💥సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం

 ⚜️🕉️🚩 శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే🌹🙏


💥ఓం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః💥


💥ధ్యాన మంత్రం:

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్

కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహమ్.


షడక్షర శరీరాయ షడ్విధాధ్వా విధాయినే

షడధ్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ


💥భావము:

ఆరు అక్షరముల మంత్రమే శరీరముగా గలవాడు, ఆరు విధముల జ్ఞానమును బోధించువాడు, ఆరు మార్గములకు అతీతమైన రూపము గలవాడు, ఆరు ముఖములు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము.

🍁🍁🍁🍁🍁


💥"సుబ్రహమణ్యేశ్వరుడు" మన శరీరంలోని కుండలిని శక్తికి సంపూర్ణమైన సంకేతం.

మనలో కుండలిని రూపంలోన ఒదిగిన సుబ్రహ్మణ్యుడే పుట్టలో ఒదిగి ఆరాధనలు అందుకుంటున్న మహా సర్పరూపం.

మనము "మార్గశీర్ష శుద్ధ షష్ఠి" నాడు పుట్టలో పాలని పోస్తాము.

పుట్ట ఎవరో కాదు మానవ శరీరమే.


మనము కూర్చొనప్పుడు వెనుక నుండి చుస్తే మన విశాలమైన క్రింద భాగం పుట్ట అడుగు భాగం.

పోను పోను తల దగ్గరికి సన్నగా వెళ్లే విధానంలోనే పుట్ట ఆకారం ఉంటుంది.

ఆ పుట్ట పై ఉండే చిల్లు అది శిరస్సు మధ్యలో ఉండే బ్రహ్మ రంద్రానికి సంకేతం.

పాలు ఙ్ఞానమునకు సంకేతం.

అందుకే పుట్టలో పాలు పోయడం అంటే శరీరం నిండుగా ఙ్ఞానమును నింపడం అని అర్థం.

అంటే ఏది చెయ్యకూడదో, చేయవచ్చునో దాన్ని నింపడం.


కుండలం అంటే పాము చుట్ట అని అర్థం.

పాము చుట్టవేసుకొని కూర్చుంటుంది, సాగదీసిన వెన్నెముక నిలబడ్డ పాము యొక్క శరీరం.

పాము పడగ విప్పే విధానం మానవ తల వెనుక భాగం నుండి వ్యాపించే విధానం.

పాము చుట్టలు చుట్టుకునేది మూల ఆధార చక్రానికి సంకేతం.


మనిషి సుబ్రహ్మణ్యుడు కావాలి అంటే కుండలిని శక్తిని జాగృతం చేసుకుని బ్రహ్మ రంద్రం నుండి అమృత బిందువులు శరీరమంతా చిలికించుకున్న సందర్భంలో మాత్రమే కాగలడు అని మన ప్రాచీనులు చెప్పారు.


శరీరంలో అసుర సంపద లేకుండా దేవతల వైపు సేనాపతిగా ఉండి అన్ని దైవ లక్షణాలు కలిగి ఉండటమే సుబ్రహ్మణ్య విధానం.


సంపూర్ణమైన దైవ భావనలు కలిగి ఉండటం సుబ్రహ్మణ్య విధానానికి వెళ్లే మార్గ లక్షణం. 


"శరవణభవ" అనే ఆరు అక్షరాల మహా మంత్రమే జీవుని తరింపజేసే, కుండలిని జాగృత పరిచే దివ్య శక్తి మయమైన శబ్ద బ్రహ్మ స్వరూపం.

🔸🔹🔸🔹🔸🔹


💥సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కళ్యాణం:


తారకాసుర సంహారానంతరం ఒక రోజు శ్రీ మహా విష్ణువు బ్రహ్మాది దేవతలతో పరివేష్టుడై ఉండగా కుమార స్వామి ఆ సభ లోకి ప్రవేశించాడు .


 ఆయన అందానికి దేవతలందరు నిశ్చేష్టులైనారు.

మహావిష్ణువు సైతం నోట మాట రాక తదేక దృష్టి తో స్కందుని వీక్షించగా ఆనందంతో ఆయన కళ్ళ నుండి రెండు భాష్పాలు నేలకొరిగి అవి అతిలోక సుందరీమణులుగా మారాయి.

 

విష్ణుమూర్తి వారికి అమృతవల్లి, సుందరవల్లి అని నామకరణం చేసాడు.

వారు సైతం స్కందుని అందానికి చకితులై విష్ణువును "తండ్రి! ఆ దివ్య పురుషుడిని మాకు భర్తగా ఒసగ మని ప్రార్ధించగా ఆయన మందహాసముతో... 


