాలే ప్రమథపతినా చీతచరితో
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 7 ||
హర త్వం సంసారం ద్రుతతర మసారం సురపతే
హర త్వం పాపానాం వితతి మపరాం యాదవపతే
అహో దీనానాథం నిహిత మచలం నిశ్చితపదం
జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 8 ||
ఇతి జగన్నాథాష్టకం ||
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment