శ్రీసరస్వతీ అష్టోత్తరశతనామ స్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం మహాసరస్వత్యై నమః🌹🙏


యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతా

యావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా

యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితా

సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహా


💥భావము:-

మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి,

తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ!

బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!!

నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.

🍁🍁🍁🍁🍁


💥వాక్కుకు అధిపతి...

వాగ్దేవి, శారదా, వాణి, సరస్వతిని.. ప్రార్థిస్తే

మనకు విద్యా, బుద్ధిని, జ్ఞానమును (జ్ఞాపక శక్తిని),

ప్రజ్ఞను ఇచ్చును.


💥ఆమె కటాక్షము వుంటే మూగవాడు కూడా  గొప్ప పండితుడు అవుతాడు.

చాలామంది కవులకు సరస్వతి దేవి ప్రత్యక్షముగా దర్శనమిచ్చి అనుగ్రహించినది.


💥 పోతన కథ 💥

పోతన ఓరుగల్లు నగరమున బమ్మెర గ్రామమున జన్మించెను. తల్లి లక్కమ్మ, తండ్రి కేశన.

వ్యవసాయము చేసేవారు.


గురువైన పెనటూరి సోమనాథాచార్యుల ప్రేరణచే చిన్నతనమునే వీరభద్ర విజయము రచించెను. యవ్వనమున భోగని దండకం రచించి రాచకొండ రాజైన సర్వజ్ఞసింగ భూపాలునికి అంకితము చేసెను. 


అతనిలో మార్పు వచ్చెను. పొట్ట పోసుకొనుటకై కవిత్వమును మానవులైన రాజులకు అమ్మకుండా శాశ్వతమైన భగవంతునికి అంకితము ఇవ్వవలెననుకొనెను.


ఒకసారి పోతన గోదావరి తీరమున ధ్యానములో ఉండగా చంద్ర గ్రహణ దినమున సీతారాములు సాక్షాత్కరించి భాగవతమును తెలుగులో అనువదించి తమకే అంకితము చేయమని చెప్పిరి. 


శ్రీనాథుడు పోతనకు బావ. శ్రీనాథుడు రాజా ఆస్థాన కవిగా ఉండెను.

అందుకే పోతనను ఎప్పుడూ కవిత్వమును రాజుకు అంకితం ఇవ్వమని, రాజు దండిగా డబ్బులు ఇచ్చునని, నీ దారిధ్ర్యము తీరి పోవునని బలవంతము చేయుచుండెను.


పోతనకు సంకట పరిస్ధితి కల్పించినచో కవితను రాజుకు అంకితము చేయునని,

ఒకసారి శ్రీనాథుడు తన పరివారంతో పోతన ఇంటికి భోజనమునకు వచ్చెను.


అప్పుడు పోతన ఇంట్లో వండుటకు ఆహార పదార్థములు లేవు.

అప్పుడు పోతన రక్షింపమని సరస్వతి దేవిని ప్రార్థించెను.

ఆమె సాక్షాత్కరించి అతిధులకు కావాల్సినవన్నియు సమకూర్చెను.

భాగవతము పూర్తి అయిన పిమ్మట దానిని రాజుకు అంకితము చేయమని శ్రీనాథుడు అన్ని విధములుగా బలవంత పెట్టుచుండెను.


అప్పుడు సరస్వతి దేవి మళ్ళీ సాక్షాత్కరించి "సొమ్ము కొరకై నన్ను ఎవ్వరికీ అమ్మవలదు భగవంతునికి అంకితము చేయమని" చెప్పెను. 


సరస్వతి దేవిని నమ్మిన వారికి ఆమె కటాక్షము ఎప్పుడూ వుంటుంది.


💥శ్రీసరస్వతీ అష్టోత్తరశతనామ స్తోత్రం💥


సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా ।

శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రికా ॥ 1 ॥


శివానుజా పుస్తకహస్తా జ్ఞానముద్రా రమా చ వై ।

కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ ॥ 2 ॥


మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా ।

మహాభాగా మహోత్సాహా దివ్యాంగా సురవందితా ॥ 3 ॥


మహాకాళీ మహాపాశా మహాకారా మహాంకుశా ।

సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ ॥ 4 ॥


చంద్రికా చంద్రలేఖావిభూషితా చ మహాఫలా ।

సావిత్రీ సురసాదేవీ దివ్యాలంకారభూషితా ॥ 5 ॥


వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా చ భోగదా ।

గోవిందా భారతీ భామా గోమతీ జటిలా తథా ॥ 6 ॥


వింధ్యవాసా చండికా చ సుభద్రా సురపూజితా ।

వినిద్రా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా ॥ 7 ॥


సౌదామినీ సుధామూర్తి స్సువీణా చ సువాసినీ ।

విద్యారూపా బ్రహ్మజాయా విశాలా పద్మలోచనా ॥ 8 ॥


శుంభాసురప్రమథినీ దూమ్రలోచనమర్దనా ।

సర్వాత్మికా త్రయీమూర్తి శ్శుభదా శాస్త్రరూపిణీ ॥ 9 ॥


సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా ।

రక్తబీజనిహంత్రీ చ చాముండా ముండకాంబికా ॥ 10  ॥

 

కాళరాత్రిః ప్రహరణా కళాధారా నిరంజనా ।

వరారోహా చ వాగ్దేవీ వారాహీ వారిజాసనా ॥ 11 ॥


చిత్రాంబరా చిత్రగంధా చిత్రమాల్యవిభూషితా ।

కాంతా కామప్రదా వంద్యా రూపసౌభాగ్యదాయినీ ॥ 12 ॥


శ్వేతాసనా రక్తమధ్యా ద్విభుజా సురపూజితా ।

నిరంజనా నీలజంఘా చతుర్వర్గఫలప్రదా ॥ 13 ॥


చతురాననసామ్రాజ్ఞీ బ్రహ్మవిష్ణుశివాత్మికా ।

హంసాననా మహావిద్యా మంత్రవిద్యా సరస్వతీ ॥ 14 ॥


మహాసరస్వతీ తంత్రవిద్యా జ్ఞానైకతత్పరా ।

ఇతి శ్రీ సరస్వత్యష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్ ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి