మహా మృత్యుంజయ మంత్ర "పద" తాత్పర్యాలు:

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


ఓం నమః శంభవే చ మయోభవే చ నమః

శంకరాయ చ మయస్కరాయ చ నమః

శివాయ చ శివతరాయ చ || 


భావం:

ప్రాపంచిక ఆనందంగాను, మోక్షానందంగాను ఉంటున్నవాడూ;

ప్రాపంచిక ఆనందాన్ని మోక్షానందాన్ని ఇచ్చేవాడూ,

మంగళస్వరూపుడూ, తనను పొందిన వారిని శివమయంగా గావించేవాడూ అయిన పరమ శివునికి నమస్కారం. 

🍁🍁🍁🍁🍁


 💥మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము.

ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది.

దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు.


ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు.


💥మంత్రం


ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్


💥ప్రయోజనం


చనిపోతామనే భయంతో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు.

దీర్ఘరోగం తో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారినుంచి వారిని, తీగనుంచి దోసకాయను దూరం చేసినట్లు, దూరంచేస్తాడు.


💥విశేషాలు


ఈ మంత్రమునకు ఋషి వశిష్ఠుడు.

ఛందస్సు అనుష్టుప్.

దేవుడు శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు)

బీజము "హామ్"

శక్తి దేవి అమృతేశ్వరి.


ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు.


💥అర్థం:


సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను. 


బంధనాత్ = బంధనం నుంచి (అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి );

ఉర్వారుకమివ = దోసకాయను వలె ;

మృత్యోః = చావునుంచి ;

ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక; అమృతాత్ = మోక్షము నుంచి;

మా = వద్దు (వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉండునుగాక)


తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక.


మానవుడి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహా మృత్యుంజయ మంత్రం. 


💥మహా మృత్యుంజయ మంత్ర "పద" తాత్పర్యాలు:


💥ఓం

భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మజ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది.

ఇదొక శక్తి స్వరూప ధ్వని.

అ-ఉ-మ అనే అక్షరాల సంగమమే ఓంకారం. 


ఋగ్వేదం నుండి అకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మ కారం పుట్టాయి.

ఈ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది. 


ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుంటుంది.


💥త్య్రంబకం:

భూత, భవిష్యత, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం.

ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు.


త్య్రంబకమంటే మూడు నేత్రాలని అర్థం.

శివుని భ్రూమధ్యంలోనున్న సూక్ష్మరూప నేత్రం మూడవనేత్రం.

ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం.

దీనినే జ్యోతిర్మఠం అని అంటారు.

శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి.


💥యజామహే:

అంటే ధ్యానిస్తున్నానని అర్థం.

సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి.


💥సుగంధిం:

సు - మంచిదైన, గంధ - సువానసన ద్రవ్యం.

మంచి వాసనలతో కూడుకొన్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు ఆ స్వామి మనపై తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు.


💥పుష్టివర్ధనం:

మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొనియున్నాడు. సృష్టి యావత్తూ ఆయన అధీనంలో ఉంది.


💥ఉర్వారుకంఇవబంధనం:

దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కించుతాడు. 


💥మృత్యోర్ముక్షీయ:

అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మృత్యువు నుంచి కూడా మనకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం.


మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమే కాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే.


💥అమృతాత్:

స్వామి అల్ప సంతోషి. సులభప్రసన్నుడు.


ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది.

శివతత్వంలో 3 కు ఎంతో ప్రాధాన్యం ఉంది.

ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను 3 మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు.

మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభిస్తుంది.


ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం