రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః రాజా సర్వస్యలోకస్య దేవానాం మఘవానివ ॥

 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏


రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః

రాజా సర్వస్యలోకస్య దేవానాం మఘవానివ ॥


                 — శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాండే సప్తత్రింశస్సర్గః(౧౩వ శ్లోకము)


"శ్రీరాముడు" అంటే ఏమిటో ఒక్క శ్లోకములో నిర్వచనము ఇచ్చాడు మహానుభావుడైన మారీచుడు:


"శరీరము ధరించి దిగి వచ్చిన ధర్మమే రాముడు.

సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధు జీవనుడు.

అతని పరాక్రమమునకు తిరుగులేదు.

దేవేంద్రుడు దేవతకు ప్రభువైనట్టే,

ఈ సమస్త చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ రాముడు"


💥శ్రీరామచంద్రుడు తన తండ్రి ఇచ్చ మేరకు అరణ్యవాసమునకై బయలుదేరుతూ తల్లి ఆశీస్సులకై కౌసల్య వద్దకు వెళ్లినమస్కరించాడు. 


ఆమె ఇట్లు దీవించింది-


యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ


నియమేన చ|


సవై రాఘవ శార్దూల| ధర్మస్త్వా మభిరక్షతు||


ఇందు తల్లి "ధర్మంచర".. ధర్మమార్గములో సంచరించు అని ఉపదేశించలేదు.

ధర్మమే రాముని శీలము.

స్వాభావికముగా రాముడు ధర్మరక్షకుడు.

ఈ విషయం ఆమెకు తెలిసినదే.


అందుచేత ఆమె పరోక్షముగా ధృతి నియమముల ఆవశ్యకతను గూర్చి తెలుపుతూ

"రాఘవా! నీవు ధైర్యముతో నియమముతో ఏ ధర్మమును ఆచరిస్తూ ఉన్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక!" అని అన్నది.


'ధృతి' అనగా ధైర్యము. నియమము అనగా కట్టుబాటు. ధర్మపథంలో నియమము, ధృతి అత్యవసరములు.


💥శ్రీ రామునికి అగ్ని పరీక్ష:


రావణ వధానంతరం సీతకు రాముడు అగ్నిపరీక్ష విధించాడు.

కానీ అంతకు ముందే సీత రామునికి అగ్ని పరీక్ష విధించింది.

సీతాన్వేషణ కు లంకకు వెళ్ళిన హనుమంతుని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని సమక్షంలో నిలుపుతాడు.

హనుమంతుని పై కోపించిన రావణుడు అతని తోకకు నిప్పు పెట్టమని చెపుతాడు.

రాక్షసులు హనుమ వాలమునకు నిప్పు పెడతారు.

ఆ నిప్పుతోనే హనుమంతుడు లంకాదహనం చేస్తాడు.


ఆ సమయంలో అశోకవనంలో ఉన్న సీతాదేవి,

“నా భర్త పరస్త్రీని కోరని వాడైతే, ధర్మస్వరూపుడే కనుక అయితే, నేను మనసా వాచా పరపురుషుని కోరని దాననైతే హనుమ వాలమున కాలుచున్న అగ్ని చల్లారును గాక" అని సంకల్పించింది.

హనుమంతుని తోక చల్లారింది.


అలా సీత పెట్టిన అగ్ని పరీక్షలో శ్రీరాముడు కూడా నిగ్గు తేలాడు.


💥శ్రీరాముడు ధర్మాన్ని మానవ జీవన సమున్నత ఆదర్శంగా ఆచరణాత్మక సుప్రతిష్ఠ చేసాడు.


💥అట్టి శ్రీరాముడు మనకి ఆదర్శము, ఆరాధ్యము కావాలి.

మనకు కావలసినది రామరక్ష.

రాముడు ధర్మస్వరూపి. "రామో విగ్రహవాన్‌ ధర్మః"

ధర్మాచరణకు అవసరమైన ధృతి నియమములను రామనామామృతమే మనకు ఇయ్యగలదు.


💥సత్యమనేది జ్వలించే అగ్ని.

అందులో నిగ్గుతేలునదేదో అదే ధర్మము.

అందుకే శ్రీరాముడు ధర్మమూర్తి.

సీతామాత ధర్మ స్వరూపిణి.


అందుకే రామాయణం ఇలా చెప్తుంది:


సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మః ప్రతిష్ఠితః

సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం


🌹🙏 !! శ్రీరామచంద్రమూర్తికి జై !! 🌹🙏

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments