అనంతాళ్వారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులలో అగ్రగణ్యుడు.

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి

ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు

మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత

నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు


కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

కొండలంత వరములు గుప్పెడువాడు...


💥అనంతాళ్వారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులలో అగ్రగణ్యుడు.

భగవద్రామానుజుల ఆజ్ఞమేరకు స్వామికి పుష్పమాలా కైంకర్యం చేయటానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. 


ఇత‌డు కొండ పైన వెన‌క భాగంలో ఉండేవాడు.

ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు.

ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నారు.


పూలతోటను పెంచాలని నిర్ణయం త‌ర్వాత‌ పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయానికి వ‌చ్చారు.

దాంతో చెరువును త‌వ్వడం మొదలు పెడతాడు.


ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు.

చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య గ‌ర్భ‌వ‌తి.


అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది.

అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు ఒక‌ బాలుని రూపంలో అక్కడికి వస్తాడు.


గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు.

దానికి అత‌ను ఒప్పుకోడు నిరాక‌రిస్తాడు.

కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు.


ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.

అది గ‌మ‌నించి అనంతాళ్వారులు భార్య‌ని ప్ర‌శ్నించ‌గా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది.


దాంతో అనంతాళ్వారులుకు ప‌ట్ట‌లేనంత కోపం వ‌స్తుంది.

కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు.

అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది.

దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి తిరిగి వారికి కనబడకుండా మాయం అయిపోతాడు.


ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారు కు చెప్తారు.

దాంతో కంగారు కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు.

గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు.


తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాల పై పడి క‌న్నీరు మున్నీరు అవుతాడు.

గాయం త‌గిలింద‌నే బాధ‌తో ఆ నొప్పి తెలియ‌కుండా ఆయ‌న గ‌డ్డం వ‌ద్ద ప‌చ్చ‌క‌ర్పూరం పెడ‌తాడు.  

🍁🍁🍁🍁🍁


ఇప్పటికీ స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దటం తిరుమల ఆలయంలో ఆచారంగా కొనసాగుతునే ఉంది.

అనంతాళువారు ఉపయోగించిన గునపం శ్రీవారి ఆలయంలో ముఖ్య ద్వారం కుడివైపు పైన భాగంలో వేలాడదీసి కనబడుతుంది. 


ఈ సంఘటనను "అన్నమాచార్యుల" వారు

"కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు" అనే ప్రసిద్ధమైన సంకీర్తనలో ప్రస్తావించారు.


👉రెండవ చరణంలో "అచ్చపు వేడుకతోడ అనంతాళువరికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు" అని నుతించారు.


💥తిరుమలనంబి, తిరుకచ్చినంబి మొదలైన స్వామి భక్తులను ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఎలా కరుణించి అనుగ్రహించాడో,

వేర్వేరు పరిస్థితులలో ఆయన లీలలను అన్నమాచార్యుల వారు అద్భుతంగా తెలియజేశారు.


అందుకే అన్నమాచార్యుల వారి కీర్తనలలో అంత మహిమ ఉంది.

ఆయన మంత్ర సమానమైన కీర్తనలను మనకు అందించిన మహనీయుడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి