అర్థనారీశ్వర తత్వం" అంటే ఏంటి? దాని వెనుకున్న పరమార్థం ఏంటి?💥

 ⚜️🕉️🚩 ఓం నమో పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర 🌹🙏

💥ఓం నమః శివాయ💥


💥"అర్థనారీశ్వర తత్వం" అంటే ఏంటి? దాని వెనుకున్న పరమార్థం ఏంటి?💥


పురుషుడు "స్థిర" స్వభావం - స్త్రీ "మాయా"(మార్పు) స్వరూపం ఇదే అర్థనారీశ్వర తత్వం.


అర్థ-నారి-ఈశ్వర... అంటే సగం స్త్రీ-సగం పురుషుడు. ఇద్దరూ కలిస్తే అర్థనారీశ్వరుడు.


సృష్టిలో ప్రతీది రెండుగా ఉంటుంది.


పగలు-రాత్రి


చీకటి-వెలుగు


సుఖం-దుంఖం


విచారం-సంతోషం


వీటిలో ఏ రెండూ ఒకేసారి ఉండవు.

ఒకటి లేకుండా మరొకటి ఉండవు.

రెండింటి సమ్మేళనం ఒకటవుతుంది.


పగలు రాత్రి కలిస్తే రోజు, సుఖం-దుంఖం కలిస్తే జీవితం, బొమ్మ-బొరుసు ఉంటే ఓ నాణెం.

ఇలా స్త్రీ-పరుషుడు కలిస్తే సృష్టి అని చెబుతుంది అర్థనారీశ్వరతత్వం.

ఒక్కచోటే ఉంటారు ఒకరికొకరు కనపడరు. కానీ ఇద్దరూ కలిస్తేనే విశేషం. 


ప్రతిమనిషి లోనూ అర్థనారీశ్వర తత్వం ఉంటుంది.

అంటే స్త్రీ-పురుషులిద్దరిలోనూ స్త్రీ తత్వం-పురుష తత్వం రెండూ ఉంటాయి. 


భార్యా భర్త అన్యోన్యంగా ఉంటూ... తప్పు అయినా ఒప్పు అయినా... ఆచరణలోనూ ,ఆలోచనలోనూ కర్మలలోను , కార్యాలలోను , నిర్ణయాలలోనూ , నిర్మాణాలలోనూ ఒకటిగా  ఉండాలని సూచించే హిందూ ధర్మమే అర్థనారీశ్వర తత్వం.


💥సాధారణంగా ఈశ్వరుడు స్థిరస్వభావం... తనలో మార్పులుండవు.

అమ్మవారు మాయా స్వరూపం... అంటే మారుతూ ఉంటుంది.

సృష్టిలో రెండే శాశ్వతం ఒకటి మారేది మరొకటి మారనిది.

స్థిర తత్వం పురుషతత్వం అయితే, మాయా తత్వం స్త్రీ సొంతం.


మళ్లీ మాయా తత్వం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో... పురాణాల ఉద్దేశం అది కాదు.


మార్పు అంటే పురుషుడి చతుర్విద ఆశ్రమాల్లో స్త్రీ అనేక పాత్రలు పోషిస్తుందని అర్థం.


🍁బ్రహ్మచర్యం స్త్రీ చేయి పట్టుకోవడంతో ముగుస్తుంది


🍁ఆమెను భార్య కింద మార్చుకుని గృహస్థ ఆశ్రమాన్ని పూర్తిచేస్తాడు పురుషుడు.


🍁వానప్రస్థంలో అంటే 60 ఏళ్ల వయసులో అదే భార్యను తల్లిగా భావిస్తాడు.


🍁ఇక చివరిగా సన్యాస ఆశ్రమం... అంటే సన్యాస ఆశ్రమంలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు.

కానీ "నాతిచరామి" అనిన భార్య చేయి విడిచిపెట్టడం భావ్యం కాదు.

అందుకే తన జీవితానికి పరిపూర్ణతను కల్పించిన భార్యకు సన్యాస ఆశ్రమంలో అమ్మవారిగా భావిస్తాడు.


💥అంటే పురుషుడు ఒక్కడే... కానీ ఒకే స్త్రీ మారుతూ వచ్చింది.

అందుకే స్త్రీని మాయాస్వరూపం అంటారు.

భార్యగా ఆమెకున్న ఘనతను గుర్తించే తనలో సగ భాగం చేసుకుని అర్థనారీశ్వరుడుగా మారాడు పరమశివుడు.

🍁🍁🍁🍁🍁


💥"అర్థనారీశ్వర తత్వం" అంటే శరీరంలో సగభాగం పంచివ్వడం కాదు.

భర్త తీరుని గమనిస్తూ అక్కడ ఎలా ఉండాలో గ్రహించి అలా నడుచుకోవడం. 


పంచభూత క్షేత్రాల్లో స్వామి, అమ్మవార్లను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.


అరుణాచలంలో అగ్నిలింగం:

ఇక్కడ స్వామివారు ఆగ్రహంతో ఉంటారు-అందుకే ఇక్కడ అమ్మవారు అత్యంత శాంత స్వరూపంతో ఉంటారు.


జంబుకేశ్వరంలో శివుడు జలలింగం:

అంటే స్వామివారు శాంతంగా ఉంటారు.

అందుకే ఇక్కడ అమ్మవారు ఆగ్రహంగా ఉంటారు.

ఆ ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఎదురుగా తనయుడైన వినాయకుడి విగ్రహం కూడా కనిపిస్తుంది.

అయినప్పటికీ స్వామి శాంత స్వరూపం కావడంతో అమ్మవారు ఆగ్రహంగా కనిపిస్తారు.


కంచిలో పృథ్విలింగం:

ఇక్కడ సైకత లింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది.

అంటే సున్నితమైన శివుడన్నమాట.

సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు కావడంతో సైకత లింగంపై అభిషేకం చేస్తే కరిగిపోతుందనే ఆలోచనతో... భర్తను రక్షించుకునేందుకు అమ్మవారు జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది.


చిదంబరంలో ఆకాశలింగం:

అంటే యజమాని ఇంట్లోలేడు. బయటకు వెళ్లాడని అర్థం.

అంటే మళ్లీ రారు అని కాదు. అందుకే ఇక్కడ అమ్మవారు దృష్టితో నిలబడి ఉంటారు.

అంటే నా భర్త విశ్వమంతా వ్యాపించి ఉన్నారని చెప్పే సంకేతం.


శ్రీకాళహస్తి వాయులింగం:

వాయువు వేగానికి ప్రతీక.  అందుకే ఇక్కడ అయ్యవారి అవసరాన్ని అర్థం చేసుకుని అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా కొలువై ఉంటుంది.


💥అంటే భర్త ప్రవర్తన, అవసరం, ఆపదను ముందుగానే గ్రహించి ఆయనకు అనుకూలంగా మారడమే అర్థనారీశ్వర తత్వం అని చెబుతున్నాయి పంచభూతలింగాలు కొలువైన క్షేత్రాలు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Post a Comment

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు