భక్తుల కల్పతరువు నరసింహుడు...

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥 భక్తుల కల్పతరువు నరసింహుడు...


భగవంతుని అవతారాలలో అత్యద్భుత అవతారంగా చెప్పగలిగే అవతారం "నారసింహావతారం"


సగం మనిషి సగం మృగం ఆకారంలో రూపు దాల్చడం నరసింహావతార ప్రత్యేకం.


దుష్టశిక్షణ శిక్ష రక్షణ సర్వాంతర్యామిత్వం, భక్తుని

మాటను నిజం చేయడం... నమ్మిన బంటును శాప

విముక్తుని గావించడం, ఎన్ని నియంత్రణలు, వరాలున్నా వాటిని అధిగమించి భక్తుడు లేక వైరి కోరుకున్న విధంగానే శతృ వధ చేయడం, సూక్ష్మం నుండి స్థూల రూపాన్ని ఏదైనా ధరించడం నరసింహావతారంలో విశిష్టతలు.


శ్రీహరి (మనిషి జంతువు కాని) నరసింహ రూపంలో, పగలూ రాత్రి గాని సంధ్యా సమయాన, ఇంటా బయటా గాని గుమ్మంలో, భూమ్యాకాశాలు కాని తన తొడపై,

హిరణ్య కశిపుని సంహరించాడు.


ప్రహ్లాదుని మాటను యధార్ధం చేసి, బ్రహ్మ వరాన్ని

గౌరవించి, తన అవతార తత్వాన్ని చాటాడు మహా

విష్ణువు. 


💥శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం:


ఉగ్రం వీరం మహావిష్ణుం 

జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్‌ మృత్యుర్‌ నమామ్యహం


ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలూ, అపమృత్యు దోషాలు తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందనీ శాస్త్రవచనం.


పెద్దలే కాదు, పిల్లల చేత కూడాఈ మంత్రాన్ని వల్లె వేయిస్తే... అనవసరమైన భయాలు దూరమై, స్థిరమైన బుద్ధి, ఆయురారోగ్యాలూ కలుగుతాయి.


🌹ఉగ్రం అంటే... నృశింహుడు ఉగ్రమూర్తి.

నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది.


🌹వీరం అంటే.. సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు.

నరసింహుడు వీరమూర్తి.

కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే. 


🌹మహావిష్ణుం అంటే... అన్ని లోకాల్లో అంతటా వుండే నరసింహ తత్వానికి ఈ నామం ప్రతీక.

సకల జీవరాశులన్నిటిలోనూ తానే వ్యక్తంగానూ, అవ్యక్తంగానూ పరమాత్మ భాసిస్తాడు.


🌹జ్వలంతం అంటే... సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయడం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన తత్త్వమే జ్వలంత శబ్దానికి అర్థం.


🌹సర్వతోముఖం అంటే... ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం.


🌹నృసింహం అంటే.. సకల జీవుల్లో సింహం చాలా శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించడానికి శ్రేష్టమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడుగా ఆవిర్భవించాడు.


🌹భీషణం అంటే... నరసింహుని శాసనశక్తి ప్రతీక భీషణత్వం. అత్యంత భయంకరమైన రూపం ఇది.


🌹భద్రం అంటే.. భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. ఇదే భద్రత్వం.


🌹మృత్యుమృత్యుం అంటే.. స్మరణ మాత్రం చేత అప మృత్యువును దూరం చేసేవాడు.

మృత్యువుకే మృత్యువైన వాడు నరసింహుడు మాత్రమే. మృత్యువును కలిగించేదీ, మృత్యువును తొలగించేది కూడా ఆ స్వామి అనుగ్రహమే.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