💥శ్రీ సుబ్రహ్మణ్య స్వామి "నిత్య" పూజ లో "అథాంగ పూజ" నామాలు💥

 ⚜️🕉️🚩 ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏


యదా సన్నిధానం గతా మానవా మే –

భవామ్భోధి పారం గతా స్తే తదైవ |

ఇతి వ్యంజయ న్సిన్దుతీరే య ఆస్తే –

త మీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ 


💥భావం

"నా సాన్నిధ్యమును పొందిన వెంటనే మనుజులు సంసార సాగరమును దాటుదురు" అని సూచించుచు,

సముద్ర తీరముననున్న పరాదేవత యొక్క పుత్రుడగు పవిత్రుడైన సుబ్రహ్మణ్యుని స్తుతింతును.

🍁🍁🍁🍁🍁


💥సర్వశక్తిమంతుడైన "సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" కరుణామయుడు. దయాహృదయుడు.

పిలిచిన వెంటనే పలికే దైవం.


💥సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు.

తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు.

దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు.


ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు.

హిరణ్యకశ్యపుని కుమారుడు ‘నీముచి’.

‘నీముచి’ కొడుకు తారకాసురుడు.

తారకాసురుడు రాక్షసుడు.

అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సుచేసి ఆయన ఆత్మ లింగాన్ని వరంగా పొందుతాడు.


అంతే కాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు.

వర ప్రభావంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు.

అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోతారు.

ఇక తమ వల్లకాదనుకునీ... తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని శివుడ్ని వేడుకున్నారట.


వారి కోరిక మేరకు శివాంశతో "కుమారస్వామి" జన్మించాడు.

కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుడ్ని సంహరించాడు.

🔸🔹🔸🔹🔸🔹🔸


💥శ్రీ సుబ్రహ్మణ్య స్వామి "నిత్య" పూజ లో "అథాంగ పూజ" నామాలు💥


💥సుబ్రహ్మణ్య అంగపూజ💥


ఓం వల్మీక భవాయ నమః - పాదౌ పూజయామి |


ఓం జితాసుర సైనికాయ నమః- జానునీ పూజయామి |


ఓం రౌద్రయే నమః - జంగే పూజయామి |


ఓం భయనాశనాయ నమః - ఊరూ పూజయామి


ఓం బాల గ్రహోచ్చాటనాయనమః - కటిం పూజయామి


ఓం భక్త పాలనాయనమః - నాభిం పూజయామి |


ఓం సర్వాభీష్ట ప్రదాయనమః -హృదయం పూజయామి |


ఓం విశాల వక్షసే నమః - వక్షస్థలం పూజయామి!


ఓం అభయ ప్రధాన ప్రశస్త హస్తాయ నమః - బాహూన్ పూజయామి |


ఓం నీలకంఠ తనయాయ నమః - కంఠం పూజయామి |


ఓం పతిత పావనాయ నమః - చుబుకం పూజయామి |


ఓం పురుష శ్రేషాయనమః - నాసికాం పూజయామి |


ఓం పుణ్యమూర్తయే నమః - శ్రవణాని పూజయామి |


ఓం కమల లోచనాయ నమః - నేత్రా పూజయామి |


ఓం కస్తూరీ తిలకాంచిత ఫాలాయ నమః - లలాటం

పూజయామి | 


ఓం వేదవిధుషే నమః - ముఖం పూజయామి |


ఓం త్రిలోక గురవే నమః - శిరః పూజయామి |


ఓం భస్మో ద్దూళిత విగ్రహాయ నమః - సర్వాణ్యం గాని

పూజయామి |


శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం

శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం🙏

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు