💥సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం
⚜️🕉️🚩 శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే🌹🙏 💥ఓం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః💥 💥ధ్యాన మంత్రం: ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్. షడక్షర శరీరాయ షడ్విధాధ్వా విధాయినే షడధ్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ 💥భావము: ఆరు అక్షరముల మంత్రమే శరీరముగా గలవాడు, ఆరు విధముల జ్ఞానమును బోధించువాడు, ఆరు మార్గములకు అతీతమైన రూపము గలవాడు, ఆరు ముఖములు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము. 🍁🍁🍁🍁🍁 💥" సుబ్రహమణ్యేశ్వరుడు " మన శరీరంలోని కుండలిని శక్తికి సంపూర్ణమైన సంకేతం. మనలో కుండలిని రూపంలోన ఒదిగిన సుబ్రహ్మణ్యుడే పుట్టలో ఒదిగి ఆరాధనలు అందుకుంటున్న మహా సర్పరూపం. మనము "మార్గశీర్ష శుద్ధ షష్ఠి" నాడు పుట్టలో పాలని పోస్తాము. పుట్ట ఎవరో కాదు మానవ శరీరమే. మనము కూర్చొనప్పుడు వెనుక నుండి చుస్తే మన విశాలమైన క్రింద భాగం పుట్ట అడుగు భాగం. పోను పోను తల దగ్గరికి సన్నగా వెళ్లే విధానంలోనే పుట్ట ఆకారం ఉంటుంది. ఆ పుట్ట పై ఉండే చిల్లు అది శిరస్సు మధ్యలో ఉండే బ్రహ్మ రంద్రానికి సంకేతం. పాలు ఙ్ఞానమునకు సంకేతం. అందుకే పుట్టలో పాలు పోయడం అంటే