"పుత్రికలారా! స్కందుడు ఉద్భవించిన "శరవణ" తటాకము పక్కన ఆయన కొరకై తపించండి.

మీ కోర్కెలు ఈడేరగలవు" అని సెలవీయగా వారు ఆయన సూచన ప్రకారము తపస్సు ప్రారంభించారు.


వారి తపస్సుకు మెచ్చి కుమారస్వామి ప్రత్యక్షమై.. "బాలమణులారా మీ కోరిక సమంజసమైనదైనా దానిని వెంటనే తీర్చలేను అంటూ 


అమృతవల్లి వైపు తిరిగి "నీవు దేవేంద్రుడి కుమార్తెగా వున్న కాలంలో నిన్ను చేపట్టగలను" అని చెప్పి 


సుందరవల్లితో "నీవు భూలోకంలో శివముని కుమార్తె గా వున్నప్పుడు నిన్ను వరిస్తాను" అని అనుగ్రహించి అక్కడినుండి అదృశ్యమయ్యాడు. 

  

💥ఆ వరానుసారముగా మరు జన్మలో అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తెగా "దేవసేన" జన్మించింది.  

ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది.

ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్య సేనతో కలిసి ఆడుకుంటోంది.  


ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు.  

ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.

ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు.

ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి  ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది... అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళటానికి సన్నద్ధమై   "నీకేం వరం కావాలో కోరుకో" అని ఇంద్రుడు దేవసేనని అడిగాడు. 

 

ఆమె "దేవేంద్రా! మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తిప్రతిష్టలు కల వాడు భర్తగా రాగలడని చెప్పాడు.

ఆ మాటను మీరు నిజం చెయ్యండి.  

దేవతలకు రాక్షసులకు గెలువ శక్యం కాని వాడు, భయంకరమైన రాక్షసులను సంహరించే వాడు, ముల్లోకాలను రక్షించే వాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు" అని కోరింది.

 

ఆమె మాటలు విని దేవేంద్రుడు "సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు” అని అనుకొన్నాడు.


దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు.


బ్రహ్మదేవుడు "దేవేంద్రా! ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు" అన్నాడు.

 

ఆ మాటలను ఆలకించిన దేవసేన ఆనందంతో ఆ మహాపురుషునికై నిరీక్షించసాగింది.

తన సమస్యలన్నీ తొందరలో తొలగిపోనున్నాయని ఆనందముతో ఐరవతాన్ని అధిరోహించిన ఇంద్రుడు ఆమెను తన ఐరావతం పైకి ఎక్కించాడు .

 

అప్పటినుండి ఆమెను "దేవయాని" గా పిలిచారు . 

 

ఆమె భద్రగజం ఫై వస్తున్నప్పుడు దేవ సైన్యము ఆ గజము వెనక వస్తున్న విషయం గ్రహించి ఆమెను "దేవసేన" గా కీర్తించారు . 

 

పిమ్మట ఆమె మేరుపర్వతానికి తపస్సు చేయటానికి మరలినది.


ఇంకా దేవసేనను "షష్టిదేవి" గా కొలుస్తారు.

ఈ విషయం దేవి భాగవతం లో స్పష్టంగా చెప్పబడినది.

ఈవిడ సంతానానికి అధిష్టాన దేవత . 


💥ఆదిశేషుని అంశ తో "సుందరవల్లి" శివముని అనే మహర్షికి అయోనిజయై ప్రభవించగా ఆయన ఆ శిశువును సాకమని బిల్లు దొర నంబిరాజుకు అప్పగించగా అతను ఎంతో సంతోషంతో ఆమెను పెంచసాగాడు .

 

"వల్లి" నామధేయముతో ఆ కన్య సదా కార్తికేయ స్మరణతో ఆయన కోసం ఎదురుచూడసాగింది

 

కార్తికేయుడు వీరివురికి సూర పద్ముడు, సింహముఖుల సంహారానంతరం వివాహం చేసుకొనగలనని వరమిచ్చారు గావున ఆ ఘడియ కోసం వారి నిరీక్షణ కొనసాగింది.


💥సుబ్రహ్మణ్య స్వామి మార్గశిర షష్టినాడు  ఇంద్రుని కుమార్తె అయిన "శ్రీదేవసేన" "శ్రీవల్లీదేవి" లను వివాహమాడాడు.


💥సుబ్రహ్మణ్య స్వామి వారి ఇద్దరు భార్యలంటే ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలుగా భావిస్తారు. 


వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక.

దేవసేనా అమ్మ వారంటే ఇంద్రియశక్తి అంటే సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి